న్యూఇయర్‌లో నోకియా కొత్త ఫోన్‌ | Nokia 6 (2018) With Rear Fingerprint Sensor, Snapdragon 630 SoC Launched | Sakshi
Sakshi News home page

న్యూఇయర్‌లో నోకియా కొత్త ఫోన్‌

Published Fri, Jan 5 2018 11:59 AM | Last Updated on Fri, Jan 5 2018 2:27 PM

Nokia 6 (2018) With Rear Fingerprint Sensor, Snapdragon 630 SoC Launched - Sakshi

పలు రూమర్లు, పలు లీక్స్‌ అనంతరం హెచ్‌ఎండీ గ్లోబల్‌ కొత్త ఏడాదిలో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. నోకియా 6 సక్సర్‌గా నోకియా 6(2018) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ తొలుత చైనీస్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత భారత్‌లో విక్రయానికి రానుంది. ప్రస్తుతం చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. జనవరి 10 నుంచి దీని సేల్‌ మొదలవుతుంది. 32జీబీ నోకియా 6(2018) వేరియంట్‌ ధర సుమారు రూ.14,600 ఉండగా.. 64జీబీ వేరియంట్‌ ధర రూ.16,600గా ఉండబోతున్నట్టు తెలిసింది. ఈ రెండు వేరియంట్లు బ్లాక్‌, సిల్వర్‌ రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి. ఒరిజినల్‌ నోకియా 6 మోడల్‌ మాదిరిగా కాకుండా..  ఈ ఫోన్‌కు వెనుకవైపు ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ ఉంది. ఈ కొత్త నోకియా 6 మెటల్‌ యూనిబాడీతో 6000 సిరీస్‌ అల్యూమినియంతో రూపొందింది.
 

నోకియా 6(2018) ఫీచర్లు...
డ్యూయల్‌ సిమ్‌(నానో)
ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌
5.5 అంగుళాల ఐపీఎస్‌ డిస్‌ప్లే విత్‌ ఫుల్‌-హెచ్‌డీ రెజుల్యూషన్‌
ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 630 ఎస్‌ఓసీ
2.2గిగాహెడ్జ్‌ మైక్రోఎస్డీ కార్డు స్లాట్‌
16 ఎంపీ రియర్‌ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement