Geekbench
-
ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న జియోబుక్ ల్యాప్‌టాప్ ఫీచర్స్ ఇవే!
భారత్ టెలికాం రంగంలో తక్కువ ధరకే ఇంటర్నెట్ అందించి రిలయన్స్ జియో రికార్డు సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. అలాగే, కొద్దిరోజుల క్రితం దీపావళి పండుగా సందర్భంగా 4జీ మొబైల్ మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో కొత్త ప్రోడక్ట్ ను ఎలక్ట్రానిక్ మార్కెట్లోకి తీసుకొనిరాబోతుంది. జియో త్వరలో తక్కువ ధరకే ‘జియోబుక్’ పేరుతో ల్యాప్‌టాప్‌లు కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దానికి సంబందించిన పనులు కీలక దశకు చేరుకున్నాయని తెలుస్తుంది. మీడియాటెక్ ఎమ్టీ8788 ప్రాసెసర్ ద్వారా నడిచే "జియోబుక్" ల్యాప్‌టాప్ ఈ మధ్య గీక్ బెంచ్‌లో కనిపించింది. ఈ ల్యాప్ టాప్ 2జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 మీద పనిచేయనున్నట్లు చెబుతున్నారు. ఇంతకు ముందు ల్యాప్‌టాప్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్ పోర్టల్‌లో కనిపించింది. రిలయన్స్ జియో మరో ల్యాప్‌టాప్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్, స్నాప్ డ్రాగన్ ఎక్స్12 4జీ మోడెం చేత పని చేయనున్నట్లు తెలుస్తుంది. గీక్ బెంచ్‌లో జియోబుక్ సింగిల్ కోర్ స్కోరు 1,178, మల్టీ కోర్ స్కోరు 4,246 సాధించింది. ఈ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్ చూస్తే ప్రధానంగా పాఠశాల విధ్యార్ధులను దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది. జియోబుక్ స్పెసిఫికేషన్స్ స్పెసిఫికేషన్ల పరంగా.. జియోబుక్ 1,366x768 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్12 4జీ ఎల్టీఈ మోడెమ్ డిస్ప్లేని కలిగి ఉంది. ల్యాప్‌టాప్ తయారీ ఖర్చు తగ్గించడం కోసం ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ తీసుకొనిరానున్నారు. ఇది 11 నానో మీటర్ టెక్నాలజీతో పని చేస్తుంది. ఒక మోడల్లో 2జీబీ ఎల్పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్ తో పాటు 32జీబీ ఇఎంఎంసి స్టోరేజ్ ఉంది. మరో మోడల్లో 4జీబీ ఎల్పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్, 64జీబీ ఇఎంఎంసి 5.1 స్టోరేజ్ ఉన్నాయి. ఇందులో వీడియోల కోసం మినీ హెచ్డీఎంఐ, 5గిగా హెడ్జ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్, 3 యాక్సిస్ యాక్సెలెరోమీటర్, క్వాల్‌కోమ్ ఆడియో చిప్‌లను వినియోగించనున్నారు. జియో ల్యాప్‌టాప్‌లను కూడా తక్కువ ధరలోనే తీసుకొస్తుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. -
గీక్‌బెంచ్‌లో మోటరోలా కొత్త మొబైల్
2021లో ప్రతి మొబైల్ కంపెనీ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తున్నాయి. తాజాగా మోటరోలా కూడా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఒక మోటోరోలా మొబైల్ గీక్‌బెంచ్‌లో కనిపించింది. స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్ తో రాబోయే నియో మొబైల్ కావచ్చు అని తెలుస్తుంది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రాబోయే 14 స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో మోటరోలా కూడా ఉంది. రూట్మైగలాక్సీ ప్రకారం.. “నియో” అనే కోడ్ పేరుతో పిలిచే మోటరోలా ఫోన్ గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌తో రానుందని లిస్టింగ్ వెల్లడించింది. మిగతా కంపెనీలన్నీ స్నాప్‌డ్రాగన్ 888తో ఫోన్లను లాంచ్ చేస్తుండగా మోటరోలా మాత్రం ఈ ఫోన్ లో పాత ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకు ముందు, మోటరోలా స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో ఎడ్జ్ ప్లస్‌ను విడుదల చేసింది.(చదవండి: గెలాక్సీ ఎస్ 21 టీజర్ విడుదల) మోటరోలా నియో ఫీచర్స్: మోటరోలా నియో 8 జీబీ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఇది ఆండ్రాయిడ్ 11తో రాబోయే మొట్టమొదటి మోటరోలా ఫోన్ నియో అవుతుందని లిస్టింగ్ వెల్లడించింది. అయితే, గీక్‌బెంచ్‌లో కనిపించే ప్రతిదీ నిజం కాదు. గీక్‌బెంచ్‌లో స్కోరు విషయానికొస్తే మోటరోలా నియో సింగిల్-కోర్ పరీక్షలో 958 మరియు మల్టీ-కోర్ పరీక్షలో 2969 స్కోర్లు సాధించింది. ఎక్కువ స్కోరు ప్రాసెసర్ యొక్క సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. ఈ జాబితా డిసెంబర్ 29, 2020న కనిపించింది. 2021 ప్రారంభంలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ ఫుల్-హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 1,080x2,520 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో వస్తుందని తెలుస్తుంది. మోటరోలా నియోలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాతో రావచ్చు. సెల్ఫీ కోసం ఇందులో ఫోన్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చు. -
శాంసంగ్ గెలాక్సీ ఏ72 ధర ఎంతంటే?
గెలాక్సీ ఏ72 అనే కొత్త స్మార్ట్ ఫోన్లను శాంసంగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో తీసుకురానున్నట్లు తెలుస్తుంది. గెలాక్సీ ఏ72 మొబైల్ 4జీ, 5జీ వెర్షన్లలో లభించనుంది. తాజా సమాచారం ప్రకారం గెలాక్సీ ఏ72 4జీ మొబైల్స్ SM-A725F, SM-A726B కోడ్ నేమ్ తో గీక్‌బెంచ్‌లో కనిపించింది. దీనికి సంబందించిన కొన్ని ఫీచర్స్ కూడా బయటకి వచ్చాయి. గెలాక్సీ ఏ72 4జీ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇది 8జీబీ ర్యామ్ తో స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్ తో పనిచేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ72 5జీలో వెనకవైపు 4 కెమెరాలు తీసుకురానున్నట్లు సమాచారం. గెలాక్సీ ఏ72 5జీ 6.7 అంగుళాల పంచ్ హోల్ డిస్ప్లేతో ప్యాక్ చేసి క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండనుంది. 4జీ మోడల్ కూడా ఇదే స్పెసిఫికేషన్స్ తో రానున్నట్లు తెలుస్తుంది. గెలాక్సీ ఏ72 5జీ ధర 550 యూరోల నుండి 600యూరోల(సుమారు రూ.55-60 వేలు), అలాగే 4జీ వేరియంట్‌కు ధర 450-500(సుమారు రూ.45-50 వేలు) యూరోల మధ్య ఉండనుంది.(చదవండి: టెస్లా క్రిస్మస్ బహుమతి) -
వన్‌ప్లస్ 9 స్మార్ట్ ఫోన్ కెమెరా ఫీచర్స్ వైరల్
భారత్ లో 2021 మార్చిలో వన్ ప్లస్ 9 ఫ్లాగ్ షిప్ ఫోన్ ని తీసుకు వస్తునట్లు ఒక వార్త ఆన్లైన్లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటి వరకు తెలిసిన వివరాల ప్రకారం వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరాలను కలిగి ఉంటాయని సమాచారం. వన్‌ప్లస్ 9లో మూడు కెమెరా కలిగి ఉన్న ఒక చిత్రం ఆన్లైన్లో వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని గమనించినట్లయితే ఇందులో రెండు పెద్ద సెన్సార్ గల కెమెరాలు మరియు ఒక చిన్న కెమెరా సెన్సార్ ఉంది. వీటి పక్కన చిన్న డ్యూయల్-టోన్ LED ఫ్లాష్ ఉంటుంది. వన్‌ప్లస్ 9 ఫోన్ లో పంచ్ - హోల్ డిస్ప్లేతో వస్తుందని సమాచారం. [Exclusive] OnePlus 9 camera setup details and live image revealedhttps://t.co/F4V4qgOc4u — 91mobiles (@91mobiles) November 21, 2020 వన్‌ప్లస్ 9 కెమెరా ఫీచర్స్ వన్‌ప్లస్ 9 ప్రధాన కెమెరా 48 మెగా పిక్సల్ కెమెరా తో రానుంది. ఈ 48ఎంపీ ప్రధాన కెమెరాలో సెన్సార్ సోనీ IMX 586 లేదా IMX689 ఉపయోగించవచ్చు. వన్‌ప్లస్ 9 ఎంపీ ప్రధాన కెమెరా అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కు సపోర్ట్ చేస్తుంది. దీనిలో ఉన్న 16ఎంపీ కెమెరా అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ కలిగి ఉండనుంది. ఇది వన్ ప్లస్ 8టీ ఫోన్ తో పోలిస్తే పెద్ద మార్పు. చిత్రంలో ఉన్న చిన్న కెమెరా గురుంచి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. దీనిలో మోనోక్రోమ్ లేదా మాక్రో సెన్సార్ ఉపయోగించవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా 32 ఎంపీ కెమెరాతో రానుంది. (చదవండి: ప్రపంచంలోనే టాప్ - 10 స్మార్ట్ ఫోన్స్ ఇవే) వన్‌ప్లస్ 9, వన్ ప్లస్ 8టీ యొక్క 6.55-అంగుళాల ప్యానెల్ కంటే పెద్దదిగా ఉండనుంది. వన్ ప్లస్ 9లో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో డిస ప్లే ప్రవేశపెడుతున్నట్లు నివేదికలు వచ్చినప్పటికీ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేను కలిగి ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ నెంబర్లు LE2110, LE2117, LE2119 గల మొబైల్ ఫోన్లు 2021 మార్చిలో లాంచ్ కానున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, అలాగే 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని సమాచారం. ఈ ఫోన్ గీక్ బెంచ్ పరీక్షలో ఫోన్ సింగిల్-కోర్ స్కోరు 1,122, మల్టీ-కోర్ స్కోరు 2,733 సాధించింది. దీని ధర 47,000 ఉండవచ్చు. వన్‌ప్లస్ 9 గురించి వన్‌ప్లస్ సంస్థ ఎలాంటి అధికారిక వివరాలను వెల్లడించలేదు. -
పోకో ఎమ్3 స్పెసిఫికేషన్స్ ఇవే
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతోంది. పోకో ఎమ్3 మొబైల్ విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. పోకో కంపెనీ వర్చువల్ ఈవెంట్ ద్వారా పోకో ఎమ్3ని నవంబర్ 24న సాయంత్రం 5.30 గంటలకు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతుంది. ఆ రోజు జరిగే లాంచ్ ఈవెంట్ లో పోకో ఎమ్3 యొక్క ధర, ఫీచర్స్ వెల్లడించనుంది. అయితే రెడ్మీ నోట్ 10 రీబ్రాండెడ్ వర్షన్‌ను పోకో ఎమ్3 పేరుతో తీసుకు వస్తునట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రెడ్మీ 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను పోకో ఎం2 పేరుతో రీబ్రాండ్ చేసిన సంగతి తెలిసిందే. పోకో ఎం3 విషయంలో కూడా అదే జరగొచ్చని అందరూ భావిస్తున్నారు. (చదవండి: పబ్జీ మొబైల్ ఇండియా కొత్త టీజర్ వచ్చేసింది) I don’t know about you, but I truly miss the feeling of waiting for a new POCO to be revealed. 🙌 Introducing POCO M3, Our MOST ???? yet! 😏#POCOM3 Is #MoreThanYouExpect pic.twitter.com/pQKQoGbFSe — POCO (@POCOGlobal) November 17, 2020 M2010J19CG మోడల్ నంబర్ తో కొత్త POCO ఫోన్ ఈ వారం ప్రారంభంలో గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్న పోకో ఎమ్3 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. 6.53 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్, 8 ఎంపి సెల్ఫీ కెమెరా, డ్యూయెల్ స్పీకర్స్, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 6జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారిత MIUI, 4జి ఎల్‌టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ మరియు యుఎస్బి టైప్-సి పోర్ట్, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి స్పెసిఫికేషన్స్ ఉండొచ్చని అంచనా. -
ఆ ఫోన్‌కు 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్
స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్ త్వరలోనే మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అది గెలాక్సీ నోట్ 9గా మార్కెట్లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. గెలాక్సీ నోట్ 8కు సక్ససర్‌గా దీన్ని తీసుకురాబోతున్నట్టు టెక్ వర్గాల టాక్. కానీ దీనిపై ఇంకా శాంసంగ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. జూలై నెలలో గెలాక్సీ నోట్ 9ను శాంసంగ్ లాంచ్ చేస్తుందని ప్రముఖ బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ రిపోర్టు చేసింది. లాంచింగ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన పలు లీక్‌లు కూడా ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. తాజా లీకేజీల ప్రకారం గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో మార్కెట్లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. కానీ అంతకముందు నుంచి వచ్చిన రూమర్ల ప్రకారమైతే గెలాక్సీ నోట్ 9 కేవలం మూడు వేరియంట్లోనే మార్కెట్లోకి వస్తుందని సమాచారం. ఒకటి 64జీబీ స్టోరేజ్, రెండు 128జీబీ స్టోరేజ్, మూడు 256జీబీ స్టోరేజ్. ఈ మూడు స్టోరేజ్ మోడల్స్ కూడా 6జీబీ ర్యామ్‌తోనే రూపొందుతున్నాయని టాక్. కానీ తాజాగా ఓ ట్విటర్ యూజర్ ఇచ్చిన లీకేజీ ప్రకారం నాలుగో మోడల్‌ను శాంసంగ్ రూపొందిస్తుందని తెలుస్తోంది. నాలుగో మోడల్ అత్యంత ఖరీదైన వేరియంట్ అని, అది 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో రూపొందిస్తున్నారని ఓ ట్విటర్ యూజర్ లీక్ చేశాడు. అయితే దాన్ని లిమిటెడ్ ఎడిషన్‌లో తీసుకొచ్చి, ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఈ డివైజ్‌కు సంబంధించే పలు హార్డ్‌వేర్ వివరాలను గీక్‌బెంచ్ వెబ్సైట్ లిస్టు చేసింది. ఈ డివైజ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845తో వస్తుందని, అదేవిధంగా రెండో మోడల్ శాంసంగ్‌కు చెందిన ఎక్సీనోస్ 9810 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 6.38 అంగుళాల ఓలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే, 3850 ఎంఏహెచ్ బ్యాటరీ, మెరుగైన ఎస్-పెన్, గెలాక్సీ ఎస్9 ప్లస్‌కు ఉన్న మాదిరిగానే కెమెరా సెటప్ వంటి ఫీచర్లున్నాయని ముందస్తు రిపోర్టులు పేర్కొన్నాయి. -
నోకియా కొత్త ఫోన్ కు 8జీబీ ర్యామ్!
భారీగా అభిమానుల ఫాలోయింగ్ ను చూరగొంటూ ఐకానిక్ మొబైల్ బ్రాండు నోకియా ఈఏడాదే మార్కెట్లోకి పునఃప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీకి పాపులారిటీ ఎంతుందో ఫ్లాష్ సేల్స్ లోనే అర్థమైపోతుంది. ఇప్పటికే ఈ నోకియా బ్రాండులో నాలుగు డివైజ్ లు లాంచ్ కాగా ఫ్లాగ్ షిప్ లెవల్ స్మార్ట్ ఫోన్ ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు హెచ్ఎండీ గ్లోబల్ సన్నద్ధమవుతోంది. హై ఎండ్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ నోకియా 9తో పాటు కంపెనీ నోకియా 8, నోకియా 7లనూ లాంచ్ చేయబోతుంది. నోకియా 9.. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ గురించి మార్కెట్లో చక్కర్లు కొడుతున్న రూమర్లు అన్నీ ఇన్నీ కావు. తాజాగా మరోసారి బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ ఈ ఫ్లాగ్ షిప్ ను లిస్టు చేసింది. ఈ లిస్టింగ్ రివీల్స్ ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ కు 8జీబీ ర్యామ్ ఉండబోతుందట. 8జీబీ ర్యామ్ తో రాబోతున్న తొలి డివైజ్ ఇదేనట. వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ కు 8జీబీ ర్యామ్ ఉంటుందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అదేవిధంగా నోకియా 9 స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ తో రన్ అవుతుందని, స్నాప్ డ్రాగన్ 835ఎస్ఓసీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరో లీకేజీ వివరాల ప్రకారం నోకియా 9 స్మార్ట్ ఫోన్ కు 13ఎంపీ డ్యూయల్ కెమెరాలు, 5.3 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్డీ డిస్ ప్లే, 4/6 జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయని టాక్. బ్యాటరీ 38000 ఉంటుందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అంచనా ధరలు కూడా మార్కెట్లో భారీగానే వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ ధర రూ.54,100 వరకు ఉండొచ్చని టాక్. ఈ రూమర్లన్నీ నిజమో కాదో తెలియాలంటే నోకియా 9 ఫ్లాగ్ షిప్ లాంచింగ్ వరకు ఆగాల్సిందే.