Handle
-
ఏం తెలివిరా నాయనా! ఏకంగా రూ. 64 లక్షలు..
విమానాశ్రయంలో తరుచుగా అక్రమంగా బంగారం, జంతువులు, డబ్బులు తరలిస్తున్న ఘటనలు గురించి విని ఉన్నాం. అదీకూడా వాళ్లకు ఊహకందని విధంగా భలే విచిత్రమైన రీతిలో తరలించిన ఉదంతాలను చూశాం. వాటన్నింటికి మించి అన్నట్లుగా ఇక్కడొక వ్యక్తి ట్రాలీ బ్యాంగ్ హ్యండిల్లో నగదును తరలించాలని చూసి పట్టుబడ్డాడు. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుందర్ సింగ్ రిహాల్ అనే వ్యక్తి చెకింగ్ సమయంలో అతని వద్ద సరైన విధంగా డాక్యుమెంట్స్ లేకపోవడంతో అతన్ని ఆపారు. ఆ తర్వాత అతన్ని తనిఖీ చేస్తుండగా అతడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో.. అధికారుల కస్టమ్స్ అధికారుల వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ స్కాన్ చేయగా ట్రాలీ బ్యాగులో ఏదో ఉన్నట్లు చూపించడంతో ఇంకా క్షుణ్ణంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలో ట్రాలీ హ్యండిల్లో దాచిన విదేశీ కరెన్సీని నెమ్మదిగా బయటకు తీశారు. ఏకంగా మొత్తం రూ. 65 లక్షలు తరలించేందకు యత్నించినట్లు అధికారులు వెల్లడించారు. అందులో సుమారు రూ. 60 లక్షలకు సంబంధించి సుమారు 68 వేల యూరోల కరెన్సీ, రూ. 4లక్షలకు సంబంధించిం న్యూజిలాండ్‌కి చెందిన 5 వేల డాలర్లు ఉన్నాయని చెప్పారు. ఐతే నిందితుడు భారీ మొత్తంలో అంత నగదు తరలించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించడంలో విఫలమయ్యాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు. దీంతో అతని వద్ద నుంచి భారీ మొత్తంలో ఉన్న ఆ నగదును స్వాధీనం చేసుకోవడమే గాక అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ ప్రయాణికుడు థాయ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ టీహెచ్-332లో బ్యాంకాక్‌కు వెళ్లాల్సి ఉంది. #CISF personnel detected foreign currency (Euro & New Zealand Dollars) worth approx INR 64 lakh concealed inside handle of Trolley Bag at IGI Airport.@CISFHQrs @HMOIndia @PMOIndia @UpendrraRai @BhaaratExpress @AAI_Official @DelhiAirport pic.twitter.com/ERRNZjRCVl — Mitalli Chandola 🇮🇳 (@journomitalli1) January 29, 2023 (చదవండి: చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాహుల్) -
బండి వెనకాల పరిగెత్తి ఫైన్ విధించింది
-
రూల్స్ బ్రేక్ చేసింది.. తర్వాత
గాంధీనగర్ : ఎక్కడైనా సరే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఏం చేస్తారు.. మహా అయితే ఆ వాహనాల నంబర్ నోట్ చేసుకోవడం, ఫోటో తీయడం వంటివి చేస్తారు. తర్వాత ఆ నంబర్ మీద రిజిష్టర్ చేయించుకున్న వ్యక్తికి చలాన్ రాస్తారు. లేదంటే అక్కడే బండి ఆపి ఫైన్ కట్టించుకుంటారు, అంతే తప్ప వాహనం వెనకాల అయితే పరిగెత్తరు కదా. కానీ గుజరాత్, రాజ్‌కోట్‌కు చెందిన ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం ఇందుకు మినహాయింపు. ట్రాఫిక్ నియమాలను పాటించని ఓ మహిళ స్కూటరిస్ట్ వెనకాల పరిగెత్తి మరీ స్కూటీని ఆపి ఫైన్ విధించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. వీడియోలో ఉన్న దాని ప్రకారం స్కూటీ మీద వెళ్తున్న మహిళ ట్రాఫిక్ నియమాలను అతిక్రమించింది. దాంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ మహిళ బండి పక్కకు ఆపి, లైసెన్స్ చూపించమంది. అయితే అక్కడ బాగా రద్దీగా ఉండటంతో సదరు మహిళ, కానిస్టేబుల్ దృష్టి మరలగానే తప్పించుకుపోయే ప్రయత్నం చేసింది. కానీ వెంటనే అప్రమత్తమైన కానిస్టేబుల్, మహిళ స్కూటీ రేర్ హ్యాండిల్‌ను పట్టుకుని స్కూటీ వెనకే పరిగెత్తింది. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత మహిళ స్కూటీని ఆపి కానిస్టేబుల్ని తిట్టడం ప్రారంభించింది. అయితే ఆ మహిళ బండి ఆపగానే అధికారి వెళ్లి స్కూటీ తాళం తీసుకుంది మరోసారి పారిపోయే అవకాశం ఇవ్వకుండా. అనంతరం ఆ మహిళను చలనా చెల్లించి బండి తీసుకెళ్లమని హెచ్చరించింది. ఈ మొత్తం తతంగాన్ని ప్రముఖ హిందీ న్యూస్ చానెల్ జీ న్యూస్‌లో ప్రసారం చేశారు. (వీడియో జీ న్యూస్ సౌజన్యంతో) -
నాటుతుపాకులతో సంచరిస్తే చర్యలు తప్పవు
శాలిగౌరారం: మండలంలో వేటగాళ్ళు అక్రమంగా నాటు తుపాకులతో సంచరిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్ఐ శ్రీరాముల అయోధ్య హెచ్చరించారు. శనివారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ పల్లెల్లో వేటగాళ్లు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలను ధ్వంసం చేసే జంతువులు, పక్షుల బారినుంచి ఆయా పంటలను కాపాడుకునేందుకు వివిధ మండలాల్లో రైతులు సంబంధిత జిల్లా ఉన్నతాధికారుల నుంచి నాటు తుపాకుల వినియోగం అనుమతిని పొందారన్నారు. కానీ ఆయా వ్యక్తులు తమ పరిధిని దాటి ఇతర మండలాలలో నాటు తుపాకులతో జంతువులు, పక్షులను వేటాడటం చట్ట విరుద్ధమన్నారు. సంబంధిత నాటు తుపాకుల వినియోగదారులు ఏ ఉద్దేశం కోసం అధికారుల అనుమతిని పొందారే అంతవరకు మాత్రమే వినియోగించుకోవాలని చెప్పారు. తుపాకులతో వేటకు వెళితే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆనుమతి పత్రాన్ని సమర్పించాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. -
ఇంటిప్స్
వర్షాకాలం బ్యాక్టీరియా అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. బ్యాక్టీరియా చేరే వస్తువులలో ప్రధానంగా... అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరే వస్తువుల్లో హ్యాండ్ బ్యాగు ఒకటి. వీలైనంత వరకు ఆహార పదార్థాలను బ్యాగు లోపల పెట్టకుండా చూసుకోవడం మేలు. ఒకవేళ పెట్టాల్సి వచ్చినా ప్లాస్టిక్ కవర్లో ఉంచి అప్పుడు బ్యాగ్‌లో ఉంచాలి. వారానికి ఒకసారి తేమ లేకుండా బ్యాగుని గాలికి ఆరబెట్టాలి. ప్రతి పదిరోజులకోసారి బ్రష్‌తో దులిపి లెదర్ కండిషనర్‌తో శుభ్రం చేయాలి. నిత్యం వాడే కీ బోర్డు, మౌస్, టీవీ రిమోట్, ఫ్రిజ్ హ్యాండిల్.. వంటి వాటిపై సూక్ష్మ క్రిములు సులభంగా చేరిపోతాయి. అలాంటప్పుడు వాటిని వాడి, ఆ చేతిని యథాలాపంగా నోటి దగ్గర పెట్టుకోవడం, ముఖానికి రాసుకోవడంతో అవి చర్మంలోనికి చేరుతాయి. దాంతో మొటిమలు, ఇతర చర్మ, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని నివారించాలంటే ఆ వస్తువులను ప్రతి వారానికి, పదిహేను రోజులకోసారి వెనిగర్‌లో ముంచిన దూదితో తుడవాలి. తాగే నీళ్లసీసాలు శుభ్రంగా లేకపోతే శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా చేరిపోతుంది. అందుకే ప్రతి రెండురోజులకోసారి వేడినీళ్లలో రెండు చుక్కల నిమ్మ రసం, చెంచా వంటసోడా, చిటికెడు ఉప్పు వేసి ఆ నీటితో సీసాలను శుభ్రం చేయాలి. -
జల్లెడ స్టయిల్ మార్చింది!
యంత్రాలు వచ్చాక వంటిల్లు స్వర్గమవుతోంది. రోలుకి మిక్సీ, పొయ్యికి స్టవ్ అంటూ బోలెడు వచ్చేశాయి. పాత పనినే కొత్త పద్ధతిలో సులభంగా చేసి పెట్టేస్తున్నాయి. ఆ క్రమంలోనే జల్లెడ కూడా తన స్టయిల్ మార్చేసుకుంది. ఇదిగో ఇలా ప్రత్యక్ష మయ్యింది. తొట్టిలాంటి దానిలో పిండి వేసి, హ్యాండిల్‌ని తిప్పితే చాలు.. పిండిని జల్లెడ పట్టేస్తాయివి. పైగా పిండిలో ఎక్కడైనా ఉండ ల్లాంటివి ఉన్నా చిదిమేస్తాయి. చపాతీల్లాంటివి చేసుకున్నప్పుడు అంటుకోకుండా పిండిని చల్లుతాం కదా? అందుకు కూడా ఇవి చక్కగా ఉపయోగపడుతాయి. ఈ ప్లాస్టిక్ జల్లెడనయితే సలాడ్ల వంటి వాటి మీద కారప్పొడి, మిరియాల పొడి లాంటివి చల్లుకోవడానికి... స్వీట్ల మీద చక్కెర పొడి చల్లడానికి కూడా వాడవచ్చు. వెల కూడా మరీ ఎక్కువేమీ కాదు. ప్లాస్టిక్‌వి రూ. 800 నుంచి మొదలువుతున్నాయి. స్టీలువి ఇంకొంచెం ఎక్కువ ఖరీదు పలుకుతున్నాయి. ఒక్కసారి కొంటే చాన్నాళ్లు పనికొస్తాయి కాబట్టి కాస్త రేటు పెట్టినా ఫర్లేదు కదా! -
దేవుణ్ణి నమ్మని గ్రహం
నమో నాస్తికా! ఐజక్ న్యూటన్ తెలుసు కదా! ఇంగ్లండ్ సైంటిస్ట్. భౌతిక శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, సిద్ధాంత కర్త, తత్వవేత్త. ఇన్ని తెలిసిన ఈ మనిషి ఏనాడూ ‘దేవుడెవరో నాకు తెలీదు’ అనలేదు! ఓ రోజు న్యూటన్ దగ్గరికి నాస్తికుడైన ఓ సైంటిస్టు వచ్చాడు. అతడు రావడానికి కాస్త ముందు న్యూటన్ తన ‘ఓర్రెరీ’ పూర్తి చేసి అక్కడున్న బల్ల మీద పెట్టాడు. (ఓర్రెరీ అంటే యంత్ర పరికరాలతో తయారుచేసిన సౌర వ్యవస్థ నమూనా). దాన్ని చూసిన మన నాస్తికుడు చేత్తో దాని హ్యాండిల్ పట్టుకుని తిప్పాడు. వెంటనే గ్రహాలు తిరగడం మొదలు పెట్టాయి. వాటిని ఎంతో అబ్బురంగా చూశాడు నాస్తికుడు. ‘‘దీన్ని ఎవరు చేశారు’’ అని అడిగాడు. ‘‘ఎవరూ చేయలేదు’’ అన్నాడు న్యూటన్. నాస్తికుడు ఆశ్చర్యపోయాడు. ‘‘నేను అడుగుతున్నది... ఇదిగో, దీన్ని ఎవరు చేశారూ అని’’ అన్నాడు ఓర్రెరీని చూపిస్తూ. ‘‘చెప్పాను కదా, ఎవరూ చేయలేదని’’ అన్నాడు న్యూటన్. నాస్తికుడికి విసుగొచ్చింది. ‘‘ఇంత అద్భుతమైన యంత్రం ఎవరూ చేయకుండా ఎలా తయారౌతుంది?’’ అని అడిగాడు. ‘‘ఎవరూ చేయలేదని చెప్పాను కదా’’ అని తనూ విసుక్కున్నట్లుగా అన్నాడు న్యూటన్. నాస్తికుడు యంత్రం హ్యాండిల్ తిప్పడం ఆపి, ‘‘న్యూటన్... సరిగ్గా విను. ఎవరో ఒకరు చేయకుండా దీనికై ఇదే ఇక్కడికి ఎలా వచ్చిందంటావ్’’ అన్నాడు. న్యూటన్ తను చేస్తున్న పని ఆపి, నాస్తికుడి వైపు చూశాడు. ‘‘చిత్రంగా మాట్లాడుతున్నావు! ఈ చిన్న యంత్రాన్ని ఎవరూ తయారు చేయలేదంటే నువ్వు నమ్మడం లేదు. పైన ఆకాశంలో ఇదే సౌరవ్యవస్థ, అందులోని గ్రహాలు మాత్రం ఎవరూ చేసినవి కాదంటావు. ఏమిటి నీ వాదన’’ అన్నాడు న్యూటన్. (తర్వాత తెలిసిందేమిటంటే ఈ సంఘటన తర్వాత నాస్తికుడు ఆస్తికుడిగా మారాడని). -
హ్యాండిల్ పట్టుకుంటే.. చేతులు క్లీన్ అవుతాయ్..!
వినూత్నమైన తలుపు, దాని హ్యాండిల్ చూస్తున్నారు కదా. ఈ తలుపు హ్యాండిల్‌ను పట్టుకుంటే మన చేతులు వెంటనే క్లీన్ అయిపోతాయి. ఎందుకంటే వీటిని పట్టుకోగానే బ్యాక్టీరియాను చంపేసే జెల్ చేతులకు అంటుకుంటుంది. దానిని రెండు చేతులతో రుద్దుకుంటే సరి. చేతులు శుభ్రమైనట్లే. పుల్క్లీన్ అనే ఈ హ్యాండిల్‌ను మాట్ రాబర్ట్స్(31) అనే ఈ బ్రిటన్ యువకుడే తయారు చేశాడు. బ్రిటన్, అమెరికాలాంటి దేశాల్లో ఆసుపత్రుల వార్డుల్లో ఇన్ఫెక్షన్లను నివారించేందుకుగాను వార్డులోకి ప్రవేశించేముందు సందర్శకులు, ఆసుపత్రి సిబ్బంది తమ చేతులను బ్యాక్టీరియా రహితం చేసుకునేందుకు వీలుగా గోడలపై జెల్ బాక్సులను అమర్చుతారు. అయితే జెల్ బాక్సులు ఉన్నా.. వాటి ప్రాధాన్యాన్ని వివరిస్తూ పోస్టర్లు ఉంచినా.. చాలా మంది తమ చేతులను క్లీన్ చేసుకోవడం లేదట. అందుకే ఇలా డోర్ హ్యాండిల్ పట్టుకోగానే జెల్ బయటికి వచ్చి వారి చేతులకు అంటితే ఎలా ఉంటుంది? అని ఆలోచించిన రాబర్ట్స్ ఈ కొత్త హ్యాండిల్స్‌ను తయారు చేశాడు. ఆసుపత్రి సిబ్బంది కాగితాలు తీసుకెళుతున్నప్పుడు జెల్ రుద్దుకోవడం కుదరదు కాబట్టి.. వారి కోసం జెల్ బయటికి రాని మామూలు హ్యాండిల్ కూడా కింద ఉంటుంది.