Mixi
-
మిక్సీజార్‌లో పాము
తమిళనాడు ,అన్నానగర్: పూల వ్యాపారి ఇంట్లోని ఓ మిక్సీజార్‌లో పాము ఉన్న సంఘటన తేనిలో బుధవారం జరిగింది. వివరాలు.. తేని పారస్ట్ రోడ్డులోని 5వ వీధికి చెందిన మురుగన్ పూల వ్యాపారి. ఇతని భార్య సెల్వి బుధవారం ఇంట్లో వంట చేస్తోంది. వంట గది నుంచి పాము శబ్దం వినబడింది. విషయం తెలుసుకున్న స్థానికులు వంట గదికి వెళ్లి చూశారు. శబ్దం ఎక్కడ నుంచి వస్తుందని గుర్తించలేకపోయారు. ఇంటి యజమాని మురుగన్, పళణిచెట్టిపట్టికి చెందిన పాములు పట్టే కన్నన్‌కి సమాచారం అందించాడు. అక్కడికి వచ్చిన అతను వంట గదిలో ఉన్న పాత్రలను తొలగించి చూశాడు. అక్కడ ఓ మిక్సి జార్ సగం మూత తెరచిన స్థితిలో ఉంది. దాంట్లో ఓ నల్ల పాము ఉంది. పాముని కన్నన్ పట్టుకున్నాడు. దాన్ని వీరప్ప అయ్యనార్ ఆలయ పర్వత ప్రాంతంలో వదిలిపెట్టాడు. -
4న మిక్సీతో సిరిధాన్యాల శుద్ధిపై శిక్షణ
సిరిధాన్యాలను మిక్సీలతో ఇంటిపట్టున సులభంగా శుద్ధి చేసి బియ్యం తయారీ, అటవీ చైతన్య ద్రావణంతో సిరిధాన్యాల సాగుపై ఈ నెల 4న గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులో శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు శిక్షణ ఉంటుంది. డా. ఖాదర్ వలి అనుయాయి, అటవీ కృషి నిపుణులు బాలన్(మైసూరు) తదితరులు తెలుగులో శిక్షణ ఇస్తారు. పేర్లు నమోదు చేసుకోగోరే వారు 83675 35439, 97053 83666 నంబర్లలో సంప్రదించవచ్చు. -
జల్లెడ స్టయిల్ మార్చింది!
యంత్రాలు వచ్చాక వంటిల్లు స్వర్గమవుతోంది. రోలుకి మిక్సీ, పొయ్యికి స్టవ్ అంటూ బోలెడు వచ్చేశాయి. పాత పనినే కొత్త పద్ధతిలో సులభంగా చేసి పెట్టేస్తున్నాయి. ఆ క్రమంలోనే జల్లెడ కూడా తన స్టయిల్ మార్చేసుకుంది. ఇదిగో ఇలా ప్రత్యక్ష మయ్యింది. తొట్టిలాంటి దానిలో పిండి వేసి, హ్యాండిల్‌ని తిప్పితే చాలు.. పిండిని జల్లెడ పట్టేస్తాయివి. పైగా పిండిలో ఎక్కడైనా ఉండ ల్లాంటివి ఉన్నా చిదిమేస్తాయి. చపాతీల్లాంటివి చేసుకున్నప్పుడు అంటుకోకుండా పిండిని చల్లుతాం కదా? అందుకు కూడా ఇవి చక్కగా ఉపయోగపడుతాయి. ఈ ప్లాస్టిక్ జల్లెడనయితే సలాడ్ల వంటి వాటి మీద కారప్పొడి, మిరియాల పొడి లాంటివి చల్లుకోవడానికి... స్వీట్ల మీద చక్కెర పొడి చల్లడానికి కూడా వాడవచ్చు. వెల కూడా మరీ ఎక్కువేమీ కాదు. ప్లాస్టిక్‌వి రూ. 800 నుంచి మొదలువుతున్నాయి. స్టీలువి ఇంకొంచెం ఎక్కువ ఖరీదు పలుకుతున్నాయి. ఒక్కసారి కొంటే చాన్నాళ్లు పనికొస్తాయి కాబట్టి కాస్త రేటు పెట్టినా ఫర్లేదు కదా! -
శుభకార్యాలకు ముందు రోలు-రోకలి పూజ ఎందుకు చేస్తారు?
నివృత్తం మిక్సీలు, గ్రైండర్లు వంటి ఆధునిక పరికరాలు వచ్చినా... ఇప్పటికీ చాలామంది తమ ఇళ్లలో రోలు, రోకలి ఉంచుకుంటూ ఉంటారు. ఏదైనా శుభకార్యాన్ని మొదలు పెట్టేముందు వాటిని శుభ్రంగా కడిగి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెడతారు. ఆ తరువాతే అసలు కార్యాన్ని మొదలు పెడతారు. ఇలా చేయడానికి కారణం ఉంది. శాస్త్రాల ప్రకారం రోలు పార్వతీదేవి స్వరూపం. రోకలి లేక పొత్రం అంటే శివ స్వరూపం. అందువల్ల వాటిని పవిత్రమైన ప్రదేశాల్లో ఉంచాలనీ, వాటిని పూజించాకే శుభకార్యాలు ప్రారంభించాలనీ శాస్త్రాలు సూచిస్తున్నాయి. చల్లకొచ్చి ముంత దాచినట్లు... పూర్వం ఒక ఊరిలో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకంటూ ఎవ్వరూ లేకపోవడంతో ఒంటరిగానే జీవించేది. పక్కింట్లో ఉండే ఇల్లాలు ఆ పెద్దావిడకి సాయం చేస్తూ ఉండేది. తమ ఇంట్లో ఏం చేసినా కూడా ఆవిడకు పెడుతూ ఉండేది. ఓసారి ఈ పెద్దావిడకి మజ్జిగ కావలసి వచ్చింది. పక్కింటావిడని అడుగుదామని ముంత తీసుకుని వెళ్లింది. అయితే అడగడానికి మొహమాటం అడ్డొచ్చి, ముంతను దాచేసింది. అడగకుండానే చాలా సాయం చేస్తుంది కదా, ఇక చల్ల కూడా అడగడం ఎందుకులే అనుకుని తిరిగొచ్చేసింది. అలా ఈ కథ నుంచి పుట్టుకొచ్చిందే పై సామెత. ఎవరైనా ఏదైనా చెప్పడానికి వెళ్లి, చెప్పలేక ఇబ్బంది పడినప్పుడు ఈ సామెత వాడతారు.