Delhi: భారీ అగ్ని ప్రమాదం.. 15 దుకాణాలు దగ్ధం | Fire Broke out in Shops Including Cafe | Sakshi
Sakshi News home page

Delhi: భారీ అగ్ని ప్రమాదం.. 15 దుకాణాలు దగ్ధం

Published Mon, Jul 15 2024 8:28 AM | Last Updated on Mon, Jul 15 2024 9:29 AM

Fire Broke out in Shops Including Cafe

దేశరాజధాని ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ  ఘటన ఇక్కడి యూనిఫాం తయారీ దుకాణం, కేఫ్‌లలో చోటుచేసుకుంది. చూస్తున్నంతలోనే మంటలు  చుట్టుపక్కల దుకాణాలను చుట్టుముట్టాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తమ వాహనాలతో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 25 ఫైర్ టెండర్ వాహనాలు మంటలను ఆర్పే పనిలో  ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఒక వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికే మంటలు భవనంలోని మూడు అంతస్తులకు వ్యాపించాయి. వెంటిలేషన్ సరిగా లేకపోవడం కారణంగానే మంటలు వ్యాపించాయని  అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ కాంప్లెక్స్‌లో 30 దుకాణాలు  ఉండగా, వాటిలో 15 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement