
న్యూఢిల్లీ: బ్రోకింగ్ సంస్థ కార్వీ తనఖా ఉంచిన షేర్ల స్వాధీనానికి సంబంధించి .. యాక్సిస్ బ్యాంకు పిటిషన్‌పై జనవరి 15లోగా తగు ఉత్తర్వులు ఇవ్వాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) శుక్రవారం సూచించింది. దీనిపై 15 రోజుల్లోగా తీర్పునివ్వాలం టూ డిసెంబర్ 17న ఇచ్చిన ఆదేశాలను తాజాగా సవరించింది. క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని ఆరోపణలున్న కార్వీపై (కేఎస్‌బీఎల్) పలు ఆంక్షలు అమలవుతున్న సంగతి తెలిసిందే. కార్వీ తనఖా పెట్టిన షేర్లపై యాక్సిస్ బ్యాంక్ రూ. 81 కోట్లు రుణమిచ్చింది. ఆ షేర్లను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా.. కార్వీ ఖాతాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలంటూ నియంత్రణ సంస్థలను యాక్సిస్ బ్యాంక్ కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment