ఇంటిప్స్
వర్షాకాలం బ్యాక్టీరియా అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. బ్యాక్టీరియా చేరే వస్తువులలో ప్రధానంగా... అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరే వస్తువుల్లో హ్యాండ్ బ్యాగు ఒకటి. వీలైనంత వరకు ఆహార పదార్థాలను బ్యాగు లోపల పెట్టకుండా చూసుకోవడం మేలు. ఒకవేళ పెట్టాల్సి వచ్చినా ప్లాస్టిక్ కవర్లో ఉంచి అప్పుడు బ్యాగ్‌లో ఉంచాలి. వారానికి ఒకసారి తేమ లేకుండా బ్యాగుని గాలికి ఆరబెట్టాలి. ప్రతి పదిరోజులకోసారి బ్రష్‌తో దులిపి లెదర్ కండిషనర్‌తో శుభ్రం చేయాలి.
నిత్యం వాడే కీ బోర్డు, మౌస్, టీవీ రిమోట్, ఫ్రిజ్ హ్యాండిల్.. వంటి వాటిపై సూక్ష్మ క్రిములు సులభంగా చేరిపోతాయి. అలాంటప్పుడు వాటిని వాడి, ఆ చేతిని యథాలాపంగా నోటి దగ్గర పెట్టుకోవడం, ముఖానికి రాసుకోవడంతో అవి చర్మంలోనికి చేరుతాయి. దాంతో మొటిమలు, ఇతర చర్మ, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీన్ని నివారించాలంటే ఆ వస్తువులను ప్రతి వారానికి, పదిహేను రోజులకోసారి వెనిగర్‌లో ముంచిన దూదితో తుడవాలి.
తాగే నీళ్లసీసాలు శుభ్రంగా లేకపోతే శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా చేరిపోతుంది. అందుకే ప్రతి రెండురోజులకోసారి వేడినీళ్లలో రెండు చుక్కల నిమ్మ రసం, చెంచా వంటసోడా, చిటికెడు ఉప్పు వేసి ఆ నీటితో సీసాలను శుభ్రం చేయాలి.