చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతోంది. పోకో ఎమ్3 మొబైల్ విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. పోకో కంపెనీ వర్చువల్ ఈవెంట్ ద్వారా పోకో ఎమ్3ని నవంబర్ 24న సాయంత్రం 5.30 గంటలకు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతుంది. ఆ రోజు జరిగే లాంచ్ ఈవెంట్ లో పోకో ఎమ్3 యొక్క ధర, ఫీచర్స్ వెల్లడించనుంది. అయితే రెడ్‌మీ నోట్ 10 రీబ్రాండెడ్ వర్షన్‌ను పోకో ఎమ్3 పేరుతో తీసుకు వస్తునట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రెడ్‌మీ 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను పోకో ఎం2 పేరుతో రీబ్రాండ్ చేసిన సంగతి తెలిసిందే. పోకో ఎం3 విషయంలో కూడా అదే జరగొచ్చని అందరూ భావిస్తున్నారు. (చదవండి: పబ్‌జీ మొబైల్ ఇండియా కొత్త టీజర్ వచ్చేసింది)
I don’t know about you, but I truly miss the feeling of waiting for a new POCO to be revealed. 🙌
— POCO (@POCOGlobal) November 17, 2020
Introducing POCO M3, Our MOST ???? yet! 😏#POCOM3 Is #MoreThanYouExpect pic.twitter.com/pQKQoGbFSe
M2010J19CG మోడల్ నంబర్ తో కొత్త POCO ఫోన్ ఈ వారం ప్రారంభంలో గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్న పోకో ఎమ్3 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్, 8 ఎంపి సెల్ఫీ కెమెరా, డ్యూయెల్ స్పీకర్స్, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 6జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారిత MIUI, 4జి ఎల్‌టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి స్పెసిఫికేషన్స్ ఉండొచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment