![Swiggy Announces New Subscription Program Swiggy One - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/22/swiggy-.jpg.webp?itok=IgF4Ax73)
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ అందించింది. కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలను అందించేందుగాను ‘స్విగ్గీ వన్’ అనే అప్‌గ్రేడ్ మెంబర్‌షిప్ ప్రోగ్రాంతో స్విగ్గీ ముందుకొచ్చింది. ఈ మెంబర్‌షిప్‌తో వినియోగదారులకు అపరిమిత ఉచిత డెలివరీలు, డిస్కౌంట్‌లు, మరిన్ని ప్రయోజనాలను స్విగ్గీ అందించనుంది. ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో ఉన్న ‘స్విగ్గీ సూపర్’ ప్లాన్‌తో కేవలం పరిమిత సంఖ్యలోనే ఉచిత డెలివరీలను పొందే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా 70 వేల కంటే ఎక్కువగా రెస్టారెంట్‌ల నుంచి అపరిమిత ఉచిత డెలివరీలను కస్టమర్లు పొందవచ్చును. అలాగే రూ. 99 కంటే ఎక్కువ గ్రాసరీ ఆర్డర్స్‌పై అపరిమిత ఉచిత ఇన్‌స్టామార్ట్ డెలివరీలను కూడా అందించనుంది. దాంతోపాటుగా స్విగ్గీ భాగస్వామి రెస్టారెంట్‌ల నుంచి కస్టమర్లు పుడ్ ఆర్డర్స్‌పై 30శాతం వరకు అదనపు తగ్గింపులను పొందవచ్చును.
చదవండి: పాతికేళ్ల ఫ్యాషన్ డిజైనర్ కేరాఫ్ బంజారా మార్కెట్
స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ రేట్స్ ఏంతంటే..!
మూడు నెలలకుగాను రూ. 299, ఏడాది గాను రూ. 899 చెల్లించి స్విగ్గీ వన్ మెంబర్‌షిప్‌ను కస్టమర్లు పొందవచ్చును. స్విగ్గీ వన్ సేవలు ప్రస్తుతం లక్నో, పూణే, త్రివేండ్రం, విజయవాడలో అందుబాటులో ఉంది. రాబోయే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా 500కు పైగా నగరాలకు స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
వారికి అప్‌గ్రేడ్..!
ఇప్పటికే స్విగ్గీ సూపర్ మెంబర్స్‌గా ఉన్నవారు ‘స్విగ్గీ వన్’ మెంబర్‌షిప్‌కు ఏలాంటి ఖర్చులేకుండా ఉచితంగా అప్‌గ్రేడ్ అవుతారని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా స్విగ్గీ సూపర్ మెంబర్స్‌కు కాంప్లిమెంటరీగా నెల రోజుల పొడిగింపు కూడా రానుంది.
చదవండి: పేటీఎం అట్టర్ ప్లాప్‌షో.. 63 వేల కోట్లు మటాష్! ఇన్వెస్టర్లు లబోదిబో
Comments
Please login to add a commentAdd a comment