పాకిస్తాన్‌లో వరదలు: 164 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు వరదల కారణంగా 164 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడ్డారని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.
సింధూ, పంజాబ్ ప్రావిన్సిస్‌లలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) తెలిపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారని, భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించినట్లు గుర్తించామని ఓ ప్రకటనలో వెల్లడించింది. వరదల వల్ల నిరాశ్రయులైన వారి కోసం భోజన, తాత్కాలిక నివాస వసతి ఏర్పాట్లు చేసి అధికారులు పునరావాస చర్యలు చేపడుతున్నారు.