నోకియా కొత్త ఫోన్ కు 8జీబీ ర్యామ్!
నోకియా కొత్త ఫోన్ కు 8జీబీ ర్యామ్!
Published Mon, May 29 2017 5:50 PM | Last Updated on Tue, Sep 5 2017 12:17 PM
భారీగా అభిమానుల ఫాలోయింగ్ ను చూరగొంటూ ఐకానిక్ మొబైల్ బ్రాండు నోకియా ఈఏడాదే మార్కెట్లోకి పునఃప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీకి పాపులారిటీ ఎంతుందో ఫ్లాష్ సేల్స్ లోనే అర్థమైపోతుంది. ఇప్పటికే ఈ నోకియా బ్రాండులో నాలుగు డివైజ్ లు లాంచ్ కాగా ఫ్లాగ్ షిప్ లెవల్ స్మార్ట్ ఫోన్ ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు హెచ్ఎండీ గ్లోబల్ సన్నద్ధమవుతోంది. హై ఎండ్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ నోకియా 9తో పాటు కంపెనీ నోకియా 8, నోకియా 7లనూ లాంచ్ చేయబోతుంది. నోకియా 9.. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ గురించి మార్కెట్లో చక్కర్లు కొడుతున్న రూమర్లు అన్నీ ఇన్నీ కావు. తాజాగా మరోసారి బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ ఈ ఫ్లాగ్ షిప్ ను లిస్టు చేసింది. ఈ లిస్టింగ్ రివీల్స్ ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ కు 8జీబీ ర్యామ్ ఉండబోతుందట.
8జీబీ ర్యామ్ తో రాబోతున్న తొలి డివైజ్ ఇదేనట. వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ కు 8జీబీ ర్యామ్ ఉంటుందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అదేవిధంగా నోకియా 9 స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ తో రన్ అవుతుందని, స్నాప్ డ్రాగన్ 835ఎస్ఓసీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరో లీకేజీ వివరాల ప్రకారం నోకియా 9 స్మార్ట్ ఫోన్ కు 13ఎంపీ డ్యూయల్ కెమెరాలు, 5.3 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్డీ డిస్ ప్లే, 4/6 జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయని టాక్. బ్యాటరీ 38000 ఉంటుందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అంచనా ధరలు కూడా మార్కెట్లో భారీగానే వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ ధర రూ.54,100 వరకు ఉండొచ్చని టాక్. ఈ రూమర్లన్నీ నిజమో కాదో తెలియాలంటే నోకియా 9 ఫ్లాగ్ షిప్ లాంచింగ్ వరకు ఆగాల్సిందే.
Advertisement
Advertisement