
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చే విషయంలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం అందజేసే విషయంలో రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మరింత స్పష్టతనిచ్చింది. ఓ వ్యక్తి కోవిడ్ వల్లనే మృతి చెందినట్లు డెత్ సర్టిఫికెట్‌లో స్పష్టంగా పొందుపరచలేదనే కారణంతో అతని కుటుంబానికి పరిహారం నిరాకరించరాదని రాష్ట్రాలను కోరింది.
సదరు వ్యక్తి కోవిడ్–19 కారణంగానే మృతి చెందినట్లు ధ్రువీకరించే పత్రంతోపాటు దరఖాస్తు అందిన 30 రోజుల్లోగా సాయాన్ని అందించాలని కోరింది. మహమ్మారిని ఎదుర్కొనే సన్నద్ధత చర్యల్లో పాలుపంచుకున్న కోవిడ్ బాధిత మృతుల సమీప బంధువుకు కూడా పరిహారం ఇవ్వవచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment