హెచ్‌ఎండీ ఇప్పటికే నాలుగు నోకియా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. తన హైఎండ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 8ను కూడా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. తాజాగా మరో హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్ త్వరలోనే విడుదల చేయబోతుందని తెలుస్తోంది. నోకియా 9 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిన్నిష్ కంపెనీ రూపొందిస్తుందని రిపోర్టు వెల్లడిస్తున్నాయి. స్లీక్ డిజైన్‌తో ఇది రూపొందుతుందని, పలుచనైన బెజెల్, డ్యూయల్ కెమెరాలతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. నోకియా 8 తర్వాత డ్యూయల్ కెమెరాతో రాబోతున్న రెండో స్మార్ట్‌ఫోన్ నోకియా 9.
12 లేదా 13 మెగాపిక్సెల్ లెన్స్, స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లతో ఇది మార్కెట్‌లోకి రాబోతుందని తెలుస్తోంది. నోకియా 8 కంటే ముందు నుంచి నోకియా 9పై పలు రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఆన్‌లీక్స్ షేర్ చేసిన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ పరిమాణాలు 140.9 ఎంఎం (ఐ) x 72.9 ఎంఎం (డబ్ల్యూ) x 7.5 ఎంఎం (డీ)గా ఉంటాయట. ఇది చాలా పలుచగా ఉండబోతుందని కూడా తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్ మార్కెట్‌లోకి తీసుకురాబోతుందట. దీంతో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రేసులోకి ఇది ప్రవేశించబోతుందట. నోకియా 8 అమ్మకాలు నేటి నుంచి యూరప్, భారత్‌లలో ప్రారంభం కాబోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment