grinder
-
పండగొస్తోంది...మిక్సర్ గ్రైండర్ క్లీనింగ్ టిప్స్ : కొత్తగా మెరుస్తుంది
పూర్వకాలంలాగా రోళ్లు, కలం, తిరగళ్లు ఇపుడు పెద్దగా వాడటం లేదు. అవి ఎలా ఉంటాయో, ఎలా పనిచేస్తాయో కూడా ఈ తరం చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇపుడంతా మిక్సీలు, గ్రైండర్లు మయమే. అటు ఉగాది పండుగ సమీపిస్తోంది. ఉగాది నుంచి వరుసగా పండుగలు షురూ అవుతాయి. చుట్టాలు, పక్కాలు.. కొత్త అల్లుళ్లు.. హితులు..స్నేహితులు ..ఈ సందడి మామూలుగా ఉండదు. ఇలాంటి సమయంలో మన వంట ఇంటిలో అన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా మిక్సీ గ్రైండర్. మిక్సర్ గ్రైండర్ లేకుండా వంటను ఊహించుకోవాలంటేనే కష్టం. ఒక్కోసారి జార్స్ సరిగ్గా పనిచేయక ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సరిగ్గా పని ఉన్నపుడో, చుట్టాలొచ్చినపుడో పని చేయనని మొరాయిస్తుంటాయి. అయితే దీనికి కారణాలు చాలా ఉన్నాయి. సాధారణంగా పచ్చళ్లు, రకరకాల పొడులు, పొడులు, అల్లం వెల్లుల్లి, ఇతర పేస్ట్‌లు చేసేందుకు మిక్సీ గ్రైండర్ వాడతాం. వాడిన తరువాత ఎప్పటికపుడు చక్కగా క్లీన్ చేసుకోవాలి. గాస్కట్ (జార్ మూత చుట్టూ ఉండే రబ్బరు) బ్లేడ్లు కూడా తీసి శుభ్రం చేసుకోవాలి. లేదంటే మిక్సీజార్తో పని ఎంత సులువో, అది మొరాయిస్తే అంత కష్టం. ఎప్పటికప్పుడు క్లీన్‌గా నీట్‌గా ఉంచుకుంటేనే, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా ఎక్కువరోజులు మన్నుతాయి. మిక్సీని, జార్స్‌ని ఎలా క్లీన్ చేయాలి? వంటసోడా: మురికి పట్టి, మొరాయించిన మిక్సీ జార్ సరిగ్గా పనిచేయాలంటే.. బేకింగ్ సోడా కూడా హెల్ప్ చేస్తుంది. బేకింగ్ పౌడర్‌లో కొద్దిగా వేడి నీరు పోసి పేస్టులా చేయండి. దీంతో జార్స్‌ని అప్లై చేసి, కొద్దిగా జార్లో వేసిన రెండు సార్లు తిప్పాలి. ఈ తర్వాత శుభ్రమైన నీటితో క్లీన్ చేయండి. వెనిగర్: వెనిగర్, నీళ్లు కలిపి జార్స్‌లో వేసి కాసేపు అలానే ఉండనివ్వండి. ఒక్కసారి మిక్సీ వేయండి. తరువాత నీటితో క్లీన్ చేస్తే బ్లేడ్లు, జార్ మొత్తం శుభ్రంగా తయారవుతుంది. పిండి , జార్లో పేరుకుపోయిన వ్యర్థాలను సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది. నిమ్మ తొక్కలు: నిమ్మ తొక్కలతో కూడా జార్స్‌ని చక్కగా క్లీన్ చేయొచ్చు. నిమ్మతొక్కలు, కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ కొద్దిగా నీరు వేసి మిక్సీని ఆన్ చేయండి. ఒకటి రెండు నిమిషాలు తిప్పండి. అలాగే మిక్సీని మొత్తాన్నికూడా జాగ్రత్తగా మెత్తని క్లాత్‌తోగానీ, స్పాంజితో గానీ క్లీన్ చేసుకుంటే.. చక్కగా కొత్తదానిలా మెరిపోతుంది. నోట్ : మిక్సీని క్లీన్ చేసేటపుడు బ్లేడుల కారణంగా మన చేతి వేళ్లు తెగకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మిక్సీ మోటర్లోకి అస్సలు వాటర్ పోకూడదు. ఒక్క చుక్క నీరు పోయినా మోటర్ పాడయ్యే అవకాశం ఉంది. -
నిజాయితీకి నిలువుటద్దం కలాం: ఆ చెక్కను జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి
న్యూఢిల్లీ: ‘ఇతరులు ఇచ్చే కానుకలు, బహుమానాల వెనుక స్వార్థపూరిత కారణం ఉండొచ్చు. మన నుంచి ఏదో ఒకటి ఆశించి ఇలాంటివి ఇస్తుంటారు. అది స్వీకరించే ముందు ఈ విషయం ఆలోచించాలి’.. ప్రఖ్యాత సైంటిస్ట్, భారతరత్న, దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బాల్యంలోనే తన తండ్రి వద్ద నేర్చుకున్న పాఠమిది. ఈ పాఠాన్ని జీవితాంతం ఆయన ఆచరించారు. విలువలకు, నిజాయతీకి మారుపేరైన అబ్దుల్ కలాం ఇతరుల నుంచి ఏనాడూ కానుకలు ఆశించలేదు. ఎవరైనా ఇలాంటివి ఇస్తే దాని ధర ఎంతో తెలుసుకొని చెక్కు లేదా డబ్బులు పంపించేవారు. మిస్సైల్ మ్యాన్ కలాం గొప్పతనాన్ని తెలియజేసే మరో సంఘటన వెలుగులోకి వచి్చంది. కలాంకు సంబంధించిన ఈ ఉదంతాన్ని ఐఏఎస్ అధికారి ఎం.వి.రావు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 2014లో కలాం ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘సౌభాగ్య వెట్ గ్రైండర్’ అనే సంస్థ ఆయనకు ఒక గ్రైండర్‌ను బహూకరించింది. దాన్ని స్వీకరించడానికి ఆయన తొలుత అంగీకరించలేదు. చివరకు బలవంతం మీద స్వీకరించారు. ఆ మరుసటి రోజే దాని ధర తెలుసుకొనేందుకు తన సహాయకుడిని మార్కెట్‌కు పంపించారు. తర్వాత తన వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి చెక్కును సౌభాగ్య సంస్థకు పంపారు. చెక్కును ఆ సంస్థ నగదుగా మార్చుకోకపోవచ్చన్న అనుమానం ఆయనకు వచ్చింది. తన బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయ్యిందో లేదో కనుక్కున్నారు. కాలేదని తెలిసింది. గడువులోగా నగదుగా మార్చకోకపోతే గ్రైండర్‌ను వెనక్కి ఇచ్చేస్తానని సౌభాగ్య సంస్థకు కలాం సమాచారం పంపారు. ఇక చేసేది లేక ఆ సంస్థ ఆ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేసి, డబ్బులు తీసుకుంది. అబ్దుల్ కలాం ఇచ్చిన చెక్కును జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి భద్రంగా దాచుకుంది. ఎం.వి.రావు షేర్ చేసిన పోస్టుపై నెటిజన్లు సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురిపిస్తున్నారు. కలాం వ్యక్తిత్వాన్ని గుర్తుచేసుకుంటున్నారు. -
అన్లిమిటెడ్ ఫ్యాషన్ ఆఫర్: రూ. 399 లకే పిజియాన్ గ్రైండర్
హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా అన్లిమిటెడ్ ఫ్యాషన్ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.7వేల కొనుగోలుపై రెండు జార్ల పిజియాన్ మిక్సర్ గ్రైండర్(రూ.3,175 విలువైన)ను రూ.399లకే పొందవచ్చు. అలాగే 3,500 కొనుగోలుపై రూ.2వేలు విలువ చేసే 10 పీసుల సెల్లో డిన్నర్ సెట్ రూ.199లకే అందిస్తుంది. ప్రారంభ ధర రూ.200తో అన్ని రకాల బ్రాండెడ్ ఫ్యాషన్ దుస్తులను అందుబాటులోకి తెచ్చింది. హెచ్డీఎఫ్సీ కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ గొప్ప అవకాశాన్ని కస్టమర్లందరూ వినియోగించుకోవాలని కంపెనీ సీవోవో వినీత్ జైన్ కోరారు. -
మినీ గ్రైండర్ ధర ఎంతో తెలుసా?
బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్, సంప్రదాయ పిండివంటలు.. ఇలా వంటకమేదైనా పిండి లేదా నూక వంటింట్లో తప్పనిసరిగా ఉండాల్సిందే. వాటిని బయట కొనుగోలు చేసుకోవాల్సిన పని లేకుండా ఈ డ్రై గ్రైండర్ నిమిషాల్లో సిద్ధం చేస్తుంది. చిరుధాన్యాలు, సుగంద ద్రవ్యాలు, మసాలా దినుసులు ఇలా వేటినైనా ఈ యంత్రం పిండి చేసేస్తుంది. ఇడ్లీ నూక, చపాతీ పిండి, కాఫీ పౌడర్ ఇలా వేటినైనా తయారు చేసుకోవచ్చు. డివైజ్‌కి ఎడమవైపు ఉన్న రెగ్యులేటర్.. పవర్ ఆన్ ఇండికేటర్‌గా పని చేస్తుంది. మెటల్ హ్యాండిల్ కలిగిన ఒక మూత.. గ్రైండర్జార్కి అడ్జస్ట్ చేసుకుని అందులో గ్రైండ్ చేసుకోవాల్సిన పదార్థాలను వేసుకుని ఎడమవైపు లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ హై స్పీడ్ గ్రైండర్.. మూడంటే మూడు నిమిషాల్లో దేన్నైనా పిండి చేయగలదు. ఇదే మోడల్లో 150 గ్రాముల నుంచి 2500 గ్రాముల వరకూ ఉండే మెషిన్స్ ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయి. పరిమాణం పెరిగేకొలదీ ధర పెరుగుతుంది. చిత్రంలోని డివైజ్ 150 గ్రాముల సామర్థ్యం కలది. ధర 69 డాలర్లు (రూ.5,256) -
ఆంధ్రాప్యారిస్‌లో 'అమ్మ'కానికి గ్రైండర్లు
తెనాలి: తమిళనాడు ‘అమ్మ’ గ్రైండర్లు మన రాష్ట్రంలో అమ్మకానికి వచ్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ రాష్ర్ట ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసిన మిక్సీలు, మినీ వెట్ గ్రైండర్లు గుంటూరు జిల్లా తెనాలిలో దర్శనమిచ్చాయి. ఆంధ్రాప్యారిస్ తెనాలి చెంచుపేట సమీపంలోని పెట్రోలు బంకు వద్ద శుక్రవారం ఈ వస్తువులు అమ్మకానికి పెట్టారు. మార్కెట్ ధర కంటే తక్కువకే అమ్ముతుండడంతో ప్రజలు కొనుగోలు చేసేందుకు ఎగబాడుతున్నారు. రెండు నెలల కిందట కూడా నరసరావుపేటలో అమ్మ గ్రైండర్లు అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. -
‘అమ్మ’కానికి గ్రైండర్లు
నరసరావుపేటరూరల్ : తమిళనాడు ‘అమ్మ’ గ్రైండర్లు మన రాష్ట్రంలో అమ్మకానికి వచ్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ రాష్ర్ట ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసిన టేబుల్ టాప్ గ్రైండర్లు గుంటూరు జిల్లా నరసరావుపేటలో దర్శనమిస్తున్నాయి. రెండు రోజులుగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట నుంచి వీటిని కొందరు లారీల ద్వారా ఇక్కడికి చేరవేస్తున్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కన వీటిని అమ్మకానికి పెట్టారు. ఒక్కో గ్రైండర్‌ను కేవలం రూ.1,400కే విక్రయిస్తుండటంతో మంగళవారం ‘అమ్మ’ గ్రైండర్లను కొనేందుకు జనం ఎగబడ్డారు. -
శుభకార్యాలకు ముందు రోలు-రోకలి పూజ ఎందుకు చేస్తారు?
నివృత్తం మిక్సీలు, గ్రైండర్లు వంటి ఆధునిక పరికరాలు వచ్చినా... ఇప్పటికీ చాలామంది తమ ఇళ్లలో రోలు, రోకలి ఉంచుకుంటూ ఉంటారు. ఏదైనా శుభకార్యాన్ని మొదలు పెట్టేముందు వాటిని శుభ్రంగా కడిగి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెడతారు. ఆ తరువాతే అసలు కార్యాన్ని మొదలు పెడతారు. ఇలా చేయడానికి కారణం ఉంది. శాస్త్రాల ప్రకారం రోలు పార్వతీదేవి స్వరూపం. రోకలి లేక పొత్రం అంటే శివ స్వరూపం. అందువల్ల వాటిని పవిత్రమైన ప్రదేశాల్లో ఉంచాలనీ, వాటిని పూజించాకే శుభకార్యాలు ప్రారంభించాలనీ శాస్త్రాలు సూచిస్తున్నాయి. చల్లకొచ్చి ముంత దాచినట్లు... పూర్వం ఒక ఊరిలో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకంటూ ఎవ్వరూ లేకపోవడంతో ఒంటరిగానే జీవించేది. పక్కింట్లో ఉండే ఇల్లాలు ఆ పెద్దావిడకి సాయం చేస్తూ ఉండేది. తమ ఇంట్లో ఏం చేసినా కూడా ఆవిడకు పెడుతూ ఉండేది. ఓసారి ఈ పెద్దావిడకి మజ్జిగ కావలసి వచ్చింది. పక్కింటావిడని అడుగుదామని ముంత తీసుకుని వెళ్లింది. అయితే అడగడానికి మొహమాటం అడ్డొచ్చి, ముంతను దాచేసింది. అడగకుండానే చాలా సాయం చేస్తుంది కదా, ఇక చల్ల కూడా అడగడం ఎందుకులే అనుకుని తిరిగొచ్చేసింది. అలా ఈ కథ నుంచి పుట్టుకొచ్చిందే పై సామెత. ఎవరైనా ఏదైనా చెప్పడానికి వెళ్లి, చెప్పలేక ఇబ్బంది పడినప్పుడు ఈ సామెత వాడతారు.