
సాక్షి, ముంబై: చైనా మొబైల్ కంపెనీ వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది 'వివో ఎక్స్21' పేరుతో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో మంగళవారం విడుదల చేసింది. రూ.35,990 ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభిస్తున్న వివో ఎక్స్21 ధరను రూ. 35,990గా నిర్ణయించింది. భారీ డిస్‌ప్లే, డిస్‌ప్లే కిందే ఫింగర్‌ప్రింట్ స్కానర్ తమ నూతన స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతగా కంపెనీ తెలిపింది.
వివో ఎక్స్21 ఫీచర్లు
6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
2280 x 1080 రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగెన్ 660 ఎస్‌ఓసీ ప్రాసెసర్
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
12+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
12 ఎంపీ సెల్ఫీ కెమెరా
3200 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment