
బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్, సంప్రదాయ పిండివంటలు.. ఇలా వంటకమేదైనా పిండి లేదా నూక వంటింట్లో తప్పనిసరిగా ఉండాల్సిందే. వాటిని బయట కొనుగోలు చేసుకోవాల్సిన పని లేకుండా ఈ డ్రై గ్రైండర్ నిమిషాల్లో సిద్ధం చేస్తుంది. చిరుధాన్యాలు, సుగంద ద్రవ్యాలు, మసాలా దినుసులు ఇలా వేటినైనా ఈ యంత్రం పిండి చేసేస్తుంది. ఇడ్లీ నూక, చపాతీ పిండి, కాఫీ పౌడర్ ఇలా వేటినైనా తయారు చేసుకోవచ్చు. డివైజ్‌కి ఎడమవైపు ఉన్న రెగ్యులేటర్.. పవర్ ఆన్ ఇండికేటర్‌గా పని చేస్తుంది.
మెటల్ హ్యాండిల్ కలిగిన ఒక మూత.. గ్రైండర్‌జార్‌కి అడ్జస్ట్ చేసుకుని అందులో గ్రైండ్ చేసుకోవాల్సిన పదార్థాలను వేసుకుని ఎడమవైపు లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ హై స్పీడ్ గ్రైండర్.. మూడంటే మూడు నిమిషాల్లో దేన్నైనా పిండి చేయగలదు. ఇదే మోడల్‌లో 150 గ్రాముల నుంచి 2500 గ్రాముల వరకూ ఉండే మెషిన్స్ ఆన్ లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. పరిమాణం పెరిగేకొలదీ ధర పెరుగుతుంది. చిత్రంలోని డివైజ్ 150 గ్రాముల సామర్థ్యం కలది.
ధర
69 డాలర్లు
(రూ.5,256)
Comments
Please login to add a commentAdd a comment