NDMA
-
ప్రకృతి వికృతి
రికార్డులు బద్దలవుతున్నాయి. వారం రోజుల్లోనే అటు రాజస్థాన్‌లో, ఇటు దేశ రాజధానిలో తాపమానం తారాజువ్వలా పైకి ఎగసింది. ఒక్క బుధవారమే రాజస్థాన్‌లో ఉష్ణోగ్రతలు పలుచోట్ల 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను దాటేశాయి. వాయవ్య ఢిల్లీలోని ముంగేశ్‌పూర్‌లో దేశచరిత్రలోనే అత్యధికంగా 52.9 డిగ్రీలు నమోదైనట్టు స్థానిక వాతావరణ కేంద్రం నుంచి వెలువడ్డ వార్త సంచలనమైంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) లెక్కల్లో ఏమన్నా తప్పు దొర్లిందేమో అని అమాత్యులు అత్యుత్సాహమూ చూపారు. సరిచూసుకోవడంలో తప్పు లేదు కానీ, అన్నిటికీ ప్రామాణికమని ప్రభుత్వమే చెప్పే ఐఎండీని పక్కనబెట్టినప్పటికీ ఈ వేసవిలో దేశంలో ఉష్ణోగ్రతలు ఎన్నడెరుగని స్థాయికి చేరిన మాట చెమటలు పట్టిస్తున్న నిజం. క్రమంగా ఈ ప్రచండ ఉష్ణపవనాలు తగ్గుతాయని చెబుతూనే, ఉత్తర భారతావనికి ఐఎండీ ‘రెడ్ ఎలర్ట్’ జారీ చేయడం గమనార్హం. గత రెండున్నర నెలల్లో దేశవ్యాప్తంగా కనీసం 16.5 వేల మందికి పైగా వడదెబ్బకు గురైతే, పదుల మరణాలు సంభవించాయి. ఒకపక్క ఈశాన్యంలో రెమాల్ తుపాను బీభత్సం, మరోపక్క పశ్చిమ, ఉత్తర భారతావనుల్లో ఉష్ణోగ్రతల నిప్పులగుండం ఒకేసారి సంభవించడం ప్రకృతి వికృతికి చిహ్నం. ఒక్క మనదేశంలోనే కాదు... ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, అసాధారణ వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. 2013 నుంచి 2023 మధ్య పదేళ్ళ కాలంలో అంటార్కిటికాతో సహా ప్రపంచంలో దాదాపు 40 శాతం ప్రాంతంలో అత్యధిక రోజువారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా గత రెండు మూడేళ్ళలో వివిధ దేశాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2021లో యూరప్‌లోకెల్లా అత్యధికంగా ఇటలీలోని సిసిలీలో తాపమానం 48.8 డిగ్రీలు చేరింది. 2022 జూలైలో అమెరికాలో ఉష్ణోగ్రత తొలిసారిగా 40 డిగ్రీలు దాటింది. నిరుడు చైనా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ పట్టణంలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది మన దేశంలోని అనేక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా సాధారణం కన్నా 5 నుంచి 10 డిగ్రీలు పెరగడం ఆందోళనకరం. ఇది మన స్వయంకృతం. పచ్చని చెట్లు, నీటి వసతులు లేకుండా కాంక్రీట్ జనారణ్యాలుగా మారుతున్న నగరాలతో మీద పడ్డ శాపం.గత 2023 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన వత్సరమైతే, ఈ 2024 కూడా అదే బాటలో నడుస్తోంది. నిజానికి, ప్రకృతి విపత్తుల స్వరూప స్వభావాలు గత 20 ఏళ్ళలో గణనీయంగా మారాయి. దేశంలో నిరుడు శీతకాలమైన ఫిబ్రవరిలోనే వడగాడ్పులు చూశాం. అనూహ్య వాతావరణ పరిస్థితులు, అందులోనూ తీవ్రమైనవి ఇవాళ దేశంలో తరచూ ఎదురవుతున్నాయి. భరించలేని ఎండలు, భారీ వరదలకు దారి తీసేటంత వానలు, బయట తిరగలేనంత చలి... ఒకదాని వెంట మరొకటిగా బాధిస్తున్నాయి. గతంలో భరించగలిగే స్థాయిలో ఉండే ప్రకృతి సిద్ధమైన వేసవి ఎండ, వడగాడ్పులు ప్రకోపించి... సరికొత్త విపత్తులుగా పరిణమించాయి. ఒకప్పుడు అసాధారణమైన 45 డిగ్రీలు సర్వసాధారణమై, ఇక 50 డిగ్రీల హద్దు తాకుతున్నాం. దేశవ్యాప్త ప్రచండ గ్రీష్మం అందులో భాగమే. పైగా, అధిక వర్షపాతంతో పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం, లోతట్టున ఆకస్మిక వరదలు రావడం... భరించలేని గ్రీష్మతాపంతో కార్చిచ్చులు రేగడం... ఇలా గొలుసుకట్టు చర్యలా ఒక వైపరీత్యం మరొకదానికి దారి తీయడమూ పెరుగుతోంది. మరో వారం పదిరోజుల్లో ఋతుపవనాల ప్రభావంతో ఎండలు తగ్గాక అనూహ్యమైన తుపానుల బెడద ఉండనే ఉంది. ఇప్పటికే ఆదివారం బెంగాల్ తీరం తాకిన రెమల్ తుపానుతో నాలుగైదు ఈశాన్య రాష్ట్రాలు దెబ్బతిన్నాయి. పెరుగుతున్న భూతాపం, దరిమిలా వాతావరణ మార్పుల వల్ల రానున్న రోజుల్లో ఇలాంటివి మరింత తీవ్రస్థాయిలో సంభవించే ప్రమాదం ఉంది. అందులోనూ ఇప్పటి తుపానులకు రెండింతల విధ్వంసం సృష్టించగలిగినవి వస్తాయని పలు అధ్యయనాల అంచనా. ఈ ముప్పు నుంచి తప్పించుకొనేందుకు అస్సామ్, మిజోరమ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ సహా రాష్ట్రాలన్నీ సన్నద్ధం కావాలి. తుపాను వస్తుందంటే ఒడిశా లాంటివి ప్రజల్ని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నమూనా ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని, ప్రాణనష్టాన్నీ, ఆస్తినష్టాన్నీ తగ్గించుకుంటున్న తీరు నుంచి అందరూ పాఠాలు నేర్వాలి. అసలు మన దేశంలో జాతీయ విపత్కాల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) దాదాపు రెండు దశాబ్దాలుగా ఉంది. 1999లో ఒరిస్సాలో భారీ తుపాను, 2004లో సునామీ అనంతరం 2005లో దాన్ని స్థాపించారు. అప్పటి నుంచి జాతీయ విపత్తుల అంచనా, నివారణ, విపత్కాల పరిస్థితుల నిర్వహణ, బాధితుల సహాయ పునరావాసాలకు అది కృషి చేస్తోంది. ఎక్కడ ఏ మేరకు పనిచేస్తున్నాయన్నది పక్కనపెడితే, ప్రస్తుతం దాదాపు ప్రతి రాష్ట్రమూ దేనికది విపత్కాల నిర్వహణ సంస్థ పెట్టుకుంది. అయితే, ఇది చాలదు. అంతకంతకూ పెరుగుతున్న విపత్తుల రీత్యా కొత్త అవసరాలకు తగ్గట్టుగా ఈ వ్యవస్థలలో సమూలంగా మార్పులు చేర్పులు చేయాలి. వేడిమిని తట్టుకొనేందుకు శీతల కేంద్రాల ఏర్పాటు, విస్తృతంగా చెట్ల పెంపకం, పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్ళడం లాంటివి ఇక తప్పనిసరి. థానే లాంటి చోట్ల ఇప్పటికే అమలు చేస్తున్న పర్యావరణహిత ప్రణాళికల లాంటివి ఆదర్శం కావాలి. ఎండ, వాన, చలి... ఏది పెచ్చరిల్లినా తట్టుకొనేలా ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పన సాగించాలి. వేసవి ఉక్కపోత పోయిందని సంబరపడే లోగా భారీ వర్షాలు విపత్తుగా పరిణమించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకనైనా ప్రకృతి ప్రమాదఘంటిక వినకుంటే కష్టమే! -
Uttarkashi Tunnel: డ్రిల్లింగ్ పనులకు మళ్లీ ఆటంకం
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో ఇంకొన్ని మీటర్లు డ్రిల్లింగ్ చేస్తే కార్మికులు చిక్కుకున్న చోటుకు చేరుకోవచ్చన్న ఆశల నడుమ అనుకోని అవాంతరం ఎదురైంది. 25 టన్నుల బరువైన భారీ డ్రిల్లింగ్ మెషీన్ అమర్చిన ‘వేదిక’కు పగుళ్లు రావడంతో డ్రిల్లింగ్‌ను ఆపేశారు. బిగించిన వేదిక సరిగా లేకుంటే డ్రిల్లింగ్ మెషీన్ అటుఇటూ కదులుతూ కచి్చతమైన దిశలో డ్రిల్లింగ్ సాధ్యపడదు. అప్పుడు అసలుకే మోసమొస్తుంది. అందుకే ముందుజాగ్రత్తగా డ్రిల్లింగ్‌ను ఆపేశారు. ‘ మరికొన్ని గంటల్లో లేదా రేపటి కల్లా ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తవుతుంది’ అని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నయిన్ గురువారం సాయంత్రం చెప్పారు. ‘మనం చేస్తున్నది యుద్ధంలాంటిదే. ఖచి్చతంగా ఫలానా సమయంలోగా ఈ ఆపరేషన్ పూర్తిచేసి అందర్నీ బయటకు తెస్తామని ముందుగానే జోస్యం చెప్పడం సరైన విధానం కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) సభ్యులు సొరంగం వద్దే ఉండి, లోపలున్న కారి్మకులను బయటకు తీసుకువచ్చే విషయంలో రిహార్సల్ చేస్తున్నారని హస్నయిన్ తెలిపారు. కారి్మకులను బయటకు తీసుకొచ్చే క్రమంలో అనుకోని విధంగా కాల హరణం జరుగుతున్నందున సమాంతర డ్రిల్లింగ్‌లో అనుకోని అవాంతరాలు ఎదురైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టామన్నారు. ఇందుకోసం అదనంగా యంత్రాలను తెప్పిస్తున్నామని వివరించారు. బార్కోట్ వైపు నుంచి డ్రిల్లింగ్ పనులను 9.10 మీటర్ల మేర పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయని వారు వెల్లడించారు. డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న టన్నెల్ ప్రాంతం -
కరువు నిర్ధారణ ప్రమాణాలు తెలియవా రామోజీ?
సాక్షి, అమరావతి: నిత్యం ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం. దీనికోసం ఎంతకైనా దిగజారుడు తనం. చంద్రబాబు మేలు కోసం తాపత్రయం. ఇదే రామోజీరావుకు నిత్యకృత్యం. ఇదే కోవలో కరువుపైనా విషంకక్కారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా గుడ్డకాల్చి మీద పడేద్దాం అనే చందాన ఈనాడులో కథనం అచ్చేశారు. ఒక ప్రాంతంలో కరువు ఉందా? లేదా అని చెప్పడానికి దేశ వ్యాప్తంగా ఒకే రకమైన ప్రమాణాలు ఉంటాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) విధివిధానాల ప్రకారం కరువు మండలాలను ప్రకటిస్తుంటారు. రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వానికైనా.. ఇప్పటి ప్రభుత్వానికైనా, దేశంలో మరే ఇతర ప్రభుత్వాలకైనా ఈ ప్రమాణాలు, విధివిధానాలు ఒకేలా ఉంటాయి. అలాంటప్పుడు కరువును దాచేసే అవకాశమే ఉండదు. కేవలం ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్న ఈనాడు.. కరువును ఈ ప్రభుత్వం ఏదో దాచేస్తున్నట్టుగా ఓ కథను అల్లేసింది. కొన్ని విపక్షాలు సైతం వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేస్తున్నాయి. కరువు మండలాలు గుర్తిస్తారిలా.. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కరువు నిర్వహణ మాన్యువల్ ఆధారంగా మండలాన్ని యూనిట్‌గా తీసుకొని విపత్తుల నిర్వహణా సంస్థ, జిల్లా కలెక్టర్ల ద్వారా మూడు దశల్లో పరిశీలిస్తారు. ఈ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినవి కాదు. వాటిని మార్చడం కూడా సాధ్యం కాదు. కరువు మండలాల గుర్తింపులో మూడు దశల్లో 4 సూచికలు ఆధారంగా తీసుకుంటారు. ఈ సూచికలను మార్చడం కూడా సాధ్యం కాదు. అవి ఆయా వెబ్సైట్లలో అందరికీ అందుబాటులో ఉంటాయి. మొదటి దశ లోటు వర్షపాతం, వర్షంపడిన రోజులు ఆధారంగా మదింపు చేస్తారు. ఆ ప్రాంతంలో కురవాల్సిన వర్షపాతం కురిసిందా? లేదా, వర్షాలు కురవాల్సిన సమయంలో పొడి వాతావరణం ఉందా అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సాధారణ వర్షపాతం కన్నా 50 శాతం తక్కువ వర్షపాతం నమోదై, డ్రై స్పెల్స్‌ను బట్టి భూమిలో తేమ శాతం కూడా తక్కువగా ఉండే మండలాలను మొదటి దశలో పరిగణనలోకి తీసుకుంటారు. రెండో దశ ప్రధానంగా నాలుగు సూచికల ఆధారంగా అంచనా వేస్తారు. లోటు వర్షపాతం, డ్రైస్పెల్, నీటి వనరుల లభ్యత, సాగువిస్తీర్ణం పడిపోవడం పరిశీలిస్తారు. ఎంత విస్తీర్ణంలో విత్తనాలు వేశారు (సోన్ ఏరియా ఇండెక్స్ ), ఉపగ్రహం నుంచి లభించిన ఛాయా చిత్రాల ద్వారా అక్కడి పచ్చదనం ఎలా ఉన్నది (రిమోట్ సెన్సింగ్ ఇండెక్స్ వెజిటేషన్ కండీషన్ సూచిక), సాధారణంగా ఉండాల్సిన బాష్పిభవనం, వర్షాభావ పరిస్థితుల వల్ల ఏర్పడిన బాష్పిభవనం(మాయిశ్చర్ ఎడెక్వసీ ఇండెక్స్), నీటి నిల్వలు, ఆ ప్రాంతంలో ఉన్న వాగులు, వంకలు, నదుల్లో ప్రవాహ స్థితిగతులు (హైడ్రాలజీ ఇండెక్స్) పరిశీలిస్తారు. మూడు సూచికలు కరువు పరిస్థితులకనుగుణంగా ఉంటే ఆ మండలాలను ఎక్కువ కరువు ప్రభావం ఉన్న మండలాలుగా, రెండు సూచికలకు అనుకూలంగా ఉంటే ఓ మోస్తరు కరువు ప్రభావిత మండలాలుగా పరిగణనలోకి తీసుకుంటారు. మూడో దశ క్షేత్రస్థాయి నిజ నిర్ధారణ కోసం శాంపిల్ సర్వే చేస్తారు. గుర్తించిన మండలాల్లోని పలు గ్రామాలను ర్యాండమ్‌గా ఎంపికచేసి సర్వే చేస్తారు. ఆ ప్రాంతాల్లో పలు యూనిట్లలో పంటల దిగుబడిని ఇందుకు ప్రాతిపదికగా తీసుకుంటారు. కనీసం 50 శాతం పంట దిగుబడి( ఆయా మండలాల్లో సాగయ్యే ఐదు ప్రధాన పంటలు) తగ్గితే అక్కడ కరువు పరిస్థితులు ఉన్నట్టుగా నిర్ధారిస్తారు. క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాతే.. శాస్త్రీయంగా, పక్కాగా నిర్వహించిన ఈ సర్వేలపై కలెక్టర్లు పంపిన నివేదికల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటి పరిశీలించి ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత కరువు ప్రభావిత మండలాలపై నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఇలా ఎన్డీఎంఏ రూపొందించిన విధివి«ధానాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ అత్యంత పారదర్శకంగా కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పక్కాగా కరువు తీవ్రతను అంచనా వేసి, ప్రతీ సూచికను ఒకటికి రెండుసార్లు శాస్త్రీయంగా పరిశీలించిన తర్వాతే 679 మండలాలకు గానూ 103 మండలాల్లో ఈ ఖరీఫ్ సీజన్లో కరువు పరిస్థితులున్నట్టుగా నిర్ధారించింది. 80 మండలాల్లో కరువు ప్రభావం ఎక్కువగా ఉందని, 23 మండలాల్లో స్వల్పంగా ఉందని తేల్చింది. కర్నూలు జిల్లాలలో 24, నంద్యాల జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 28, శ్రీ సత్యసాయి జిల్లాలో 21, అన్నమయ్య జిల్లాలో 18, చిత్తూరు జిల్లాలో 4, ఎన్టీఆర్ జిల్లాలో 2 మండలాలు కరువు బారిన పడినట్టుగా తేల్చారు. కరువు కారణంగా అందించాల్సిన ఆర్థిక సాయం కోసం నవంబర్ 14న కేంద్రానికి నివేదిక పంపించారు. కరువు బాధిత ప్రాంతాల్లో సత్వర సహాయ చర్యల కోసం రూ. 688 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అదనపు ప్రయోజనం లేదు కరువు మండలాల్లో రైతులకు కలిగే ప్రయోజనాలు స్వల్పంగానే ఉంటాయి. ఆ సీజన్లో వారు తీసుకున్న పంట రుణాలను ఆరు నెలల పాటు రీషెడ్యూల్ చేస్తారు. వైపరీత్యాల మాదిరిగానే కరువు ప్రభావిత ప్రాంతాల్లో పంటలు కోల్పోయిన వారికి ఇన్‌పుట్‌సబ్సిడీ (పంట నష్టపరిహారం) అందిస్తారు. ఈ రెండు తప్ప అదనంగా రైతులకు ప్రయోజనం ఉండదు. పాడికి మాత్రం అదనంగా పశుగ్రాసం పంపిణీ, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అయితే ఇవన్నీ కరువు నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్రం ఇచ్చే కరువు సాయాన్ని బట్టి ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైపరీత్యాల బారిన పడి పంట నష్టం జరిగిన రైతులకు ఆ సీజన్ చివర్లో ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్ట పరిహారం) చెల్లిస్తోంది. ఇప్పటి వరకు వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో రూ. 1,977 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించింది. ఉచిత పంటల బీమా ద్వారా ఆదుకునే చర్యలు మరోవైపు రైతులపై పైసా భారం పడకుండా డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ పంటల బీమా వర్తింప చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 30.85 లక్షల మందికి రూ. 3,411.20 కోట్ల బీమా పరిహారం ఇస్తే, ఈ ప్రభుత్వం వచ్చాక ఈ నాలుగున్నరేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ. 7,802.05 కోట్ల బీమా పరిహారం చెల్లించింది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం, వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ వంటి సంక్షేమ పథకాలు గతంలో లేవు. రైతులను ఆదుకునే విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే బురద జల్లడమే ఈనాడు పనిగా పెట్టుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేకపోయినా కరువును దాచేస్తునారంటూ ఈనాడుతో పాటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపైనా, ప్రభుత్వ యంత్రాంగంపైనా అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నాయి. అప్పట్లో నోరు మెదపని ఈనాడు వాస్తవంగా చూస్తే గత ప్రభుత్వ హయాంలో ఏటా కరువు కాటకాలు, తుపాన్లు రాష్ట్ర రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. సకాలంలో కరువు మండలాలను ప్రకటించకపోయినా, కరువు పరిహారం ఇవ్వకపోయినా, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టినా ఏ ఒక్క రోజు రామోజీ ప్రశ్నించిన పాపాన పోలేదు. పంటకోత ప్రయోగాలు పారదర్శకంగా చేయాలని, నష్టపోయిన ప్రాంతాల్లో రైతుల్ని ఆదుకునేలా ఉండాలని ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీచేశారు. నివేదికలు రాగానే బెట్ట పరిస్థితుల వలన దిగుబడి నష్టం జరిగిన నోటిఫైడ్ పంటలకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం, దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. -
ఐదు జిల్లాల్లో భారీ నష్టం !
సాక్షి, హైదరాబాద్, బూర్గంపాడు: భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని జాతీయ విపత్తుల నివారణ సంస్థ(ఎన్డీఎంఏ) సలహాదారుడు కునాల్ సత్యార్థి వెల్లడించారు. వరి, పత్తి పంటలు పూర్తిగా ధ్వంసమైనట్టు తమ పరిశీలినలో తేలిందన్నారు. ప్రధానంగా మోరంచపల్లి, కొండాయి గ్రామాలు పూర్తిగా నీటమునగడంతో భారీ ఆస్తి నష్టం కలిగిందన్నారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కునాల్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం ఈ నెల 1 నుంచి 3 వరకు వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించింది. అనంతరం గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో సమావేశమై తమ పరిశీలనకు వచ్చిన విషయాలను వివరించింది. విపత్తుల నివారణకు కేంద్ర బృందం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని శాంతి కుమారి తెలిపారు. కేంద్రానికి సమగ్ర నివేదిక అందిస్తాం గురువారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం మండలాల్లో నష్టపోయిన పంటలను, ముంపు ప్రాంత ప్రజల ఇబ్బందులను కేంద్ర బృందం పరిశీలించింది. కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల దెబ్బతిన్న పంటలు, రహదారుల వివరాలను బృందం స భ్యులకు వివరించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ.. పంట, రహదారుల నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందిస్తామని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే అన్న బీజేపీ నేతలు వాతావరణశాఖ నుంచి ముందస్తు హెచ్చరికలు జారీ అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం తగిన వేగంతో స్పందించకపోవడంతోనే తీవ్రనష్టం వాటిల్లిందని కేంద్ర వరద పరిశీలక బృందం దృష్టికి బీజేపీ ప్రతినిధి బృందం తీసుకొచ్చింది. భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం మునిగిపోవడం వెనక రాష్ట్ర ప్రభుత్వ సమన్వయలేమి స్పష్టమైన ఉదాహరణగాకనిపిస్తోందని పేర్కొంది. గురువారం ఈ మేరకు కేంద్ర హోంశాఖ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు (పీపీ) కునాల్ సత్యార్థికి బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, పార్టీనేత అశ్వథ్థామరెడ్డి వినతిపత్రం సమర్పించారు. కేంద్రం నుంచి తగిన సహాయం అందేలా చూడాలని కోరారు. -
సమర్థంగా రసాయన ప్రమాదాల నియంత్రణ
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: భారీపరిశ్రమల్లో సంభవించే రసాయన ప్రమాదాలను సైతం సమర్థంగా నివారించే శక్తిసామర్థ్యాలు మనకున్నాయని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ప్రతినిధి బ్రిగేడ్ బి.ఎస్.తకర్ చెప్పారు. అగ్ని ప్రమాదాలతో పాటు ఫ్యాక్టరీల్లో సంభవించే ఇతర ప్రమాదాల నివారణపైనా దృష్టిపెట్టినట్టు తెలిపారు. ఎన్డీఎంఏ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఎస్డీఎంఏ) సహకారంతో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఆఫ్‌సైట్, ఆన్సైట్ ఫ్యాక్టరీల్లో కెమికల్ ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్ నిర్వహించారు. విశాఖపట్నంలోని ఈస్ట్ ఇండియా హెచ్‌పీసీఎల్ వద్ద నిర్వహించిన మాక్‌డ్రిల్‌ను బ్రిగేడ్ బి.ఎస్.తకర్, ఎస్డీఎంఏ ఎండీ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.ఎస్.సి.వర్మ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తకర్ మాట్లాడుతూ ఇలాంటి మాక్‌డ్రిల్స్‌తో పరిశ్రమల్లో రసాయన ప్రమాదాలు జరిగినప్పుడు యాజమాన్యం, ఆయా జిల్లాల యంత్రాంగం స్పందించి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెరుగుతుందని చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ సహజ, మానవ తప్పిదాలతో జరిగే విపత్తులతోపాటు కెమికల్ డిజాస్టర్స్‌పైనా దృష్టి సారించినట్లు తెలిపారు. అవగాహన, ముందుజాగ్రత్త చర్యలతో పాటు ప్రణాళిక రూపొందించడం ద్వారా రసాయనిక ప్రమాదాల స్థాయిని తగ్గించవచ్చన్నారు. భవిష్యత్‌లో వరదలు, తుపాన్లపైనా మాక్‌డ్రిల్స్‌తో అవగాహన కలి్పస్తామని చెప్పారు. 17 జిల్లాల్లో నిర్వహించిన మాక్‌డ్రిల్స్‌లో.. ఫ్యాక్టరీల్లో రసాయనిక ప్రమాదాలు జరిగితే ఎలా ప్రతి స్పందించి చర్యలు తీసుకుంటారో ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యక్షంగా చూపించాయి. -
సైన్సును తొక్కిపెట్టడం ప్రజాహితమా?
జోషీమఠ్ కొంతకాలంగా కుంగిపోతూ ఉందని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇచ్చిన కీలకమైన నివేదికను గుర్తించడానికి బదులుగా... దేశీయ శాస్త్ర పరిశోధనా సంస్థల నోరు మూయిస్తూ జాతీయ విపత్తు నిర్వహణా ప్రాధికార సంస్థ నిషేధాజ్ఞను జారీ చేసింది. శాస్త్రీయ సమాచారాన్ని తొక్కిపెట్టడమనేది ప్రజా హితం కోసం శాస్త్రవిజ్ఞానాన్ని అన్వయించడంలో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. ఇది వ్యక్తిగతంగా ఒక శాస్త్రజ్ఞుడు తన అభిప్రాయాలను వ్యక్తపర్చడానికి సంబంధించిన విషయం కాదు. ప్రభుత్వ విధాన నిర్ణయంలో సైన్స్ పాత్రకు సంబంధించింది. జీఎం ఆహార పదార్థాలు, నాసిరకం మందులు, డేటా గోప్యత, సూక్ష్మజీవుల నిరోధకత వంటి పలు స్పర్థాత్మక అంశాల్లో నిపుణుల అభిప్రాయాలు ఆరోగ్యకరమైన చర్చకు వీలుకల్పిస్తాయి. జోషీమఠ్ సంక్షోభం మరొక తత్సమానమైన తీవ్ర సవాలును దేశం ముందు ఉంచింది. అదేమిటంటే భారతీయ శాస్త్ర పరిశోధనా మండలులను, విద్యావిషయిక సంస్థలను నెమ్మదిగా క్షీణింపజేస్తూ రావడమే. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ అనుబంధ విభాగమైన హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సి) అందించిన రిమోట్ సెన్సింగ్ డేటాపై ఆధారపడి, జోషీమఠ్ కుంగుబాటుపై కీలకమైన ప్రాథమిక అంచనా జనవరి 11న వెలువడింది. 2022 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య జోషీమఠ్ 9 సెంటీమీటర్లు కుంగిందనీ, డిసెంబర్ 27 నుంచి 2023 జనవరి 8 మధ్యలో మరింత వేగంగా కుంగిందనీ ఈ నివేదిక తెలిపింది. జోషీమఠ్‌లో పరిస్థితి తీవ్రతను ఎత్తిచూపిన మొట్టమొదటి శాస్త్రీయ నివేదిక ఇదే. ఈ నివేదిక తీవ్రతను గుర్తించి, సకాలంలో వ్యవహరించడంలో తాను విఫలమయ్యాయని ఒప్పుకోవడానికి బదులుగా శాస్త్ర పరిశోధనా సంస్థల నోరు మూయిస్తూ జాతీయ విపత్తు నిర్వహణా ప్రాధికార సంస్థ (ఎన్డిఎమ్ఏ) నిషేధాజ్ఞను జారీ చేసింది. సాంప్రదాయిక లేదా సామాజిక మాధ్యమాల ద్వారా జోషీమఠ్‌పై ఎలాంటి సమాచారాన్ని లేక అభిప్రాయాన్ని ప్రజలతో పంచుకోవద్దని ఆదేశించింది. ఎన్ఆర్ఎస్సి, ఇస్రోలను మాత్రమే కాదు; శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి; శాస్త్ర, సాంకేతిక విభాగం; జలవనరుల మంత్రిత్వ శాఖ; ఐఐటీ–రూర్కీతోపాటు సర్వే ఆఫ్ ఇండియా, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి పలు శాస్త్రీయ సంస్థలకు చెందిన పరిశోధనా ల్యాబ్‌ల నోరు మూయించారు. ఈ సందర్భంగా ఎన్డీఎమ్ఏ ఆదేశం కనీవినీ ఎరుగనిదీ. ఎన్డీఎమ్ఏ కానీ, హోంశాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కానీ శాస్త్రీయ పరిశోధనా సంస్థల మాతృసంస్థలు కావు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరిగిన ఒక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఎన్డీఎమ్ఏ ఆదేశం సూచించినందున, ఇది రాజకీయ నిర్ణయం మాత్రమే. ఇస్రో, íసీఎస్ఐఆర్ వంటి సంస్థలు కాగితం మీద అయినా సరే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు. ఇవి హోంశాఖ పర్యవేక్షణలో లేనేలేవు. కొద్దినెలల క్రితమే, అన్ని శాస్త్ర విభాగాల కార్యదర్శులతో సమావేశానికి పిలుపునిచ్చిన హోంశాఖ కార్యదర్శి తన అధికారాల పరిధిని అతిక్రమించడమే కాకుండా ఇంతవరకు శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు ఇచ్చిన అవార్డులన్నింటినీ ఒక్క కలంపోటుతో రద్దు చేసిపడేశారు. జన్యుపరంగా పరివర్తింపజేసిన ఆహార ధాన్యాలపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలూ చేయవద్దంటూ... పనిచేస్తున్న, రిటైరైన శాస్త్రవేత్తలను ఐసీఏఆర్ ఇటీవలే తీవ్రంగా హెచ్చరించింది. శాస్త్ర పరిశీలనలపై ఆధారపడిన చర్చలు, వాటి సమాచారాన్ని ప్రజలకు పంచిపెట్టడాన్ని ప్రోత్సహించాలి. అనేక రంగాలలో శాస్త్రవేత్తలు నిత్యం డేటాను పంచుకుంటారు. అమెరికా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిష్ట్రేషన్ (నాసా)కు రిమోట్ సెన్సింగ్ డేటాను నిత్యం షేర్ చేసే పోర్టల్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ భూకంపాలు చోటుచేసుకున్నా దానికి సంబంధించిన డేటాను యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెబ్సైట్లో రియల్ టైమ్‌లో అందుబాటులో ఉంచుతుంటారు. ఇక జెనెటిక్ సీక్వెన్స్ డేటాబేస్లు ప్రపంచమంతటా శాస్త్రపరిశోధకులకు అందుబాటులో ఉంటున్నాయి. ఎన్ఆర్ఎస్సి రూపొందించిన అంచనాల్లో ఒక భాగం, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉపగ్రహం సెంటినెల్–1 నుంచి తీసిన ఛాయాచిత్రాలపై ఆధారపడి ఉంటోంది. ఈ ఉపగ్రహం సింథెటిక్ అపెర్చుర్ రాడార్‌ని కలిగివుంది. ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడూ, అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ రాత్రింబవళ్లు డేటాను సేకరించడంలో ఇది తోడ్పడుతుంది. ఎన్ఆర్ఎస్సి మదింపులో రెండో భాగం భారతీయ ఉపగ్రహమైన కార్టోసాట్–2ఎస్ నుంచి పంపిన ఛాయాచిత్రాలపై ఆధారపడి ఉంటోంది. ఇది 0.65 మీటర్ల రిజల్యూషన్ తో అన్ని రంగులను గుర్తించగలిగే ఛాయచిత్రాలను అందిస్తుంది. ఈ నేప థ్యంలో ఇఎస్ఏ, ఇస్రో నుండి పొందిన రిమోట్ సెన్సింగ్ డేటాను ఉపయోగించుకునే విశ్లేషణతో ముందుకొచ్చే ఎన్ఆర్ఎస్సి డేటాను ఎవరైనా అభినందించాలి తప్ప ఆంక్షలు విధించరాదు. ఈ విశ్లేషణ... ప్రభావిత ప్రాంతాల్లో నివసించే వారిలోనే కాకుండా, దేశ పౌరుల్లో కూడా గందరగోళాన్ని రేకెత్తిస్తున్నట్లు ఎన్డీఎమ్ఏ కనిపెట్టింది మరి. రిమోట్ సెన్సింగ్ డేటాను ఉపయోగించడంపై చర్చ ఉత్తరాఖండ్ ఉదంతం నేపథ్యంలో చోటు చేసుకుంటోంది. ఎందుకంటే భారత్‌లో రిమోట్ సెన్సింగ్ అధ్యయనాలకు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ జన్మస్థలం. ఇక్కడే భారతీయ ఫొటో ఇంటర్‌ప్రెటేషన్ ఇనిస్టిట్యూట్ (ఐపీఐ)ని 1966లో స్థాపించారు. ఇది 1957లో జవహర్లాల్ నెహ్రూ నెదర్లాండ్స్ సందర్శన సందర్భంగా కుదిరిన ఒప్పంద ఫలితం. ఐపీఐ... భారతీయ సర్వే సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంటుంది. దీన్ని 1969లో ఏర్పడిన ఇస్రోకు బదలాయించారు. ఇప్పుడు ఇది ఇస్రో నేతృత్వంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ పేరిట వ్యవహరిస్తోంది. మొట్టమొదటి భారతీయ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ 1988లో ఐఆర్ఎస్–1ఏ పేరిట ఆపరేషన్లను ప్రారంభించింది. ఈరోజు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు నాలుగు అత్యధునాతనమైన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలున్నాయి. అవి రిసోర్స్‌శాట్, కార్టోశాట్, ఓషనోశాట్, రైశాట్. భారతీయ ఫారెస్ట్ మ్యాప్ రూపకల్పన కోసం రిమోట్ సెన్సింగ్ డేటాను 1980లలో ఉపయోగించి, ఇస్రో చారిత్రాత్మకమైన తోడ్పాటును అందించింది. ఇది దేశంలో భారీ ఎత్తున అడవుల నరికివేత జరిగిందని చూపించింది. అంతవరకు భారతీయ ఫారెస్ట్ సర్వే సంస్థ (ఎఫ్ఎస్ఐ) రూపొందించిన ఫారెస్టు మ్యాప్‌లతో ఇస్రో మ్యాప్‌లు విభేదించాయి. ఈ కొత్త డేటా వెల్లడించినందుకు నోరు మూసుకోమని ఎవరూ ఆదేశించలేదు. దానికి బదులుగా, భారతీయ ఫారెస్ట్ సర్వే సంస్థ తన మ్యాపింగ్ ప్రక్రియలో రిమోట్ సెన్సింగ్ ఆధారిత టెక్నిక్‌ను పొందుపర్చుకోవడానికి అనుమతించారు. దీనివల్ల అడవుల విస్తీర్ణంపై కచ్చితమైన అంచనాకు రావడం సాధ్యమైంది. నిపుణుల జ్ఞానాన్ని తొక్కిపెట్టడమనేది ప్రజా హితం కోసం శాస్త్రవిజ్ఞానాన్ని అన్వయించే విషయంలో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. ఇది వ్యక్తిగతంగా ఒక శాస్త్రజ్ఞుడు తమ అభిప్రాయాలను వ్యక్తపర్చడానికి, డేటాను షేర్ చేసే హక్కుకు సంబంధించిన విషయం కాదు. అది ప్రభుత్వ విధాన నిర్ణయంలో, ప్రజాభిప్రాయాన్ని మలచడంలో సైన్స్ పాత్రకు సంబంధించిన విషయం. డేటాను పంచుకోవడం, నిపుణుల అభిప్రాయాలు లేక పరిశోధనా పత్రాలు అనేవి... జీఎం– ఆహార పదార్థాలు, హిమాలయ పర్యావరణం, నాసిరకం మందులు, డేటా గోప్యత లేదా సూక్ష్మజీవుల నిరోధకత వంటి పలు స్పర్థాత్మక అంశాల్లో ఆరోగ్యకరమైన చర్చలకు వీలుకల్పిస్తాయి. పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వివిధ అంశాలపై నిపుణులతో కూడిన విద్యా కేంద్రాలకు సంబంధించి విస్తారమైన నెట్వర్క్ కలిగి ఉన్న భారత్ వంటి దేశంలో, భిన్నాభిప్రాయాలు నిత్యం రంగంమీదికి వస్తుంటాయి. ఇలాంటి విభేదాలను సైంటిస్టులు, విద్యావేత్తలు, పౌర సమాజం తోడ్పాటుతో ఆరోగ్యకరమైన ప్రజా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. 1980లలో, కైగా అణు విద్యుత్ సంస్థపై తీవ్రవివాదం నెలకొన్న నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్... దేశంలోని అణు శాస్త్రవేత్తలు, పర్యావరణ కార్యకర్తల మధ్య ఒక చర్చను నిర్వహించింది. ఈరోజుల్లో అలాంటి చర్చలనుంచి పరిశోధనా మండలులు, విద్యా సంస్థలు దూరం జరుగుతున్నారు. వీటి మౌనంతో శాస్త్ర పరిశోధనా సంస్థల స్వయం ప్రతిపత్తిని మరింతగా క్షీణింప జేసేందుకు ప్రభుత్వానికి ప్రోత్సాహం లభిస్తోంది. దినేశ్ సి. శర్మ , వ్యాసకర్త శాస్త్ర వ్యవహారాల వ్యాఖ్యాత, (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ర్యాంటాక్, జింటాక్ టాబ్లెట్స్‌తో క్యాన్సర్?.. 26 ఔషధాలను నిషేధించిన కేంద్రం
న్యూఢిల్లీ: 26 రకాల ఔషధాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించింది. అత్యవసర జాబితా నుంచి ర్యాంటాక్, జింటాక్ టాబ్లెట్లను తొలగించింది. ర్యాంటాక్, జింటాక్ టాబ్లెట్లతో క్యాన్సర్ వస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. వాటితో పాటు 26 రకాల మందులను ఇండియా మార్కెట్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ర్యాంటాక్, జింటాక్ మందులను ఎసిడిటీ సంబంధింత సమస్యలకు వైద్యులు సూచిస్తారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ 384 ఔషధాలను కలిగి ఉన్న కొత్త నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్‌ను విడుదల చేయగా జాబితా నుండి తాజాగా 26 ఔషధాలను తొలగించింది. ఆల్టెప్లేస్, అటెనోలోల్, బ్లీచింగ్ పౌడర్. కాప్రోమైసిన్, సెట్రిమైడ్, క్లోర్ఫెనిరమైన్, డిలోక్సనైడ్ ఫ్యూరోయేట్, డిమెర్కాప్రోల్, ఎరిత్రోమైసిన్, ఇథినైల్స్ట్రాడియోల్, ఇథినైల్స్ట్రాడియోల్(ఏ) నోరెథిస్టిరాన్ (బీ),గాన్సిక్లోవిర్, కనామైసిన్, లామివుడిన్ (ఎ)+నెవిరాపైన్ (బి)+ స్టావుడిన్ (సి),లెఫ్లునోమైడ్, మిథైల్డోపా, నికోటినామైడ్, పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2a, పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2బి, పెంటమిడిన్, ప్రిలోకైన్ (A) + లిగ్నోకైన్ (B, ప్రోకార్బజైన్, రానిటిడిన్, రిఫాబుటిన్, స్టావుడిన్ (ఎ) + లామివుడిన్ (బి), సుక్రాల్ఫేట్, వైట్ పెట్రోలేటం నిషేధించిన 26 ఔషధాలు జాబితాలో ఉన్నాయి. -
ఆ ఒక్క కారణంతో కోవిడ్ పరిహారాన్ని ఆపొద్దు
న్యూఢిల్లీ: కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చే విషయంలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్డీఎంఏ) ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం అందజేసే విషయంలో రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మరింత స్పష్టతనిచ్చింది. ఓ వ్యక్తి కోవిడ్ వల్లనే మృతి చెందినట్లు డెత్ సర్టిఫికెట్లో స్పష్టంగా పొందుపరచలేదనే కారణంతో అతని కుటుంబానికి పరిహారం నిరాకరించరాదని రాష్ట్రాలను కోరింది. సదరు వ్యక్తి కోవిడ్–19 కారణంగానే మృతి చెందినట్లు ధ్రువీకరించే పత్రంతోపాటు దరఖాస్తు అందిన 30 రోజుల్లోగా సాయాన్ని అందించాలని కోరింది. మహమ్మారిని ఎదుర్కొనే సన్నద్ధత చర్యల్లో పాలుపంచుకున్న కోవిడ్ బాధిత మృతుల సమీప బంధువుకు కూడా పరిహారం ఇవ్వవచ్చని పేర్కొంది. -
పరిమిత వనరులతోనే కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం
న్యూఢిల్లీ: వనరులు చాలా పరిమితంగా ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని మిగతా దేశాల కంటే సమర్థంగా ఎదుర్కొందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మహమ్మారిపై పోరాటంలో మరణాల రేటును గణనీయంగా తగ్గించడంలో ప్రభుత్వం విజయం సాధించిందనీ, ఏ తటస్థ ఏజెన్సీతో అధ్యయనం చేయించినా ఇదే విషయం నిర్ధారణ అవుతుందని ఆయన అన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్డీఎంఏ) 17వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. మహమ్మారి సమయంలో విశేష సేవలందించిన ఎన్డీఎంఏ బృందాలను ఆయన ప్రశంసించారు. ఎలాంటి విపత్తు సంభవిం చినా తక్షణం స్పందించేలా పౌరులకు శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా 350 జిల్లాల్లో ‘ఆపద మిత్ర’కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోందని వెల్లడించారు. విపత్తులు సంభవించినప్పుడు తక్షణ ఎలా స్పందించాలి, ప్రజలను ఆపద నుంచి ఎలా కాపాడాలి వంటి విషయాలపై ఇందులో శిక్షణ ఇస్తామని చెప్పారు. ప్రాజెక్టులో పాలుపంచుకునే వారికి బీమా సౌకర్యం కూడా ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి 28 రాష్ట్రాలతో ఒప్పందాలు కూడా జరిగా యన్నారు. వరదలు తరచూ సంభవించేందుకు అవకాశం ఉన్న 25 రాష్ట్రాల్లోని 30 జిల్లాల్లో చేపట్టిన ‘ఆపద మిత్ర’పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయిందని చెప్పారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తుపాన్లు సంభవించినప్పటికీ ముందస్తు ప్రణాళిక, అప్రమత్తత కారణంగా ఎక్కడా ఒక్క ఆక్సిజన్ ప్లాంట్ కూడా దెబ్బతినలేదన్నారు. ఆస్పత్రులు, ఆక్సిజన్ ప్లాంట్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం కూడా సంభవించలేదని వివరించారు. 1999లో ఒడిశాలో సంభవించిన తుపానులో 10వేల ప్రజలు ప్రాణాలు కోల్పోగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు సంభవించిన మూడు తుపాన్లలో 50 మంది కంటే తక్కువగానే మృతి చెందారన్నారు. ఎలాంటి విపత్తులోనైనా సరే ప్రాణనష్టం వాటిల్లకుండా చూడాలన్నదే తమ లక్ష్యమన్నారు. పిడుగుపాట్లు వంటి వాటికి అమల్లోకి వచ్చిన ముందస్తు హెచ్చరికల వ్యవస్థతో ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు. -
ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేత
సాక్షి, అమరావతి/ శ్రీశైలం ప్రాజెక్ట్/ బెంగళూరు: కృష్ణా, ఉప నదులు మలప్రభ, ఘటప్రభల నుంచి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 1,41,389 క్యూసెక్కులు చేరుతుండటం, వరద ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) మార్గదర్శకాల మేరకు కర్ణాటక సర్కార్ ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేసింది. దిగువకు 1.80 లక్షల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఆ ప్రవాహం నారాయణపూర్ డ్యామ్‌లోకి చేరుతుండటంతో.. ముందు జాగ్రత్త చర్యగా డ్యామ్‌ను ఖాళీ చేస్తూ దిగువకు 1,87,678 క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ► ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలంలోకి గంట గంటకూ వరద ప్రవాహం పెరుగుతోంది. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగిస్తూ 38,140 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ► అప్పర్ తుంగ, భద్ర డ్యామ్‌లు నిండటంతో వరద నీటిని విడుదల చేస్తుండటంతో నీటి నిల్వ 49.78 టీఎంసీలకు చేరుకుంది. మరో 51 టీఎంసీల ప్రవాహం వస్తే తుంగభద్ర డ్యామ్ నిండిపోతుంది. ► పశ్చిమ కనుమల్లో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో కృష్ణా, ఉప నదులకు శనివారం వరద ప్రవాహం పెరుగుతుందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. -
వాతావరణ శాఖ తుఫాను హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మే 16న తుఫాన్ వచ్చే సూచనలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ బుధవారం ఒక బులిటెన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మే 16 నాటికి మరింత బలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఐయమ్‌డీ ట్వీట్లను కోట్ చేస్తూ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కూడా దీని గురించి హెచ్చరించింది. దీనితో పాటు మే 15, 16 తేదీలలో అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్పం నుంచి ఒక మాదిరి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐయమ్‌డీ తెలిపింది. అండమాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా జాతీయ విపత్తు సంస్థ హెచ్చరించింది. మే 15న 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడా వర్షం పడొచ్చని, మే 16న ఈ ప్రాంతంలోనే 75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐయమ్‌డీ పేర్కొంది. #CYCLONE ALERT Formation of a Low Pressure area over southeast #BayOfBengal and adjoining south #AndamanSea and its likely intensification into a #CyclonicStorm by 16th May, evening. Source :: @IMDWeather — NDMA India (@ndmaindia) May 13, 2020 -
అమరావతికి అన్నీ ప్రతికూలతలే
సాక్షి, అమరావతి: రాజధానిగా అమరావతి ప్రాంతం ఏమాత్రం అనుకూలం కాదని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ సాంకేతిక సంస్థలు ఐఐటీ–చెన్నై, యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లీయా–మాట్ మెక్ డొనాల్డ్–సీఈఈడబ్ల్యూ, ఎన్డీఎంఏ–ఐఐఐటీ (హైదరాబాద్) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అమరావతిలో 71 శాతం ప్రాంతానికి వరద ముప్పు ఉందని ఐఐటీ–చెన్నై స్పష్టం చేసింది. ఆ ప్రాంత వాతావరణంలో సమతుల్యత దెబ్బతిని అగ్నిగుండంగా మారుతుందని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లీయా–మాట్ మెక్ డొనాల్డ్–సీఈఈడబ్ల్యూ వెల్లడించింది. సెస్మిక్ జోన్–3 పరిధిలో ఉన్న ఈ ప్రాంతం భారీ భవనాల నిర్మాణానికి ఏమాత్రం అనువైనది కాదని ఎన్డీఎంఏ–ఐఐఐటీ (హైదరాబాద్) నివేదిక తేల్చి చెప్పింది. నివేదికల్లో ఆ సంస్థలు ఏం చెప్పాయంటే.. వరదొస్తే ముప్పే : ఐఐటీ–చెన్నై రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టిన 29 గ్రామాల్లో కనీసం 71 శాతం గ్రామాలపై కృష్ణా నది వరదలు తీవ్ర ప్రభావం చూపుతాయని ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)–చెన్నై తేల్చిచెప్పింది. కృష్ణా నదిలో వరద ప్రవాహం ఆరు, ఏడు లక్షల క్యూసెక్కులకు దాటితే రాజధాని గ్రామాల్లోకి వరద నీరు చేరి, 71 శాతం ప్రాంతాలను ముంచెత్తుతుందని వెల్లడించింది. కృష్ణా నది, కొండవీటి వాగులకు ఒకేసారి వరద వస్తే రాజధాని గ్రామాల్లో 0.5 నుంచి 1 మీటరు ఎత్తున నీరు ముంచెత్తుతుందని స్పష్టం చేసింది. ముంపు బారినుంచి రక్షించడానికి రాజధాని ప్రాంతంలోని భూములను 3 నుంచి 4 మీటర్ల ఎత్తున మట్టిపోసి అభివృద్ధి చేయాలని సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో పేర్కొనడాన్ని ఎత్తిచూపింది. నల్లరేగడి భూములు కావడం, రెండున్నర నుంచి 5 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభ్యం కావడం వల్ల రాజధాని గ్రామాల్లో భవన, రహదారుల నిర్మాణాల వ్యయం అధికమవుతుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ భవనాల సముదాయం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫైనాన్స్ సిటీ, టూరిజం సిటీ పనులు చేపట్టిన ప్రాంతాలపై వరదల ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ భూముల్లో భవనాలను నిర్మించడానికి రాఫ్ట్ ఫౌండేషన్ (పునాదులు తవ్వి.. రెండు వైపులా ఇనుప రేకులు దించి.. కాంక్రీట్ వేయడం)కు పనికి రాదని స్పష్టం చేసింది. రాజధాని భూముల్లో 40 మీటర్ల లోతుకు తవ్వితేగానీ రాతి పొర తగలదని, ఈ ప్రాంతంలో భవనాలు నిర్మించాలంటే.. పైల్ ఫౌండేషన్ (రిగ్‌ల ద్వారా 40 మీటర్ల లోతుకు పిల్లర్లను దించి.. అక్కడి నుంచి కాంక్రీట్ వేయడం) అవసరమని తేల్చింది. పైల్ పౌండేషన్ విధానంలో పునాదుల నిర్మాణానికి భారీ వ్యయం అవుతుందని.. ఇది భవన నిర్మాణ వ్యయాన్ని రెట్టింపు చేస్తుందని స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి ఆ ప్రాంతం ఏమాత్రం అనుకూలం కాదని విస్పష్టంగా తేల్చి చెప్పింది. ఆ ప్రాంతం అగ్నిగుండమే : సీఈఈడబ్ల్యూ బహుళ పంటలు పండే భూముల్లో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లీయా–మాట్ మెక్ డొనాల్డ్–కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండర్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) తేల్చిచెప్పింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో 1.20 లక్షల జనాభా ఉంది. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం.. 2050 నాటికి రాజధాని ప్రాంతంలో జనాభా 3.58 మిలియన్లకు చేరుకుంటుంది. పెరిగే జనాభా మేరకు నివాసం ఉండటానికి గృహాలు, రహదారులు, రైలు మార్గాలు నిర్మించాలి. గృహాల నిర్మాణంలో వినియోగించే స్టీలు, సిమెంటు, రహదారుల నిర్మాణంలో ఉపయోగించే బిటుమినస్ (బీటీ), ప్రజలు వినియోగించే ఏసీ (ఎయిర్ కండిషనర్ల)ల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని విశ్లేషించింది. పర్యవసానంగా 2050 నాటికి ఉష్ణోగ్రత 3.7 డిగ్రీల మేర పెరుగుతుందని స్పష్టం చేసింది. 2030 నాటికి 1.7 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని తేల్చిచెప్పింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో సాధారణంగా 30–42 డిగ్రీల మధ్య ఉష్ణోత్రలు నమోదవుతున్నాయి. మే 10, 2002న గరిష్టంగా 48.8 డిగ్రీలు, ఫిబ్రవరి 4, 2017న కనిష్టంగా 12.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రాజధాని ప్రాంతంలో 2050 నాటికి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలను దాటే అవకాశం ఉంటుందని స్పష్టీకరించింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఉష్ణ తీవ్రత అధికంగా ఉండే రోజులు 15. రాజధాని ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల ఉష్ణ తీవ్రత అధికంగా ఉండే రోజులు 52కు పెరగుతాయని.. అంటే అమరావతి అగ్నిగుండమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల అకాల వర్షాలు, కుండపోత వానలు పడటం వల్ల కొండవీటి వాగు, కృష్ణా నది ఉప్పొంగి రాజధాని ప్రాంతాన్ని వరదలతో ముంచెత్తుతాయని తేల్చింది. ప్రపంచ వ్యాప్తంగా సాధారణ ఉష్ణోగ్రతల కంటే కేవలం 0.5 డిగ్రీలు పెరగడంతో 2018లో జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. పంటల దిగుబడులను తీవ్రంగా దెబ్బతీసింది. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రత 3.7 డిగ్రీలు పెరిగితే జన జీవనం తీవ్రంగా దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉష్ణ తీవ్రత ఉండే రోజులు 52కు పెరిగితే వడగాల్పుల వల్ల ప్రజలు పిట్టల్లా రాలిపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. ఆకాశ హార్మ్యాలకు అనుకూలం కాదు : ఎన్డీఎంఏ–ఐఐఐటీ విజయవాడ చుట్టూ 150 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూమి అడుగున నియో టెక్టానిక్ పొరల్లో 26 చోట్ల లోపభూయిష్టంగా (ఫాల్ట్ జోన్స్) ఉండటం.. ఈ పొరలలో కంపనాల తీవ్రత 9–10 హెర్డ్›్జలు ఉండటం వల్ల భూకంపాల ప్రభావం అత్యధికంగా ఉంటుందని ఎన్డీఎంఏ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ), ఐఐఐటీ (ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) హైదరాబాద్ తేల్చింది. రాజధాని ప్రాంతం 50 అంతస్తుల భవనాల నిర్మాణానికి ఏమాత్రం అనుకూలం కాదని ఆ సంస్థల ఉమ్మడి అధ్యయన నివేదిక స్పష్టం చేస్తోంది. సెస్మిక్ జోన్ (భూకంప ప్రభావిత ప్రాంతం) 3లో విజయవాడ ఉండటం వల్ల భూకంపాలు వస్తే ఆకాశహార్మ్యాల వల్ల ప్రాణనష్టం భారీగా ఉంటుందని హెచ్చరించింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో 1861 నుంచి ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా చూస్తే సుమారు 170 సార్లు భూకంపాలు, ప్రకంపనలు సంభవించాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7 నుంచి 6 మ్యాగ్నిట్యూడ్‌ల వరకూ నమోదైంది. భూకంపం సంభవించినప్పుడు రిక్టర్ స్కేల్‌పై 6 మ్యాగ్నిట్యూడ్‌లకు మించి తీవ్రత నమోదైతే.. విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన బహుళ అంతస్తుల్లో 80 శాతం కూలిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. -
అందుకు అమరావతి అనువైన ప్రాంతం కాదు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతం భారీ ఆకాశహార్మ్యాల నిర్మాణానికి ఏమాత్రం అనువైన ప్రాంతం కాదా? ఇళ్ల నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పెను ప్రమాదం తప్పదా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ), ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ)–హైదరాబాద్ అధ్యయన నివేదిక. విజయవాడ చుట్టూ 150 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూమి అడుగున నియో టెక్టానిక్ పొరల్లో 26 చోట్ల లోపభూయిష్టంగా(ఫాల్ట్ జోన్స్) ఉండటం.. ఈ పొరల్లో కంపనాల తీవ్రత 9–10 హెర్జ్‌లు ఉంటుందని తేల్చింది. అందుకే అమరావతి ప్రాంతంలో 50 అంతస్థుల ఆకాశహార్మ్యాల నిర్మాణం చేపట్టడం శ్రేయస్కరం కాదని స్పష్టం చేసింది. దేశంలో 50 నగరాల్లో ప్రస్తుత పరిస్థితి, విపత్తులను అధిగమించడానికి చేపట్టాల్సిన చర్యలపై ఎన్డీఎంఏ– ఐఐఐటీ(హైదరాబాద్) సంయుక్తంగా అధ్యయనం చేశాయి. అధ్యయనంలో వెల్లడైన అంశాలు కృష్ణా నది ఒడ్డున ఉన్న సముద్ర మట్టానికి 39 అడుగుల ఎత్తులో విజయవాడ నగరం ఉంది. విజయవాడ చుట్టూ 150 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూమి అడుగున లోపభూయిష్టమైన నియో టెక్టానిక్ ప్లేట్లు విస్తరించి ఉన్నాయి. ఆ ప్రాంతం తేలికపాటి నేల స్వభావం కలిగి ఉంది. గుణదల, మంగళగిరి, మందడం, నిడమర్రు, తాడేపల్లి, నున్న ప్రాంతాల్లో భూగర్భం అడుగున పొరల్లో ఫాల్ట్ జోన్స్ ఉండటం అత్యంత ప్రమాదకరం. భూగర్భంలో నియో టెక్టానిక్ ప్లేట్స్ కంపనాల తీవ్రత 9–10 హెర్జ్లుగా ఉంది. ఈ ప్రాంతాల్లో జీ+1 విధానంలో భవనాలు నిర్మించడం శ్రేయస్కరం కాదు. అమరావతి ప్రాంతంలో ఆకాశహార్మ్యాల నిర్మాణాలు నిలువరించాలి. బోర్ల తవ్వకాలను నియంత్రించాలి. భవనాల నిర్మాణంపై స్థానిక సంస్థలు, బిల్డర్లకు అవగాహన కల్పించాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రణాళికను కార్యాచరణలోకి తీసుకురావాలి. -
ఈ రోజు అప్రమత్తంగా ఉండండి!
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) శుక్రవారం హెచ్చరించింది. వానలతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, పశ్చిమబెంగాల్, సిక్కిం, జార్ఖండ్, యూపీ, ఉత్తరాఖండ్, హరియాణా, ఛండీగఢ్, ఢిల్లీ, హిమాచల్, రాజస్థాన్, తెలంగాణ, గోవా రాష్ట్రాలతోపాటు కొంకణ్, విదర్భ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ భారత వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్‌ను ఎన్డీఎంఏ ఉటంకించింది. ప్రాథమిక చికిత్స కిట్లు, టార్చిలైట్, మంచినీళ్ల సీసాలు, నిల్వవుండే ఆహార పదార్థాలు సిద్ధంగా ఉంచుకోవాలని ప్రజలను ఎన్డీఎంఏ కోరింది. వరదలు వచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను చెరువులు, కాల్వల్లోకి వెళ్లనీయకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇటీవల కేరళ సహా పది రాష్ట్రాల్లో భారీ వర్షాలకు 1400 మందిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. -
కేరళను వీడని వరద బీభత్సం
తిరువనంతపురం/న్యూఢిల్లీ: కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 37 మంది మరణించగా, 35,874 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలకు పెరియార్ నదికి వరద పోటెత్తుతోంది. దీంతో పరీవాహాక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద బాధితుల సహాయార్థం తమిళనాడు ప్రభుత్వం 5 కోట్లు, సినీ నటులు కమల్ రూ.25 లక్షలు, సూర్య, కార్తీలు కలిపి రూ.25 లక్షలు విరాళాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కేరళ సర్కారుకు తగినన్ని సహాయనిధులు కేటాయించాలని ప్రధానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ లేఖ రాశారు. ఏపీ, కర్ణాటక తీరప్రాంతాలు, తమిళనాడు, బెంగాల్, కేరళ, సిక్కిం, హిమాచల్, యూపీ, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, అరుణాచల్, మేఘాలయ, అస్సాంలోనూ అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) హెచ్చరించింది. -
16 రాష్ట్రాలను ముంచెత్తనున్న అతిభారీ వర్షాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేరళను వణికిస్తున్నవర్షాలు మరిన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నాయి. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో అల్లకల్లో పరిస్థితుల కారణంగా రానున్న రెండు రోజుల్లో 16 రాష్ట్రాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్ కేరళ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ సహా 16 రాష్ట్రాల్లో భారీ వర్షాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపింది. కేరళతోపాటు సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, బీహార్, జార్ఖండ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తీరప్రాంత కర్నాటక, తమిళనాడులో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆది సోమ వారాల్లో ఉత్తరాఖండ్‌లో అతి భారీ వర్షాలుకురనున్నాయంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు శనివారం ఎన్డీఎంఏ శనివారం ఒక ప్రకటన జారీ చేసింది. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారనుందనీ, ఈ ప్రాంతంలోకి ప్రవేశించకూడదని మత్స్యకారులకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు సూచించారు. భారతీయ వాతావరణ విభాగం సమాచారం మేరకు ఆగస్టు 12(ఆదివారం), ఆగష్టు 13 (సోమవారం) ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురవనున్నాయంటూ అప్రతమత్తను జారీ చేసింది. -
ప్రాణం తీసిన మాక్ డ్రిల్; నకిలీ ఎన్డీఎమ్ఏ ఉద్యోగి
సాక్షి, చెన్నై: కోయంబత్తూరు జిల్లా నర్సీపురంలోని కోవై కలైమగల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన మాక్ డ్రిల్‌లో 19 ఏళ్ల బీబీఏ స్టూడెంట్ లోగేశ్వరి ప్రమాదవశాత్తు మరణించిన సంగతి తెలిసింది. ఈ ఘటనకు బాధ్యుడైన అర్ముగం ప్రస్తుతం పోలీసులు రిమాండ్‌లో ఉన్నాడు. అయితే పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు అర్ముగం ఎన్డీఎమ్ఏ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటి) ఉద్యోగే కాదని తెలిసింది. కళాశాల యాజమాన్యం పూర్తి వివరాలు విచారించకుండానే అతన్ని మాక్ డ్రిల్ కోసం పిలిపించారని పోలీసు అధికారులు భావిస్తున్నారు. విచారణలో భాగంగా పోలీసులు అర్ముగం వివరాలను సేకరించారు. అయితే ఇవన్ని నకిలీవని తెలింది. అంతేకాక అతని ఇచ్చిన అడ్రస్ ప్రూఫ్ కూడా నకిలేదేనని నిర్ధారించారు. అతని దగ్గర దొరికిన ఎన్డీఎమ్ఏ గుర్తింపు పత్రాలు కూడా ఫోర్జరివేనని గుర్తించారు. అంతేకాక అర్ముగం తన ఫేస్బుక్ ప్రోఫైల్‌లో తనను తాను ఎన్డీఎమ్ఏ ఉద్యోగిగా ప్రకటించుకున్నట్లు తెలిసింది. కాలేజీ యాజమాన్యం కేవలం అర్ముగం ఫేస్బుక్ ప్రొఫైల్ చూసి అతన్ని ఎన్డీఎమ్ఏ సభ్యునిగా భావించారని, అతని పూర్తి వివరాలను తెలుసుకోలేదని తెలిపారు. విచారణ కోనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు. అయితే మృతురాలి తల్లితండ్రులు తమ కుమార్తె మరణానికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అతను ఎన్డీఎమ్ఏ సభ్యుడు కాదు: ఎన్డీఎమ్ఏ అర్ముగం తనను తాను ఎన్‌ఎమ్‌డీఏ ఉద్యోగిగా చెప్పుకుని కాలేజీలో మాక్ డ్రిల్ నిర్వహించి ఒకరి మరణానికి కారణమవడంతో స్వయంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎమ్ఏ) రంగంలోకి దిగింది. మాక్ డ్రిల్ నిర్వహించిన సభ్యుడు ఎన్‌డీఎమ్‌ఏకు చెందిన వ్యక్తి కాదని ప్రకటన విడుదల చేసింది. వివరాల ప్రకారం.. ‘ఇటువంటి మాక్ డ్రిల్స్‌కు ఎన్డీఎమ్ఏ అనుమతివ్వదు. కాలేజీలో నిర్వహించిన మాక్ డ్రిల్‌లో ఎన్డీఎమ్ఏ భాగస్వామ్యం లేదు. సదరు ట్రైనీ అసలు ఎన్‌డీఎమ్‌ఏకు చెందిన వ్యక్తే కాద’ని ప్రకటించింది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఇటువంటి డ్రిల్స్ నిర్వహించకూడదని హెచ్చరించింది. ఏది ఏమైనా పొరపాటు జరిగిందని, ఒక నిండు ప్రాణం బలైందని సంతాపం తెలిపింది. -
పాకిస్తాన్లో వరదలు: 164 మంది మృతి
-
పాకిస్తాన్లో వరదలు: 164 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు వరదల కారణంగా 164 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడ్డారని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. సింధూ, పంజాబ్ ప్రావిన్సిస్లలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) తెలిపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారని, భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించినట్లు గుర్తించామని ఓ ప్రకటనలో వెల్లడించింది. వరదల వల్ల నిరాశ్రయులైన వారి కోసం భోజన, తాత్కాలిక నివాస వసతి ఏర్పాట్లు చేసి అధికారులు పునరావాస చర్యలు చేపడుతున్నారు. -
'విపత్తు నిర్వహణను విస్మరిస్తున్నారు'
న్యూఢిల్లీ: భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు సహాయ కార్యక్రమాల నిర్వహణకోసం 2005లో ఏర్పాటయిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) కార్యకలపాలను ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం నీరుకారుస్తోందని ఆ సంస్థ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. తన రాజీనామా తరువాత ఏడాది కాలంగా ఖాళీగా ఉంటోన్న ఎన్డీఎంఏ వైస్ చైర్మన్ పదవిలో నేటికీ నియామకం చేపట్టకపోవడం, సభ్యుల సంఖ్యను కూడా కుదించడం, ఇటీవల వరదలు సంభవించిన ప్రాంతాల్లో ఎన్డీఎంఏకు పని కల్పించకపోవడం వంటి నిర్ణయాలే ఇందుకు నిదర్శనమన్నారు. చార్ధామ్ వరదలు, ఫైలిన్ తుఫాను సందర్భంలో పౌరుల ప్రాణాలు కాపాడేందుకు ఎన్డీఎంఏ కనబర్చిన చొరవను ప్రస్తుత ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. గతంలో క్యాబినెట్ ర్యాంకు హోదా కలిగిన ఎన్డీఎంఏ వైస్ చైర్మన్ పదవిని క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి తగ్గించడంపైనా మర్రి మండిపడ్డారు. ఎన్డీఎంఏ లాంటి సంస్థల అవసరం దేశానికి అన్నివేళలా అవసరం ఉంటుందని పేర్కొన్నారు. -
మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా
హైదరాబాద్: జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్డిఎంఏ)ఉపాధ్యక్ష పదవికి మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా చేశారు. యుపిఏ ప్రభుత్వం నియమించిన పదవుల నుంచి దాదాపు అందరినీ రాజీనామా చేయమని కేంద్రం కోరుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఎన్డిఎంఏ సభ్యులందరిని రాజీనామా చేయాలని కేంద్రం కోరింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎన్డిఎంఏ సభ్యులందరికి ఫోన్ చేసి రాజీనామా చేయమని కోరారు. దాంతో మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా చేశారు. -
ముందుజాగ్రత్తలతో తప్పిన పెనుముప్పు
పై-లీన్ తుఫాను తీరం దాటినప్పుడు గాలి వేగం దాదాపు గంటకు 220-240 కిలోమీటర్లు ఉంది. తుఫాను కూడా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకింది. ఇంత తీవ్రత ఉన్న తుఫాను సంభవిస్తే జనం అల్లాడిపోవాలి. నిజానికి 1999లో కూడా ఇంతే తీవ్రతతో తుఫాను సంభవించి ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది అప్పటి విలయానికి దాదాపు 12 వేల మంది మరణించారు. దాంతో అప్పటి ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో నేతృత్వంలోని ప్రభుత్వం రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది. అయితే.. ఈసారి కూడా అంతే తీవ్రతతో తుఫాను తీరాన్ని దాటినా, ప్రాణనష్టం అత్యంత తక్కువగా ఉండటం గమనార్హం. ముందస్తుగానే వాతావరణ శాఖ హెచ్చరించడం, దానికితోడు రాష్ట్ర అధికార యంత్రాంగంతో పాటు ఎన్డీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, వైమానిక దళాలు.. ఇలా అందరూ అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం ఎక్కువ సంభవించకుండా అరికట్టగలిగారు. తుఫాను ప్రభావంతో కేవలం ఆరుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. ముందుగానే జాగ్రత్త వహించి ఒడిశా నుంచి దాదాపు 8 లక్షల మందిని, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం ద్వారా భారీ ప్రాణనష్టం సంభవించకుండా నివారించగలిగినట్లు ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ కృష్ణచౌదరి తెలిపారు. -
జగన్, చంద్రబాబుకు ఎన్డీఎమ్ఏ లేఖ
న్యూఢిల్లీ: ఫైలిన్ తుఫాన్ తీవ్రరూపం దాల్చచడంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎమ్ఏ) అప్రమత్తమయింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు పొంచివుండడంతో ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది. సహాయక చర్యలు కొనసాగించేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఎన్డీఎమ్ఏ ఉపాధ్యక్షుడు కోరారు. మానవతా దృక్పథంలో ఆందోళన కార్యక్రమాలు 15 రోజులు వాయిదా వేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇరువురు నేతలకు లేఖలు రాశారు. ఢిల్లీలో దీక్ష చేస్తున్న చంద్రబాబుకు లేఖ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర సిబ్బంది తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొనాల్సివుందని తెలిపారు. ఫైలిన్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కళింగపట్నం - పారాదీప్‌ల మధ్య ఈనెల 12న ఫైలిన్ తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు ఎన్‌ఎమ్‌డీఏ సహాయక బృందాలు పంపింది. ఒడిశాకు 8, ఆంధ్రప్రదేశ్‌కు 9 బృందాలు పంపింది. అలాగే ఎయిర్‌ఫోర్స్, నావికాదళం, ఆరోగ్య శాఖల సహకారం కూడా ఎన్‌ఎమ్‌డీఏ కోరింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచింది. శ్రీకాకుళం: 08942 240557, 9652838191 గుంటూరు : 08644 - 223800 తూర్పుగోదావరి: 08856 - 233100 పశ్చిమగోదావరి: 08812 230617 నెల్లూరు: 1800 425 2499, 08612 331477