సూపర్‌ ఫీచర్లు, తక్కువ ధర : వివో కొత్త ఫోన్‌ | Vivo Y12s Dual Rear Cameras 5000mAh Battery Launched  | Sakshi
Sakshi News home page

సూపర్‌ ఫీచర్లు, తక్కువ ధర : వివో కొత్త ఫోన్‌

Jan 12 2021 2:55 PM | Updated on Jan 12 2021 3:28 PM

 Vivo Y12s Dual Rear Cameras 5000mAh Battery Launched  - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వివో డ్యూయల్‌రియర్‌కెమెరా 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై 12 ఎస్ ను భారత్‌లో లాంచ్ చేసింది.  

సాక్షి,ముంబై : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. డ్యూయల్ రియర్ కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై 12ఎస్ ను భారత్‌లో లాంచ్ చేసింది. వాటర్‌డ్రాప్ తరహా డిస్‌ప్లే నాచ్‌ లాంటి ఫీచర‍్లతో వచ్చిన బడ్జెట్‌ ఫోన్‌గా మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

వివో వై 12 ఎస్‌  ధర, లభ్యత
సింగిల్‌ వేరియంట్‌లో  వివోవై12 ఎస్‌ లభ్యం. 3 జీబీ+ 32జీబీ  స్టోరేజ్ వేరియంట్‌కు 9,990 రూపాయలుగా నిర్ణయించింది.  ఈ స్మార్ట్‌ఫోన్ ఫాంటమ్ బ్లాక్,   గ్లేసియర్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, టాటా క్లిక్,  దేశంలోని ఇతర భాగస్వామి రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

వివో వై 12ఎస్‌ స్పెసిఫికేషన్లు
6.51అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
720x1,600 పిక్సెల్స్ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్ 10 
ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పీ 35 సాక్‌
13+2 మెగాపిక్సెల్‌ డ్యూయల్ రియర్ కెమెరా 
8 మెగాపిక్సెల్‌  సెల్ఫీ కెమెరా,
5000 ఎంఏహెచ్ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement