జల్లెడ స్టయిల్ మార్చింది!
యంత్రాలు వచ్చాక వంటిల్లు స్వర్గమవుతోంది. రోలుకి మిక్సీ, పొయ్యికి స్టవ్ అంటూ బోలెడు వచ్చేశాయి. పాత పనినే కొత్త పద్ధతిలో సులభంగా చేసి పెట్టేస్తున్నాయి. ఆ క్రమంలోనే జల్లెడ కూడా తన స్టయిల్ మార్చేసుకుంది. ఇదిగో ఇలా ప్రత్యక్ష మయ్యింది. తొట్టిలాంటి దానిలో పిండి వేసి, హ్యాండిల్‌ని తిప్పితే చాలు.. పిండిని జల్లెడ పట్టేస్తాయివి. పైగా పిండిలో ఎక్కడైనా ఉండ ల్లాంటివి ఉన్నా చిదిమేస్తాయి. చపాతీల్లాంటివి చేసుకున్నప్పుడు అంటుకోకుండా పిండిని చల్లుతాం కదా? అందుకు కూడా ఇవి చక్కగా ఉపయోగపడుతాయి. ఈ ప్లాస్టిక్ జల్లెడనయితే సలాడ్ల వంటి వాటి మీద కారప్పొడి, మిరియాల పొడి లాంటివి చల్లుకోవడానికి... స్వీట్ల మీద చక్కెర పొడి చల్లడానికి కూడా వాడవచ్చు. వెల కూడా మరీ ఎక్కువేమీ కాదు. ప్లాస్టిక్‌వి రూ. 800 నుంచి మొదలువుతున్నాయి. స్టీలువి ఇంకొంచెం ఎక్కువ ఖరీదు పలుకుతున్నాయి. ఒక్కసారి కొంటే చాన్నాళ్లు పనికొస్తాయి కాబట్టి కాస్త రేటు పెట్టినా ఫర్లేదు కదా!