Vivo Mobile Company
-
మనీలాండరింగ్ కేసులో లావా ఎండీ అరెస్టు
మనీ లాండరింగ్ కార్యకలాపాలపై కొనసాగుతున్న విచారణలో భాగంగా లావా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు హరి ఓం రాయ్‌తో పాటు వివో మొబైల్స్ ఇండియాకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం అరెస్టు చేసింది. అయితే హరి ఓం రాయ్ ప్రమేయంపై నిర్దిష్ట వివరాలు ఇంకా వెల్లడించలేదు. వివో మొబైల్స్ ఇండియా, గ్రాండ్ ప్రాస్పెక్ట్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ (జీపీఐసీపీఎల్)తో సహా 23 అనుబంధ కంపెనీలకు చెందిన 48 స్థానాల్లో ఈడీ దాడుల నిర్వహించింది. దిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కు అనుగుణంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఫిబ్రవరి 3, 2022న ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అయిలే జీపీఐసీపీఎల్ నేరపూరిత చర్యలకు పాల్పడిందని ఆరోపిస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. అక్రమంగా చైనాకు నిధులు తరలించడమే లక్ష్యంగా భారత్‌లో బోగస్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భారత్‌లో పన్నులు ఎగవేస్తూ వివో మొబైల్స్ ఇండియా విక్రయాల ద్వారా వచ్చిన మొత్తంలో దాదాపు సగం డబ్బును చైనాకు తరలించిందనే ఆరోపణలు వచ్చాయి. -
సరికొత్త టెక్నాలజీతో వివో వై36 లాంచ్: ధర తక్కువే!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌నులాంచ్ చేసింది. 50 ఎంపీ కెమెరా, భారీ బ్యాటరీతో వివో వై సిరీస్‌లో వివో వై 36 కెమెరాను భారత మార్కెట్లో తీసు కొచ్చింది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్ ఇతర రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సన్‌లైట్-రీడబుల్ డిస్ప్లే అంటే ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం ఈజీ అని పేర్కొంది. ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్ కొత్త సూపర్ లగ్జరీ కారు, ధరెంతో తెలిస్తే షాకవుతారు! వివో వై36 ధరలు, లభ్యత 8జీబీ ర్యామ్ +128జీబీ స్టోరేయ్ వేరియంట్ రూ. 16,999గా నిర్ణయించింది. 'డైనమిక్ డ్యూయల్ రింగ్' డిజైన్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ వైబ్రాంట్ గోల్డ్ మెటోర్ బ్లాక్ అనే రెండు రంగులలో వస్తుంది. ICICI & HDFC కార్డ్ ద్వారా జరిపే కొనుగోళ్లపై రూ. 500 తగ్గింపు వివో వై36 ఫీచర్లు 6.64-అంగుళాల FHD+ హై-క్వాలిటీ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ 50+2 ఎంపీ రియర్‌కెమెరా ఆరా స్క్రీన్ లైట్‌తో 16MP ఫ్రంట్ కెమెరా 5000mAh బ్యాటరీ, 44W ఫ్లాష్ ఛార్జ్ (Global Chess League 2023 ఆనంద్ VS ఆనంద్: మహీంద్ర ట్వీట్ వైరల్) Here's another reason to amp up your style! Bringing you the all-new vivo Y36 with Stylish Glass Design and 44W Flash Charge. Buy now!#ItsMyStyle #vivoY36 pic.twitter.com/BI4ngPIJwi — vivo India (@Vivo_India) June 22, 2023 -
వావ్ అనే లుక్‌లో వివో వై16.. ఫీచర్లు అదిరే, రూ.10వేల కన్నా తక్కువే!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల బ్రాండ్ వివో కొత్తగా తమ వై–సిరీస్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. వై16 ఫోన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 9,999 (3జీబీ+32 జీబీ) నుంచి రూ. 12,499 (4 జీబీ+64 జీబీ) వరకూ ఉంటుంది. స్టెల్లార్ బ్లాక్, డ్రిజ్లింగ్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. కోటక్, ఐడీఎఫ్సీ, వన్‌కార్డ్, బీవోబీ, ఫెడరల్, ఏయూ బ్యాంక్ కార్డులతో రూ. 1,000 వరకూ, ఆన్లైన్ కొనుగోలుదారులు హెచ్డీఎఫ్సీ డెబిట్/క్రెడిట్ కార్డులపై రూ. 750 మేర క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. 6.51 అంగుళాల స్క్రీన్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ వేక్ ఫీచర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ కార్డ్ స్లాట్, 13 ఎంపీ మెయిన్.. 2 ఎంపీ మాక్రో కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కమెరా, మీడియాటెక్ పీ35 ఆక్టా కోర్ ప్రాసెసర్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయని సంస్థ తెలిపింది. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
‘వివో’ వెనకడుగు...
‘ఐపీఎల్–2020 స్పాన్సర్లలో ఎలాంటి మార్పు లేదు. ఈసారి కూడా ప్రధాన స్పాన్సర్‌గా ‘వివో’ కొనసాగుతుంది’... ఆదివారం జరిగిన సమావేశం తర్వాత ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చేసిన అధికారిక ప్రకటన ఇది. అయితే రెండు రోజుల్లోపే అంతా మారిపోయింది. ఈ ఏడాది యూఏఈలో జరిగే లీగ్ స్పాన్సర్షిప్ హక్కులు వదిలేసుకోవాలని చైనా మొబైల్ సంస్థ ‘వివో’ భావిస్తోంది. ఇంకా అధికారికంగా బీసీసీఐ దీనిని ఖరారు చేయకపోయినా... ‘వివో’ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముంబై: ఐపీఎల్–13 కోసం సన్నద్ధమవుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కీలక సమయంలో షాక్ తగిలింది. టోర్నీ ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న చైనా ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ ‘వివో’ లీగ్‌తో భాగస్వామ్యాన్ని వదులుకోవాలని నిర్ణయించుకుంది. బోర్డు వైపు నుంచి ఎలాంటి సమస్యా లేకపోయినా చైనాకు చెందిన కంపెనీ కావడంతో ‘వివో’పై గత రెండు రోజులుగా విమర్శల పర్వం తీవ్రంగా సాగింది. గల్వాన్ లోయలో చైనా చేతిలో భారత సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలోనూ ‘వివో’తో జత కట్టడంపై కొందరు బహిరంగంగా బోర్డు నిర్ణయాన్ని తప్పుపట్టగా... పెద్ద సంఖ్యలో అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకు పడ్డారు. దాంతో ‘వివో’ వెనక్కి తగ్గినట్లు సమాచారం. భారీ మొత్తానికి... 2008లో ఐపీఎల్ మొదలైన తర్వాత ముందుగా డీఎల్ఎఫ్, ఆ తర్వాత పెప్సీ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరించాయి. అయితే స్పాట్ ఫిక్సింగ్ అనంతరం వచ్చి న వివాదాలతో పెప్సీ అర్ధాంతరంగా తమ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకోగా మధ్యలో రెండేళ్ల కాలానికి ‘వివో’ స్పాన్సర్షిప్ కోసం ముందుకు వచ్చింది. ఆ తర్వాత 2017లో బోర్డుతో వివో ఐదేళ్ల కాలానికి భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2018–2022 మధ్య ఐదేళ్ల ఐపీఎల్‌కు రూ. 2199 కోట్లు (ఏడాదికి రూ. 440 కోట్ల చొప్పున) చెల్లించేందుకు సిద్ధమైంది. ఇందులో ప్రస్తుతం రెండేళ్లు మాత్రమే పూర్తయ్యాయి. గల్వాన్ ఘటన తర్వాత చైనా కంపెనీలతో ఒప్పందాలను పునఃస్సమీక్షిస్తామని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఐపీఎల్ సమావేశంలో మాత్రం అలాంటిదేమీ కనిపించలేదు. ‘కాంట్రాక్ట్ ఉల్లంఘన సమస్యలు’ తదితర అంశాలను కారణాలుగా చూపిస్తూ ‘వివో’ తదితర కంపెనీలను కొనసాగించేందుకే సిద్ధమైనట్లు ప్రకటించింది. ఒప్పందంలో ఇతర షరతులు, నిబంధనలపై పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోయినా... ఈసారి లీగ్‌తో జత కట్టడంకంటే దూరంగా ఉంటేనే మేలని ‘వివో’ భావించినట్లుంది. తాము చెల్లిస్తున్న భారీ మొత్తానికి తగినంత ప్రచారాన్ని, లాభాన్ని ఏ కంపెనీ అయినా కోరుకోవడం సహజం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ‘వివో’ ఆశించింది జరగకపోవచ్చు. కరోనా ఒక కారణం కాగా, చైనా కంపెనీలపై భారత్‌లో వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో ‘వివో’ ఆదాయంపై సహజంగానే ప్రభావం పడి ఉండవచ్చు. అన్నింటికి మంచి మరో ప్రధాన కారణం నిబంధనల ప్రకారం ఐపీఎల్ ఆటగాళ్లు, జట్లు కచ్చితంగా ‘వివో’ ఉత్పత్తులకు ప్రచారం చేసి పెట్టాలి. ఈ సమయంలో ఏ కోహ్లితోనో, ధోనితోనో ‘వివో’ ఫోన్ కొనమని చెప్పించడం అంత సులువు కాదు! దీనివల్ల ప్రచారం కంటే ప్రతికూలం ప్రభావమే ఎక్కువగా పడుతుంది. వీటన్నింటికంటే లీగ్‌కు దూరంగా ఉండ టమే మేలని కంపెనీ అనుకున్నట్లుంది. అయితే అది ఈ ఒక్క ఏడాదికేనా లేక పూర్తిగా లీగ్ నుంచి తప్పుకున్నట్లా అనేదానిపై స్పష్టత లేదు. ఈ ఒక్క ఏడాది మాత్రమే ‘వివో’ వైదొలగితే... ఒప్పందాన్ని 2023 వరకు పొడిగించే అవకాశం ఉంది. మా సంగతేంటి... ఐపీఎల్ స్థాయిని బట్టి చూస్తే కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవడం బోర్డుకు పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే ‘వివో’ ఇస్తున్న రూ. 440 కోట్లు వస్తాయా అనేది కాస్త సందేహమే. అంతకంటే తక్కువ మొత్తం రావచ్చని బోర్డు ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. మరో వైపు ‘వివో’ ఒప్పందం ప్రభావం తమపై ఏమాత్రం ఉండదని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ప్రధాన స్పాన్సర్ ద్వారా వచ్చే ఆదాయంలో ప్రతీ ఫ్రాంచైజీకి ఏడాదికి రూ. 20 కోట్లు లభిస్తాయి. ఇప్పుడు ‘వివో’ తప్పుకున్నా... మరొకరు వస్తే తమకు రావాల్సింది ఎలాగూ దక్కుతుందని, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఫ్రాంచైజీలు చెబుతున్నాయి. అయితే ఐపీఎల్‌కు ప్రేక్షకులను అనుమతించకపోతే కోల్పోయే టికెట్ల డబ్బు (గేట్ రెవిన్యూ) విషయంపై మాత్రం వారు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. తాము కోల్పోయే ఆదాయాన్ని నష్టపరిహారంగా బోర్డు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై తామంతా ఒకే తాటిపై ఉండాలంటూ ఒక ప్రముఖ ఫ్రాంచైజీ యాజమాన్యం ఇతర ఏడు జట్ల మేనేజ్మెంట్లతో మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుతం యూఏఈలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే కనీసం 30–40 శాతం ప్రేక్షకులనైనా అనుమతించేలా బోర్డు ప్రయత్నిస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 19 వరకు లీగ్ జరగనుంది. -
రూ.2,199 కోట్లకు ఐపీఎల్ టైటిల్ హక్కులు
ఐదేళ్ల కాలానికి ‘వివో’ భారీ ఒప్పందం న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్ హక్కులను ‘వివో’ మొబైల్ కంపెనీ దిమ్మతిరిగే రేటుతో దక్కించుకుంది. ఐదేళ్ల కాలానికి ఏకంగా రూ.2,199 కోట్ల భారీ ధరతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది గత ఒప్పందంకన్నా 554 శాతం అధికం కావడం విశేషం. ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున 2016–17 సీజన్లో వివో కంపెనీయే టైటిల్‌ను స్పాన్సర్ చేసింది. కానీ ఈసారి మాత్రం రేటు విషయంలో దూకుడుగా వెళ్లింది. ‘వచ్చే ఏడాది నుంచి 2022 వరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను రూ.2,199 కోట్లకు వివో మొబైల్ కంపెనీ దక్కించుకుంది. క్రీడా ఈవెంట్స్, మైదానంలో కార్యక్రమాలు, మార్కెటింగ్ ప్రచారాల విషయంలో మున్ముందు ఐపీఎల్, వివో కలిసి పనిచేస్తాయి’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఏడాదికి రూ.440 కోట్లు బీసీసీఐకి ఈ ఒప్పందం ద్వారా ఆదాయం రానుంది. ఆగస్టు 1, 2017 నుంచి జూలై 31, 2022 మధ్య కాలానికి ఐపీఎల్ టైటిల్ హక్కుల కోసం గత నెల బిడ్స్‌ను ఆహ్వానించారు. వివోకు పోటీగా మరో మొబైల్ కంపెనీ ఒప్పో రూ.1,430 కోట్లతో పోటీకి వచ్చింది. మరోసారి వివోతో కలిసి పనిచేస్తుండటంపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు వీకే ఖన్నా హర్షం వ్యక్తం చేశారు. లీగ్ ప్రారంభంలో డీఎల్ఎఫ్ (2008–2012) టైటిల్ స్పాన్సరర్‌గా కొనసాగగా... ఆ తర్వాత పెప్సీ (2014–15), వివో తెరపైకి వచ్చాయి.