Nokia 9
-
వెనుక వైపు 5 కెమెరాలతో నోకియా ఫోన్
నోకియా బ్రాండెడ్ ఫోన్ అంటే.. ఆ క్రేజే వేరు. నోకియా నుంచి ఏదైనా కొత్త స్మార్ట్‌ఫోన్ వస్తుందంటే, టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఆశలను మరింత పెంచుతూ.. హెచ్ఎండీ గ్లోబల్ త్వరలో ‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతుంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఇమేజ్‌లు పలు సోషల్ మీడియా వెబ్సైట్లలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఇమేజ్‌లతో నోకియా 9 స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద బ్యాటరీతో మార్కెట్లోకి వస్తుందని తెలుస్తోంది. అదేవిధంగా వెనుకవైపు పెంటా-లెన్స్(ఐదు లెన్స్‌ల) కెమెరా సెటప్‌ను ఇది కలిగి ఉందని సమాచారం. చైనాకు చెందిన ఓ సర్టిఫికేషన్ సైట్లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ స్పాట్ అయింది. నోకియాపవర్‌యూజర్ వెబ్సైట్ కూడా నోకియా 9 లైవ్ ఇమేజ్ను లీక్ చేసింది. ఈ లీకేజీల్లో కూడా ఫోన్‌కు వెనుకవైపు ఐదు లెన్స్‌ల కెమెరా సెటప్ ఉందని తెలుస్తోంది. అంతేగాక.. ఈ ఫోన్ 4,150ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో మార్కెట్లోకి వస్తుందని సమాచారం. అది నాన్ రిమూవబుల్ అట. ఈ లీక్డ్ డివైజ్ వెనుకవైపు నీలంగా ఉంది. అంటే నోకియా 9 కలర్ ఆప్షన్లలో నీలం రంగు ఒకటని తెలుస్తోంది. నోకియా 9 స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు నుంచి ఉత్పత్తి చేయడం ప్రారంభించింది హెచ్ఎండీ గ్లోబల్. ఈ నెలాఖరులో ఫోన్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. నోకియా 9 'ఆండ్రాయిడ్ పై' ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుందని అంతకముందు రిపోర్టులు వచ్చాయి. అంతేగాక.. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 6.01 అంగుళాల డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ఎస్ఓసీ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ మెమరీ తదితర ఫీచర్లు ఉండనున్నాయట. అంతకముందు ఈ ఫోన్లో ముందువైపు మూడు కెమెరాలుండనున్నట్లు రిపోర్టులు తెలిపాయి. కానీ తాజా లీకేజీల ద్వారా నోకియా 9లో వెనుక వైపు ఐదు, ముందు వైపు మూడు కెమెరాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నోకియా 9లో మొత్తంగా 8 కెమెరాలున్నట్లు సమాచారం. -
నోకియా కొత్త ఫోన్ : హైలెట్ అదే!
నోకియా బ్రాండు స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ ఇటీవల దూకుడుగా ఉంది. ఫిబ్రవరిలోనే ఎండబ్ల్యూసీ 2018లో నోకియా 8(సిరోకో), నోకియా 7 ప్లస్, నోకియా 6 స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించిన హెచ్ఎండీ గ్లోబల్, మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. నోకియా 9 పేరుతో కొత్తగా తన ఫ్లాగ్షిప్ మోడల్‌ను ఈ కంపెనీ విడుదల చేస్తోందని తెలుస్తోంది. స్లాష్‌లీక్స్ వివరాల ప్రకారం ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని హై-ఎండ్ స్పెషిఫికేషన్లు బయటికి లీకయ్యాయి. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణగా వెనుక వైపు మూడు కెమెరాలు ఉంటున్నాయని, స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ చిప్‌సెట్‌ను ఇది కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డివైజ్ 6.1 అంగుళాల క్యూహెచ్డీ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉండి, ముందు ఫోన్ల మాదిరి 18 క్యారెట్ల గోల్డ్ ఫిన్నిస్తో సిరామిక్ బ్లాక్ ప్లేటుతో అభివృద్ధి చెందుతుందని సమాచారం. స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ 845 చిప్సెట్, 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇది కలిగి ఉందని స్లాష్‌లీక్స్ చెబుతోంది. 41 ఎంపీ ప్రైమరీ వైడ్-యాంగిల్ కెమెరా, 20 ఎంపీ సెకండరీ టెలిఫోటో లెన్స్, 9.7 ఎంపీ మోనోక్రోమ్ కెమెరాలతో మూడు కెమెరా సెన్సార్లతో ఇది మార్కెట్లోకి రాబోతోందని తెలుస్తోంది. ముందు వైపు 21ఎంపీ సెన్సార్‌తో ఇది రూపొందుతోందని సమాచారం. 3900 ఎంఏహెచ్ బ్యాటరీ, క్యూఐ వైర్లెస్ ఛార్జింగ్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఐపీ68 వాటర్ రెసిస్టెంట్, ఇన్-గ్లాస్ ఫింగర్‌ప్రింట్ రీడర్ దీనిలో ఉండబోతున్నాయట. ఫీచర్ల పరంగా టాప్ బ్రాండులకు పోటీగా హై-ఎండ్ ఫ్లాగ్షిప్ స్పెషిఫికేషన్లతో చాలా స్ట్రాంట్‌గా మార్కెట్లోకి ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వబోతోందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. -
ఐ ఫోన్, గెలాక్సీ నోట్లే లక్ష్యంగా ‘నోకియా 9’
న్యూఢిల్లీ : కనుమరుగైన నోకియాను స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో తిరిగి తీసుకొచ్చిన హెచ్ఎండీ గ్లోబల్ 2018లో మరిన్ని నోకియా స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది. వచ్చే నెల 26 నుంచి బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(ఎండబ్ల్యూసీ)లో కొత్త మోడళ్లను హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించి అవకాశం ఉంది. ఫ్లాగ్షిప్ ఫోన్ నోకియా 9 ప్రకటన..! ఫ్లాగ్షిప్ ఫోన్ నోకియా 9ను హెచ్ఎండీ గ్లోబల్ ఎండబ్ల్యూసీ-2018లో ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హై ఎండ్ ఫీచర్స్‌లో స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఐ ఫోన్, శాంసంగ్ గెలాక్సీ నోట్స్‌కు దీటుగా నోకియా దీన్ని తీర్చిదిద్దినట్లు సమాచారం. నోకియా-9 ఫీచర్లు ప్రాసెసర్ : స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ డ్యూయల్ ఫ్రంట్ కెమెరాలు ఓఎల్ఈడీ స్క్రీన్(బెజెల్‌లెస్) 3,250 ఎంఏహెచ్ బ్యాటరీ ఇంటర్నట్ మెమరీ : 128 జీబీ బూతీ ఎఫెక్ట్ ఓజెడ్ఓ ఆడియో ఫీచర్లు -
మరో హైఎండ్ నోకియా స్మార్ట్‌ఫోన్
హెచ్ఎండీ ఇప్పటికే నాలుగు నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. తన హైఎండ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 8ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా మరో హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్ఎండీ గ్లోబల్ త్వరలోనే విడుదల చేయబోతుందని తెలుస్తోంది. నోకియా 9 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిన్నిష్ కంపెనీ రూపొందిస్తుందని రిపోర్టు వెల్లడిస్తున్నాయి. స్లీక్ డిజైన్‌తో ఇది రూపొందుతుందని, పలుచనైన బెజెల్, డ్యూయల్ కెమెరాలతో ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. నోకియా 8 తర్వాత డ్యూయల్ కెమెరాతో రాబోతున్న రెండో స్మార్ట్‌ఫోన్ నోకియా 9. 12 లేదా 13 మెగాపిక్సెల్ లెన్స్, స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లతో ఇది మార్కెట్లోకి రాబోతుందని తెలుస్తోంది. నోకియా 8 కంటే ముందు నుంచి నోకియా 9పై పలు రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఆన్‌లీక్స్ షేర్ చేసిన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ పరిమాణాలు 140.9 ఎంఎం (ఐ) x 72.9 ఎంఎం (డబ్ల్యూ) x 7.5 ఎంఎం (డీ)గా ఉంటాయట. ఇది చాలా పలుచగా ఉండబోతుందని కూడా తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ ఫోన్‌ను హెచ్ఎండీ గ్లోబల్ మార్కెట్లోకి తీసుకురాబోతుందట. దీంతో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ రేసులోకి ఇది ప్రవేశించబోతుందట. నోకియా 8 అమ్మకాలు నేటి నుంచి యూరప్, భారత్‌లలో ప్రారంభం కాబోతున్నాయి. -
నోకియా కొత్త ఫోన్ కు 8జీబీ ర్యామ్!
భారీగా అభిమానుల ఫాలోయింగ్ ను చూరగొంటూ ఐకానిక్ మొబైల్ బ్రాండు నోకియా ఈఏడాదే మార్కెట్లోకి పునఃప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీకి పాపులారిటీ ఎంతుందో ఫ్లాష్ సేల్స్ లోనే అర్థమైపోతుంది. ఇప్పటికే ఈ నోకియా బ్రాండులో నాలుగు డివైజ్ లు లాంచ్ కాగా ఫ్లాగ్ షిప్ లెవల్ స్మార్ట్ ఫోన్ ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు హెచ్ఎండీ గ్లోబల్ సన్నద్ధమవుతోంది. హై ఎండ్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ నోకియా 9తో పాటు కంపెనీ నోకియా 8, నోకియా 7లనూ లాంచ్ చేయబోతుంది. నోకియా 9.. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ గురించి మార్కెట్లో చక్కర్లు కొడుతున్న రూమర్లు అన్నీ ఇన్నీ కావు. తాజాగా మరోసారి బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ ఈ ఫ్లాగ్ షిప్ ను లిస్టు చేసింది. ఈ లిస్టింగ్ రివీల్స్ ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ కు 8జీబీ ర్యామ్ ఉండబోతుందట. 8జీబీ ర్యామ్ తో రాబోతున్న తొలి డివైజ్ ఇదేనట. వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ కు 8జీబీ ర్యామ్ ఉంటుందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అదేవిధంగా నోకియా 9 స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ తో రన్ అవుతుందని, స్నాప్ డ్రాగన్ 835ఎస్ఓసీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరో లీకేజీ వివరాల ప్రకారం నోకియా 9 స్మార్ట్ ఫోన్ కు 13ఎంపీ డ్యూయల్ కెమెరాలు, 5.3 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్డీ డిస్ ప్లే, 4/6 జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయని టాక్. బ్యాటరీ 38000 ఉంటుందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అంచనా ధరలు కూడా మార్కెట్లో భారీగానే వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ ధర రూ.54,100 వరకు ఉండొచ్చని టాక్. ఈ రూమర్లన్నీ నిజమో కాదో తెలియాలంటే నోకియా 9 ఫ్లాగ్ షిప్ లాంచింగ్ వరకు ఆగాల్సిందే.