నివృత్తం
మిక్సీలు, గ్రైండర్లు వంటి ఆధునిక పరికరాలు వచ్చినా... ఇప్పటికీ చాలామంది తమ ఇళ్లలో రోలు, రోకలి ఉంచుకుంటూ ఉంటారు. ఏదైనా శుభకార్యాన్ని మొదలు పెట్టేముందు వాటిని శుభ్రంగా కడిగి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెడతారు.
ఆ తరువాతే అసలు కార్యాన్ని మొదలు పెడతారు. ఇలా చేయడానికి కారణం ఉంది. శాస్త్రాల ప్రకారం రోలు పార్వతీదేవి స్వరూపం. రోకలి లేక పొత్రం అంటే శివ స్వరూపం. అందువల్ల వాటిని పవిత్రమైన ప్రదేశాల్లో ఉంచాలనీ, వాటిని పూజించాకే శుభకార్యాలు ప్రారంభించాలనీ శాస్త్రాలు సూచిస్తున్నాయి.
చల్లకొచ్చి ముంత దాచినట్లు...
పూర్వం ఒక ఊరిలో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకంటూ ఎవ్వరూ లేకపోవడంతో ఒంటరిగానే జీవించేది. పక్కింట్లో ఉండే ఇల్లాలు ఆ పెద్దావిడకి సాయం చేస్తూ ఉండేది. తమ ఇంట్లో ఏం చేసినా కూడా ఆవిడకు పెడుతూ ఉండేది. ఓసారి ఈ పెద్దావిడకి మజ్జిగ కావలసి వచ్చింది.
పక్కింటావిడని అడుగుదామని ముంత తీసుకుని వెళ్లింది. అయితే అడగడానికి మొహమాటం అడ్డొచ్చి, ముంతను దాచేసింది. అడగకుండానే చాలా సాయం చేస్తుంది కదా, ఇక చల్ల కూడా అడగడం ఎందుకులే అనుకుని తిరిగొచ్చేసింది. అలా ఈ కథ నుంచి పుట్టుకొచ్చిందే పై సామెత. ఎవరైనా ఏదైనా చెప్పడానికి వెళ్లి, చెప్పలేక ఇబ్బంది పడినప్పుడు ఈ సామెత వాడతారు.
శుభకార్యాలకు ముందు రోలు-రోకలి పూజ ఎందుకు చేస్తారు?
Published Sat, Aug 9 2014 10:54 PM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM
Advertisement
Advertisement