న్యూఢిల్లీ: 26 రకాల ఔషధాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించింది. అత్యవసర జాబితా నుంచి ర్యాంటాక్, జింటాక్ టాబ్లెట్లను తొలగించింది. ర్యాంటాక్, జింటాక్ టాబ్లెట్లతో క్యాన్సర్ వస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. వాటితో పాటు 26 రకాల మందులను ఇండియా మార్కెట్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ర్యాంటాక్, జింటాక్ మందులను ఎసిడిటీ సంబంధింత సమస్యలకు వైద్యులు సూచిస్తారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ 384 ఔషధాలను కలిగి ఉన్న కొత్త నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్‌ను విడుదల చేయగా జాబితా నుండి తాజాగా 26 ఔషధాలను తొలగించింది.
ఆల్టెప్లేస్, అటెనోలోల్, బ్లీచింగ్ పౌడర్. కాప్రోమైసిన్, సెట్రిమైడ్, క్లోర్ఫెనిరమైన్, డిలోక్సనైడ్ ఫ్యూరోయేట్, డిమెర్కాప్రోల్, ఎరిత్రోమైసిన్, ఇథినైల్స్ట్రాడియోల్, ఇథినైల్‌స్ట్రాడియోల్(ఏ) నోరెథిస్టిరాన్ (బీ),గాన్సిక్లోవిర్, కనామైసిన్, లామివుడిన్ (ఎ)+నెవిరాపైన్ (బి)+ స్టావుడిన్ (సి),లెఫ్లునోమైడ్, మిథైల్డోపా, నికోటినామైడ్, పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2a, పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2బి, పెంటమిడిన్, ప్రిలోకైన్ (A) + లిగ్నోకైన్ (B, ప్రోకార్బజైన్, రానిటిడిన్, రిఫాబుటిన్, స్టావుడిన్ (ఎ) + లామివుడిన్ (బి), సుక్రాల్‌ఫేట్, వైట్ పెట్రోలేటం నిషేధించిన 26 ఔషధాలు జాబితాలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment