‘అమ్మ’కానికి గ్రైండర్లు
Published Wed, Feb 24 2016 9:32 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
నరసరావుపేటరూరల్ : తమిళనాడు ‘అమ్మ’ గ్రైండర్లు మన రాష్ట్రంలో అమ్మకానికి వచ్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ రాష్ర్ట ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసిన టేబుల్ టాప్ గ్రైండర్లు గుంటూరు జిల్లా నరసరావుపేటలో దర్శనమిస్తున్నాయి. రెండు రోజులుగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట నుంచి వీటిని కొందరు లారీల ద్వారా ఇక్కడికి చేరవేస్తున్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కన వీటిని అమ్మకానికి పెట్టారు. ఒక్కో గ్రైండర్‌ను కేవలం రూ.1,400కే విక్రయిస్తుండటంతో మంగళవారం ‘అమ్మ’ గ్రైండర్లను కొనేందుకు జనం ఎగబడ్డారు.
Advertisement
Advertisement