Vivo Y56 5G: వివో వై సిరీస్‌లో మరొకటి.. ధర రూ.20వేల లోపే! | Vivo Y Series Another One Price Under Rs 20000 | Sakshi
Sakshi News home page

Vivo Y56 5G: వివో వై సిరీస్‌లో మరొకటి.. ధర రూ.20వేల లోపే!

Published Sat, Feb 18 2023 4:27 PM | Last Updated on Sat, Feb 18 2023 4:33 PM

Vivo Y Series Another One Price Under Rs 20000 - Sakshi

మిడ్‌-రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో..  వై సిరీస్‌లో మరో ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే లాంచ్‌ అయిన వివో వై100 కస్టమర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. భారత్‌లో వివో వై100 విడుదలైన కొద్దిసేపటికే వివో వై56 5జీ మార్కెట్‌లోకి వచ్చేసింది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ బడ్జెట్‌ కేటగిరీ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 19,999. ఆరెంజ్‌ షిమ్మర్‌, బ్లాక్‌ ఇంజిన్‌ రంగుల్లో లభిస్తోంది. వివో అఫీషియల్‌ వెబ్‌సైట్‌తోపాటు రిటైల్ స్టోర్‌లలోనూ కొనుగోలు చేయొచ్చు​. మరి ఈ ఫోన్‌ ఫీచర్స్‌, స్పెసిఫికేషన్స్‌ ఏంటో చూసేయండి..


వివో వై56 5జీ స్పెసిఫికేషన్స్‌, ఫీచర్స్‌:

  • 6.58 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ స్క్రీన్‌
  • ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ 
  • 8జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ (SD కార్డ్‌తో 1టీబీ వరకు పెంచుకోవచ్చు)
  • 50ఎంపీ రియర్‌ కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
  • 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • బరువు 184 గ్రాములు

(ఇదీ చదవండి: రంగులు మార్చే ఫోన్‌: వివో వై100 లాంచ్‌, ధర ఎంతంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement