
‘మూమూస్’... ఈ రోజుల్లో అన్ని వయసుల వారికి ఇష్టమైన చిరుతిండి. ఈ స్నాక్స్‌ను తయారు చేయడం కూడా చాలా ఈజీ. పైగా మూమూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు. అందుకే ఆహార ప్రియులు మూమూస్ తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మరి.. రూ. 125కే అన్‌లిమిటెడ్ మూమూస్ ఎక్కడైనా దొరికితే.. ఎవరైనా ఈ ఆఫర్ వదులుకుంటారా?
దేశ రాజధాని ఢిల్లీలో లెక్కకు మించిన మూమూస్ దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ వివిధ రకాల మూమూస్ అందుబాటులో ఉంటాయి. పలువురు దుకాణదారులు కొత్త ప్రయోగాలు చేస్తూ రకరకాల మూమూస్‌ను విక్రయిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలోని ఒక మూమూస్ దుకాణంలో బంపర్ ఆఫర్ నడుస్తోంది. కేవలం రూ. 129కే ఎవరికి నచ్చినన్ని మూమూస్ వారు తినవచ్చు.
ఈ బంపర్ ఆఫర్ ప్రకటించిన దుకాణం ఢిల్లీలోని తిలక్ నగర్ జైలు రోడ్డులో ‘ఎస్‌జీఎఫ్’ పేరుతో ఉంది. ఈ షాప్ మేనేజర్ దీప్ సింగ్ తాము అపరిమిత మూమూస్ ఆఫర్ అందిస్తున్నామని చెప్పారు. తాము రకరకాల మూమూస్ తయారు చేస్తున్నామని, వారంలోని అన్ని రోజుల్లోనూ ఈ బంపర్ ఆఫర్‌తో మూమూస్ అందిస్తున్నామని తెలిపారు.
అయితే ఈ అపరిమిత మూమూస్ ఆఫర్ అందుకోవాలంటే ఒక కండీషన్ ఉన్నదన్నారు. రూ. 129కు ఒక ప్లేట్ మూమూస్ కొనుగోలు చేసి, దానిని తినేశాక నచ్చినన్నిసార్లు ప్లేటును రీఫిల్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లేట్‌ను మరొకరితో షేర్ చేసుకోకూడదని, ఒక్క మూమూస్ కూడా వృథా చేయకూడదన్నారు. ఒకవేళ ప్లేట్ మూమూస్‌ను ఎవరితోనైనా షేర్ చేసుకుంటే అందుకు విడిగా నగదు చెల్లించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment