Qualcomm Snapdragon
-
యాపిల్‌కి షాకిచ్చిన జేపీ మోర్గాన్
కరోనా ఆర్థిక వ్యవస్థకు చేసిన గాయాలు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎఫెక్ట్ వెరసి స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ యాపిల్‌కి ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. స్మార్ట్‌ఫోన్ డిమాండ్ పడిపోతుండటంతో ఆ కంపెనీ లాభాలు పరిమితం కావచ్చంటూ ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ జేపీ మోర్గాన్ సూచించింది. అందుకు తగ్గట్టుగా మోస్ట్ ఫ్రిఫరెడ్ స్టాక్స్ జాబితా నుంచి యాపిల్‌ను తొలగించింది. మార్కెట్ కన్సల్టెన్సీ సంస్థ జేపీ మోర్గాన్ అనేక బడా కార్పోరేట్ కంపెనీలకు సేవలు అందిస్తోంది. అదే విధంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కూడా విలువైన సూచనలు చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆయా కంపెనీల లావాదేవీలు, మార్కెట్ ఎత్తుగడలు, ప్రపంచ పరిస్థితులను అంచనా వేస్తూ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు మోస్ట్ ఫ్రిఫరెడ్ స్టాక్స్ పేరుతో ఓ జాబితా రూపొందిస్తుంది. ఈ జాబితాలో యాపిల్ సంస్థ కొన్నేళ్లుగా సుస్థిర స్థానం సంపాదించుకుంది. అయితే కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించడం, ఆ వెంటనే సప్లై చెయిన్ దెబ్బతినడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మూలికే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇంతలో ఉక్రెయిన్, రష్యా వార్ వచ్చిపడింది. దీంతో ఆదాయ వనరులు తగ్గిపోయాయి. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు క్షీణిస్తున్నాయి. వీటిని నిలబెట్టుకునేందుకు అప్పటికీ యాపిల్ సంస్థ పలు మోడళ్ల ధరలకు కోత పెట్టింది. ఐనప్పటికీ అమ్మకాలు మెరుగుపడే అవకాశం లేకపోవడం. పైగా యాపిల్ ఫోన్లు ఎక్కువగా తయారయ్యే చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తుండటంతో పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఫలితంగా యాపిల్ ఆశించిన మేరకు లాభాలు అందించలేకపోవచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది. యాపిల్‌తో పాటు ప్రముఖ చిప్ మేకర్ కంపెనీ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ సైతం మోస్ట్ ప్రిఫరబుల్ స్టాక్స్ జాబితాలో చోటు కోల్పోయింది. ఈ రెండింటి స్థానంలో నెట్వర్క్ ఎక్వీప్మెంట్ కంపెనీలైన ఆరిస్టా నెట్వర్క్, సియన్నా కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. చదవండి: యాపిల్ మాస్టర్‌ప్లాన్...అందరికీ అందుబాటులో ఐఫోన్..! -
OnePlus 10 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో విడుదలైన వన్‌ప్లస్ సూపర్ స్మార్ట్‌ఫోన్..!
యాపిల్, శామ్ సంగ్ మొబైల్స్ తర్వాత అంత క్రేజ్ వన్‌ప్లస్ మొబైల్స్‌కి ఉంటాయి. ఈ కంపెనీ నుంచి వచ్చిన చాలా మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్మడు పోతాయి. అయితే, తాజాగా వన్‌ప్లస్ మరో కొత్త మొబైల్‌ని చైనా మార్కెట్లో మొదట విడుదల చేసింది. ఈ వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో కొత్తగా వచ్చిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్1 చిప్ వస్తుంది. ఈ మొబైల్ 120హెర్ట్జ్ అమోల్డ్ డిస్ ప్లేతో రానున్నట్లు కంపెనీ తెలిపింది. వన్‌ప్లస్ 10 ప్రో 80డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సహాయంతో వస్తుంది. కొత్త వన్‌ప్లస్ ఫ్లాగ్ షిప్ మొబైల్ కూడా హైపర్ బూస్ట్ టెక్నాలజీతో రానున్నట్లు తెలిపింది. వన్‌ప్లస్ 10 ప్రో ధర: వన్ ప్లస్ 10 ప్రో బేస్ వేరియంట్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను సిఎన్‌వై 4,699 (సుమారు రూ. 54,500)కు తీసుకొని వచ్చారు. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర సిఎన్‌వై 4,999(సుమారు రూ. 58,000)కు లభిస్తే, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర సిఎన్‌వై 5,299 (సుమారు రూ. 61,500)కు లభిస్తుంది. ఇది చైనాలో జనవరి 13 నుంచి సేల్ కోసం అందుబాటులోకి రాలేదు. అయితే, ఈ వన్‌ప్లస్ 10 ప్రోను ప్రపంచ మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొని వస్తారు అనే విషయం పేర్కొనలేదు. వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్స్: 6.7 అంగుళాల క్యూహెచ్ డి+ (1,440ఎక్స్3,216 పిక్సెల్స్) అమోల్డ్ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 12 సపోర్ట్ గల కలర్ ఓఎస్ 12.1 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్యానెల్ ప్రొటెక్షన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్1 చిప్ 12 జీబీ ఎల్పిడిడిఆర్ 5 ర్యామ్ 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 50-మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్ ఎక్స్615 ఫ్రంట్ కెమెరా 256జీబీ యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ సపోర్ట్ 5,000 ఎమ్ఎహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ 80 వాట్ సూపర్ ఫ్లాష్ ఛార్జ్ వైర్డ్ ఛార్జింగ్, 50 వాట్ వైర్ లెస్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ (చదవండి: హల్చల్ చేస్తోన్న స్కోడా ఎలక్ట్రిక్ కారు..! రేంజ్ ఎంతంటే..?) -
పిచ్చెక్కిస్తున్న షావోమీ 12 స్మార్ట్‌ఫోన్ డిజైన్, ఫీచర్స్..!
ప్రముఖ చైనా మొబైల్ తయారీ దిగ్గజం షావోమీ నుంచి త్వరలో ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ షావోమీ 12 రానున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో షావోమీ 12, షావోమీ 12ఎక్స్, షావోమీ 12ప్రో, షావోమీ 12 అల్ట్రా రానున్నాయి. షావోమీ12 సిరీస్ స్మార్ట్ఫోన్ల గురుంచి చైనా టెక్ దిగ్గజం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయితే, ఇటీవల షావోమీ12 స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. అలాగే, రాబోయే స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కొన్ని డిజైన్ కూడా బయటకు వచ్చాయి. షావోమీ 12 స్టాండర్డ్ ఎడిషన్ ఫీచర్స్(అంచనా) తాజాగా లీక్ అయిన షావోమీ 12 స్పెసిఫికేషన్స్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ మొబైల్ డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్ లైట్ తో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెంట్రల్ అలైన్డ్ హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. షావోమీ 12 ఫుల్-హెచ్ డి+(1,920ఎక్స్1,080 పిక్సెల్స్) రిజల్యూషన్ గల డిస్ ప్లేను కలిగి ఉండనుంది. అదనంగా, ఇందులో స్క్రీన్ ఇన్ బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా రానున్నట్లు సమాచారం. షావోమీ 12 స్టాండర్డ్ ఎడిషన్ గతంలో చైనా కంపల్సరీ సర్టిఫికేషన్(3సీ) వెబ్సైట్లో కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం.. ఇది 67డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు. బేస్ షావోమీ 12 స్టాండర్డ్ ఎడిషన్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యుఎస్బి టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్, వైర్ లెస్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేయనుంది. షావోమీ 12 8జీబీ ర్యామ్ గల క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరల్ 1 ప్రాసెసర్ సహాయంతో పనిచేయనున్నట్లు సమాచారం. ఈ 5జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో పాటు బ్లూటూత్ వి5.2 కనెక్టివిటీ ఉంటుందని పేర్కొన్నారు. దీని ధర సుమారు రూ.69,990గా ఉండే అవకాశం ఉంది. (చదవండి: అమెరికాకు వచ్చినప్పుడు నా చేతిలో చిల్లి గవ్వ లేదు: ఎలోన్ మస్క్!) -
రియల్ మీ నుంచి జీటీ నియో–2
న్యూఢిల్లీ: రియల్మీ తన జీటీ సిరీస్‌లో కొత్తగా జీటీ నియో 2 5జీ మొబైల్‌ను విడుదల చేసింది. ఇందులో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 870 5జీ ప్రాసెసర్, 120 హెర్జ్ రీఫ్రెష్ రేట్‌తో కూడిన ఈ4 (మరింత ప్రకాశవంతంగా, తక్కువ ఇంధనాన్ని వినియోగించుకునే) అమోలెడ్ డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ సూపర్‌డార్ట్ చార్జర్, వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ ఏఐ ట్రిపుల్ కెమెరా, 7జీబీ డైనమిక్ ర్యామ్ ఎక్స్పాన్షన్ సదుపాయం ఇలా ఎన్నో ఫీచర్లున్నాయి. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.31,999 కాగా, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999. ఫ్లిప్‌కార్ట్ పోర్టల్, రియల్మీ పోర్టల్‌పై కొనుగోలు చేసేవారికి పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. అదే విధంగా రియల్మీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ స్టిక్, రియల్మీ బ్రిక్ బ్లూటూత్ స్పీకర్, గేమింగ్ పరికరాలను సైతం విడుదల చేసింది. -
గూగుల్.. చిప్ చిచ్చు రాజుకుందా?
అమెరికా టెక్ దిగ్గజం గూగుల్(ఆల్ఫబెట్ కంపెనీ), చిప్‌మేకర్ క్వాల్కమ్ మధ్య విభేధాలు మొదలయ్యాయి. చిప్ తయారీ విషయంలో గూగుల్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. ఈ మేరకు గూగుల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్వాల్కమ్ ఒక ట్వీట్ చేయడం విశేషం. అమెరికన్ చిప్‌మేకర్ కంపెనీ క్వాల్కమ్.. సొంతంగా చిప్‌లు తయారు చేసుకోవాలన్న గూగుల్ నిర్ణయంపై అసంతృప్తితో రగిలిపోతోంది. రాబోయే పిక్సెల్ 6 స్మార్ట్‌ఫోన్స్‌ను గూగుల్ తాము సొంతంగా రూపొందించిన చిప్ సిస్టమ్‌తో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ నిర్ణయంపై క్వాల్కమ్ ట్వీట్ రూపంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. "We've decided to make our own smartphone SoC instead of using Snapdragon" 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 — Snapdragon (@Snapdragon) October 13, 2021 స్నాప్‌డ్రాగన్‌కు బదులు ఇకపై సొంత స్మార్ట్‌ఫోన్ ఎస్‌వోసీని తయారు చేబోతున్నాం అంటూ ఎర్ర జెండాల ఎమోజీతో ఒక ట్వీట్ చేసింది క్వాల్కమ్. ఇప్పటిదాకా పిక్సెల్ ఫోన్లకు చిప్సెట్లను సప్లై చేస్తూ వస్తోంది క్వాల్కమ్. కానీ, తాజా నిర్ణయంతో క్వాల్కమ్కు నష్టం వాటిల్లనుంది. గూగుల్ టెన్సర్ చిప్‌ను నమ్మకూడదంటూ ఆండ్రాయిడ్ యూజర్లను క్వాల్కమ్ హెచ్చరించడం విశేషం. అయితే పొరపచ్చాలు..