
మిక్సీ జార్‌లో ఉన్న పాము
తమిళనాడు ,అన్నానగర్: పూల వ్యాపారి ఇంట్లోని ఓ మిక్సీజార్‌లో పాము ఉన్న సంఘటన తేనిలో బుధవారం జరిగింది. వివరాలు.. తేని పారస్ట్ రోడ్డులోని 5వ వీధికి చెందిన మురుగన్ పూల వ్యాపారి. ఇతని భార్య సెల్వి బుధవారం ఇంట్లో వంట చేస్తోంది. వంట గది నుంచి పాము శబ్దం వినబడింది. విషయం తెలుసుకున్న స్థానికులు వంట గదికి వెళ్లి చూశారు. శబ్దం ఎక్కడ నుంచి వస్తుందని గుర్తించలేకపోయారు. ఇంటి యజమాని మురుగన్, పళణిచెట్టిపట్టికి చెందిన పాములు పట్టే కన్నన్‌కి సమాచారం అందించాడు. అక్కడికి వచ్చిన అతను వంట గదిలో ఉన్న పాత్రలను తొలగించి చూశాడు. అక్కడ ఓ మిక్సి జార్ సగం మూత తెరచిన స్థితిలో ఉంది. దాంట్లో ఓ నల్ల పాము ఉంది. పాముని కన్నన్ పట్టుకున్నాడు. దాన్ని వీరప్ప అయ్యనార్ ఆలయ పర్వత ప్రాంతంలో వదిలిపెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment