రియల్ ఎస్టేట్ మార్కెట్ రోజు రోజుకి పెరుగుతోంది. ప్లాట్ల్స్ లేదా అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అయితే గత కొంత కాలంగా పెద్ద ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో భారతదేశంలో ఏడు ప్రధాన నగరాల్లో సగటు అపార్ట్‌మెంట్ సైజులు గత ఏడాది 11 శాతం పెరిగాయి.
పెద్ద ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2022లో 1175 చదరపు అడుగులు ఉన్న అపార్ట్‌మెంట్ల పరిమాణం 2023 నాటికి 1300 చదరపు అడుగులకు చేరిందని అనరాక్ రీసెర్చ్ ఒక నివేదికలో వెల్లడించింది.
2020, 2021 కంటే కూడా 2023లో ఢిల్లీ NCR, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, హైదరాబాద్, కోల్‌కతా, పూణే, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఫ్లాట్స్ పరిమాణం పెరిగినట్లు తెలిసింది.
👉ఢిల్లీ NCRలో ఫ్లాట్ పరిమాణం అత్యధిక వృద్ధిని సాధించింది. అంటే 2022లో 1375 చదరపు అడుగులు ఉన్న ప్లాట్ 2023 నాటికి 1890 చదరపు అడుగులకు చేరింది. దీన్ని బట్టి చూస్తే ఈ నగరంలో పరిమాణం 37 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. కొనుగోలుదారుల డిమాండ్ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ల వైపు తిరగడం వల్ల డెవలపర్‌లు పెద్ద అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నారు.
👉హైదరాబాద్‌లో 2022లో 1775 చదరపు అడుగులున్న ప్లాట్ 2023 నాటికి 2300 చదరపు అడుగులకు చేరింది. అంటే హైదరాబాద్‌లో ప్లేట్ సైజు 30 శాతం పెరిగింది.
👉బెంగళూరులో, సగటు ఫ్లాట్ పరిమాణం 2023వ సంవత్సరంలో 26% పెరిగింది. 2022లో 1,175 చదరపు అడుగుల నుంచి 2023లో 1,484 చదరపు అడుగులకు పెరిగింది.
👉పూణేలో సగటు ఫ్లాట్ పరిమాణాలు 2022లో 980 చదరపు అడుగుల నుంచి 2023లో 11% పెరిగి 1,086 చదరపు అడుగులకు చేరుకున్నాయి.
👉చెన్నైలో ప్లాట్ పరిమాణం 2022 కంటే 5 శాతం పెరిగింది. 2022లో 1200 చదరపు అడుగులున్ ఫ్లాట్ సైజు 2023 నాటికి 1260 చదరపు అడుగులకు చేరింది.
ఇదీ చదవండి: ముందుగానే హింట్ ఇచ్చిన నిర్మలమ్మ - నాలుగు అంశాలు కీలకం
Comments
Please login to add a commentAdd a comment