గెలాక్సీ ఏ72 అనే కొత్త స్మార్ట్ ఫోన్లను శాంసంగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో తీసుకురానున్నట్లు తెలుస్తుంది. గెలాక్సీ ఏ72 మొబైల్ 4జీ, 5జీ వెర్షన్లలో లభించనుంది. తాజా సమాచారం ప్రకారం గెలాక్సీ ఏ72 4జీ మొబైల్స్ SM-A725F, SM-A726B కోడ్ నేమ్ తో గీక్‌బెంచ్‌లో కనిపించింది. దీనికి సంబందించిన కొన్ని ఫీచర్స్ కూడా బయటకి వచ్చాయి. గెలాక్సీ ఏ72 4జీ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇది 8జీబీ ర్యామ్ తో స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్ తో పనిచేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ72 5జీలో వెనకవైపు 4 కెమెరాలు తీసుకురానున్నట్లు సమాచారం. గెలాక్సీ ఏ72 5జీ 6.7 అంగుళాల పంచ్ హోల్ డిస్‌ప్లేతో ప్యాక్ చేసి క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండనుంది. 4జీ మోడల్ కూడా ఇదే స్పెసిఫికేషన్స్ తో రానున్నట్లు తెలుస్తుంది. గెలాక్సీ ఏ72 5జీ ధర 550 యూరోల నుండి 600యూరోల(సుమారు రూ.55-60 వేలు), అలాగే 4జీ వేరియంట్‌కు ధర 450-500(సుమారు రూ.45-50 వేలు) యూరోల మధ్య ఉండనుంది.(చదవండి: టెస్లా క్రిస్మస్ బహుమతి)
Comments
Please login to add a commentAdd a comment