సాక్షి, న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మే 16న తుఫాన్ వచ్చే సూచనలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ బుధవారం ఒక బులిటెన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మే 16 నాటికి మరింత బలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఐయమ్‌డీ ట్వీట్‌లను కోట్ చేస్తూ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కూడా దీని గురించి హెచ్చరించింది.
దీనితో పాటు మే 15, 16 తేదీలలో అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్పం నుంచి ఒక మాదిరి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐయమ్‌డీ తెలిపింది. అండమాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా జాతీయ విపత్తు సంస్థ హెచ్చరించింది. మే 15న 45-55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడా వర్షం పడొచ్చని, మే 16న ఈ ప్రాంతంలోనే 75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐయమ్‌డీ పేర్కొంది.
#CYCLONE ALERT
— NDMA India (@ndmaindia) May 13, 2020
Formation of a Low Pressure area over southeast #BayOfBengal and adjoining south #AndamanSea and its likely intensification into a #CyclonicStorm by 16th May, evening.
Source :: @IMDWeather
Comments
Please login to add a commentAdd a comment