న్యూఢిల్లీ: అంతిమ లబ్దిదారుల(బీవో) వెల్లడి నిబంధనలను వ్యతిరేకిస్తూ సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రిబ్యునల్(శాట్)ను ఆశ్రయించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్(ఎఫ్‌పీఐ) సంస్థలు తాజాగా వెనక్కి తగ్గాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జారీ చేసిన బీవో నిబంధనల వెల్లడి గడువు ముగియనుండటంతో అత్యవసర ఉపశమనాన్ని కోరుతూ తొలుత శాట్‌కు ఫిర్యాదు చేశాయి. మారిషస్ ఎఫ్‌పీఐ సంస్థలు ఎల్‌టీఎస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్, లోటస్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సెబీ కొత్తగా విడుదల చేసిన నిబంధనల అమలు వాయిదాను కోరుతూ దరఖాస్తు చేశాయి.
అయితే ఎఫ్‌పీఐల తరఫు న్యాయవాదులు ఫిర్యాదులను ఉపసంహరించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటికే కోర్టుకు విన్నవించుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిచాయి. గత ఐదు రోజులుగా ఎఫ్‌పీఐలు తమ పోర్ట్‌ఫోలియోలను విజయవంతంగా రీబ్యాలన్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనల పరిధిలోకి రాని హోల్డింగ్స్‌ను లిక్విడేట్ చేసుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అదానీ గ్రూప్‌పై 2023 జనవరిలో యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెలువరించిన నివేదికలో ఈ రెండు ఎఫ్‌పీఐల పేర్లను ప్రస్తావించడం గమనార్హం!
ఏం జరిగిందంటే?
సెబీ బీవో నిబంధనల అమలులో మరింత గడువు కోసం ఎఫ్‌పీఐలు శాట్‌ను ఆశ్రయించాయి. హోల్డింగ్స్ విషయంలో యాజమాన్య హక్కుల పూర్తి వివరాలను వెల్లడించని ఎఫ్‌పీఐలకు సెబీ సెపె్టంబర్ 9 డెడ్‌లైన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 2025 మార్చివరకూ గడువు పెంపును కోరుతూ రెండు ఎఫ్‌పీఐ సంస్థలు శాట్‌కు దరఖాస్తు చేశాయి. 2023 ఆగస్ట్‌లో సెబీ బీవో నిబంధనలను జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment