నోకియా 6పై అమెజాన్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ | Amazon offering up to Rs 2,200 discount on Nokia 6 | Sakshi
Sakshi News home page

నోకియా 6పై అమెజాన్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌

Published Fri, Nov 10 2017 2:05 PM | Last Updated on Fri, Nov 10 2017 2:05 PM

Amazon offering up to Rs 2,200 discount on Nokia 6 - Sakshi

నోకియా బ్రాండులో మిడ్‌-రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ నోకియా 6ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసమే అమెజాన్‌ ఇండియా సరికొత్త ఆఫర్‌ తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 2,200 రూపాయల వరకు డిస్కౌంట్‌ ఆఫర్‌ చేయనున్నట్టు ప్రకటించింది. 32జీబీ అయిన నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ ఎంఆర్‌పీ ధర 17,199 రూపాయలు. 13 శాతం డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను 14,999 రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాక అమెజాన్‌ పే ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే, అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు అదనంగా మరో వెయ్యి రూపాయల డిస్కౌంట్‌ లభించనుంది. అదేవిధంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.9,601 వరకు ఎక్స్చేంజ్‌ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది.


నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే...
5.5 అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ టచ్‌-స్క్రీన్‌ డిస్‌ప్లే
కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌
16 ఎంపీ పీడీఏఎఫ్‌ ప్రైమరీ కెమెరా
8 ఎంపీ ఏఎఫ్‌ ఫ్రంట్‌-ఫేసింగ్‌ కెమెరా
ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌
3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌
మేట్‌ బ్లాక్‌, సిల్వర్‌, టెంపెడ్ బ్లూ రంగులో ఇది అందుబాటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement