
ఆంధ్రాప్యారిస్‌లో 'అమ్మ'కానికి గ్రైండర్లు
తెనాలి: తమిళనాడు ‘అమ్మ’ గ్రైండర్లు మన రాష్ట్రంలో అమ్మకానికి వచ్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ రాష్ర్ట ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసిన మిక్సీలు, మినీ వెట్ గ్రైండర్లు గుంటూరు జిల్లా తెనాలిలో దర్శనమిచ్చాయి. ఆంధ్రాప్యారిస్ తెనాలి చెంచుపేట సమీపంలోని పెట్రోలు బంకు వద్ద శుక్రవారం ఈ వస్తువులు అమ్మకానికి పెట్టారు. మార్కెట్ ధర కంటే తక్కువకే అమ్ముతుండడంతో ప్రజలు కొనుగోలు చేసేందుకు ఎగబాడుతున్నారు. రెండు నెలల కిందట కూడా నరసరావుపేటలో అమ్మ గ్రైండర్లు అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే.