
నోకియా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్న హెచ్‌ఎండీ గ్లోబల్ ‘ఎక్స్’ సిరీస్‌లో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఎట్టకేలకు చైనాలో విడుదల చేసింది. నోకియా ఎక్స్6 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. నాచ్ డిస్‌ప్లేతో వచ్చిన తొలి నోకియా స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. నోకియా 6(2018) ధరకు దగ్గరిలోనే ఈ నోకియా ఎక్స్6 ధరను కూడా కంపెనీ నిర్ణయించింది. కేవలం ఈ స్మార్ట్‌ఫోన్‌కు నాచ్ డిస్‌ప్లేను అందించడమే కాకుండా... ఆల్-గ్లాస్ డిజైన్‌ను ఇది అందిస్తోంది. అదనంగా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 636 చిప్‌సెట్ ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి.
నోకియా ఎక్స్6 స్పెషిఫికేషన్లు...
డిస్‌ప్లే : 5.8 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే విత్ 2.5 కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 3
ప్రాసెసర్ : ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 636 చిప్‌సెట్
ర్యామ్ : 4జీబీ, 6జీబీ ర్యామ్ ఆప్షన్లు
ఇంటర్నల్ స్టోరేజ్ : 4జీబీ ర్యామ్ వేరియంట్‌కు 32జీబీ, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు
6జీబీ ర్యామ్ వేరియంట్‌కు 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
256జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
రియర్ కెమెరా : 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్
ఫ్రంట్ కెమెరా : 16 మెగాపిక్సెల్ సెన్సార్
సాఫ్ట్‌వేర్ : ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
బ్యాటరీ : 3060 ఎంఏహెచ్ సామర్థ్యం, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు
నోకియా ఎక్స్6 ధర
- 4జీబీ+32జీబీ వేరియంట్ ధర 1299 సీఎన్‌వై(సుమారు రూ.13,800)
- 4జీబీ+64జీబీ వేరియంట్ ధర 1499 సీఎన్‌వై(సుమారు రూ.16,000)
- 6జీబీ+64జీబీ వేరియంట్ ధర 1699 సీఎన్‌వై(సుమారు రూ.18,000)
Comments
Please login to add a commentAdd a comment