సాక్షి, న్యూఢిల్లీ: సొంతవైద్యం, మెడికల్ షాపులో ఏవో తెలిసిన మందులు కొనుక్కొని వాడటం ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపించిన ఘటన ఇది. మందుల దుకాణంలో ఇచ్చిన తప్పుడు మందుతో రెండేళ్ల పాప ప్రాణాలు కోల్పోయిన వైనం ఢిల్లీలో చోటు చేసుకుంది.
పోలీసులు శుక్రవారం ప్రకటించిన వివరాల ప్రకారం షాహదారాలోని జీటీబీ ఎన్‌క్లేవ్ ప్రాంతంలో నివసించే బాలిక (2) జ్వరం, దగ్గుతో బాధపడుతోంది. దీంతో ఆమె తల్లి దగ్గరలోని ఉన్న షాపుకెళ్లి ఏవో మందులు తెచ్చి వాడింది. అయినా ఉపశమనం లభించకపోవడంతో మరోసారి అదే షాపునకు వెళ్లింది. వైద్యుడిని సంప్రదించమని చెప్పడానికి బదులు ఆ షాపు యజమాని పాపకు ఇంజెక్షన్ ఇచ్చాడు. అంతే ఇంటికి వచ్చీ రావడంతోనే రక్తపు వాంతులు మొదలయ్యాయి. కంగారు పడినబంధువులు బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేదు.అప్పటికే పాప చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment