2021లో ప్రతి మొబైల్ కంపెనీ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తున్నాయి. తాజాగా మోటరోలా కూడా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఒక మోటోరోలా మొబైల్ గీక్‌బెంచ్‌లో కనిపించింది. స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్ తో రాబోయే నియో మొబైల్ కావచ్చు అని తెలుస్తుంది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రాబోయే 14 స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో మోటరోలా కూడా ఉంది. రూట్‌మైగలాక్సీ ప్రకారం.. “నియో” అనే కోడ్ పేరుతో పిలిచే మోటరోలా ఫోన్ గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌తో రానుందని లిస్టింగ్ వెల్లడించింది. మిగతా కంపెనీలన్నీ స్నాప్‌డ్రాగన్ 888తో ఫోన్‌లను లాంచ్ చేస్తుండగా మోటరోలా మాత్రం ఈ ఫోన్ లో పాత ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకు ముందు, మోటరోలా స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో ఎడ్జ్ ప్లస్‌ను విడుదల చేసింది.(చదవండి: గెలాక్సీ ఎస్ 21 టీజర్ విడుదల)
మోటరోలా నియో ఫీచర్స్:
మోటరోలా నియో 8 జీబీ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఇది ఆండ్రాయిడ్ 11తో రాబోయే మొట్టమొదటి మోటరోలా ఫోన్ నియో అవుతుందని లిస్టింగ్ వెల్లడించింది. అయితే, గీక్‌బెంచ్‌లో కనిపించే ప్రతిదీ నిజం కాదు. గీక్‌బెంచ్‌లో స్కోరు విషయానికొస్తే మోటరోలా నియో సింగిల్-కోర్ పరీక్షలో 958 మరియు మల్టీ-కోర్ పరీక్షలో 2969 స్కోర్లు సాధించింది. ఎక్కువ స్కోరు ప్రాసెసర్ యొక్క సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. ఈ జాబితా డిసెంబర్ 29, 2020న కనిపించింది. 2021 ప్రారంభంలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ ఫుల్-హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1,080x2,520 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో వస్తుందని తెలుస్తుంది. మోటరోలా నియోలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాతో రావచ్చు. సెల్ఫీ కోసం ఇందులో ఫోన్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment