brake fast
-
మినీ గ్రైండర్ ధర ఎంతో తెలుసా?
బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్, సంప్రదాయ పిండివంటలు.. ఇలా వంటకమేదైనా పిండి లేదా నూక వంటింట్లో తప్పనిసరిగా ఉండాల్సిందే. వాటిని బయట కొనుగోలు చేసుకోవాల్సిన పని లేకుండా ఈ డ్రై గ్రైండర్ నిమిషాల్లో సిద్ధం చేస్తుంది. చిరుధాన్యాలు, సుగంద ద్రవ్యాలు, మసాలా దినుసులు ఇలా వేటినైనా ఈ యంత్రం పిండి చేసేస్తుంది. ఇడ్లీ నూక, చపాతీ పిండి, కాఫీ పౌడర్ ఇలా వేటినైనా తయారు చేసుకోవచ్చు. డివైజ్‌కి ఎడమవైపు ఉన్న రెగ్యులేటర్.. పవర్ ఆన్ ఇండికేటర్‌గా పని చేస్తుంది. మెటల్ హ్యాండిల్ కలిగిన ఒక మూత.. గ్రైండర్జార్కి అడ్జస్ట్ చేసుకుని అందులో గ్రైండ్ చేసుకోవాల్సిన పదార్థాలను వేసుకుని ఎడమవైపు లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ హై స్పీడ్ గ్రైండర్.. మూడంటే మూడు నిమిషాల్లో దేన్నైనా పిండి చేయగలదు. ఇదే మోడల్లో 150 గ్రాముల నుంచి 2500 గ్రాముల వరకూ ఉండే మెషిన్స్ ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయి. పరిమాణం పెరిగేకొలదీ ధర పెరుగుతుంది. చిత్రంలోని డివైజ్ 150 గ్రాముల సామర్థ్యం కలది. ధర 69 డాలర్లు (రూ.5,256) -
టెన్త్ విద్యార్థులకు అల్పాహారం
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం పూట అల్పాహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్. సురేశ్‌కుమార్ జిల్లా పరిషత్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జెడ్పీ నుంచి నిధులు విడుదల చేస్తూ ఆయన సోమవారం ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ఒక్కో విద్యార్థికి రూ.6 చొప్పున కేటాయించారు. గతేడాది వరకూ ప్రభుత్వ, జెడ్పీ హైస్కూళ్ల విద్యార్థులకే అల్పాహారం అందించేవారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఎయిడెడ్ హైస్కూల్ విద్యార్థులకూ జెడ్పీ నిధులతోనే పౌష్టికాహారం అందించేందుకు నిర్ణయించారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలో ఆయా యాజమాన్యాల్లో పదో తరగతి చదువుతున్న 25 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నిధులతో విద్యార్థులకు ఉప్మా, ఇడ్లీ, గుడ్లు, బిస్కెట్లను రోజు మార్చి, రోజు అల్పాహారంగా అందించాల్సి ఉంది. 25 వేల మందికి రూ.6 వంతున అల్పాహారం అందించేందుకు నెలకు రూ.45 లక్షల వ్యయం కానుంది.