ఈ రెండు కంపెనీల భవిష్యత్తు వ్యాపారంపై పడే నష్టం ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పిక్సెల్ ఫోన్లను మినహాయిస్తే.. మిగతా డివైజ్‌లన్నీ క్వాల్కమ్ ప్రాసెసర్‌లతోనే మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ, రాబోయే రోజుల్లో ఇది శత్రుత్వంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక గూగుల్ డెవలప్ చేస్తున్న సొంత చిప్ అండ్ ప్రాసెసింగ్ వ్యవస్థ 2023 నాటికల్లా మార్కెట్లోకి రానుంది. ప్రపంచంలో 90 శాతం మొబైల్ డివైజ్ వ్యవస్థలో ఉపయోగించే.. బ్లూప్రింట్ ఆఫ్ ఆర్మ్స్ ఆధారంగా గూగుల్ సీపీయూ, మొబైల్ ప్రాసెసర్ ను గూగుల్ తీసుకురాబోతోంది. చదవండి: జీవిత భాగస్వాములపై నిఘా..! గూగుల్ కీలక నిర్ణయం! -
మోటోరోలా నుంచి ఫ్లాగ్షిప్ ఫోన్
ప్రపంచంలో మొట్టమొదటి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి మార్కెట్లో రేసు కొనసాగుతోంది. ఇప్పటికే షియోమీ, రియల్మీ, శామ్సంగ్ కంపెనీలు స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో మొబైల్‌ని తీసుకొస్తునట్టు ప్రకటించాయి. తాజాగా మోటరోలా కూడా అతి త్వరలో రంగంలోకి దిగబోతున్నట్లు కనిపిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో మోటోరోలా తీసుకురాబోయే మొబైల్ గురుంచి సమాచారం చాలా తక్కువగా ఉంది. లెనోవా ఎగ్జిక్యూటివ్ చెన్ జిన్ తెలిపిన పోస్ట్ ప్రకారం కొత్తగా తీసుకురాబోయే మొబైల్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో పని చేయవచ్చు.(చదవండి: 9 ఏళ్లలో శామ్సంగ్ కి ఇదే మొదటి సారి) మోటరోలా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎడ్జ్ ప్లస్‌తో ఫ్లాగ్షిప్ స్థాయి ఫోన్‌ను ప్రవేశపెట్టింది. 5జీ-ఎనేబుల్డ్ ఎడ్జ్ ప్లస్ ఆన్లైన్లో సుమారు రూ.65,000కు లభిస్తుంది. ఈ ఫోన్లో 12 జీబీ ర్యామ్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 108 మెగాపిక్సెల్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రాబోయే మొబైల్స్ 2021 ప్రారంభంలో తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు వచ్చిన నివేదికల ప్రకారం మొట్ట మొదటిగా షియోమీ రేపు(డిసెంబర్ 28) విడుదల చేసే ఎంఐ 11 స్మార్ట్‌ఫోన్ సిరీస్ లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకురానున్నట్లు సమాచారం. ఎంఐ 11 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ క్వాడ్ హెచ్డి + డిస్ప్లేతో రానుంది. 4,780 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుందని చెబుతున్నారు. -
ఆ మొబైల్స్ కంటే పవర్ ఫుల్ గా ఐఫోన్ 12ప్రో
క్వాల్కామ్ ప్రతి సంవత్సరం డిసెంబరులో ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల కోసం శక్తివంతమైన ప్రాసెసర్‌ను తీసుకొస్తుంది. ఈ ప్రాసెసర్‌ను వచ్చే ఏడాది రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల కోసం ఉపయోగిస్తారు. అలాగే, ఈ ఏడాది కూడా క్వాల్కామ్ కంపెనీ స్నాప్‌డ్రాగన్ 888 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌ను తీసుకొచ్చింది. ఈ ప్రాసెసర్‌ని 2021లో అన్ని ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్లలో తీసుకొస్తారు. కానీ ఒక విషయం ఏమిటంటే కొత్తగా తీసుకొచ్చిన స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఈ ఏడాది విడుదలైన ఆపిల్ యొక్క ప్రాసెసర్ కంటే శక్తివంతమైనది కాదని నిరూపితమైంది.(చదవండి: పబ్జి గేమ్ లాంచింగ్ ఇప్పట్లో లేనట్లే..) ఇటీవల కొత్తగా క్వాల్కామ్ తీసుకొచ్చిన స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ యొక్క బెంచ్‌మార్క్ సమాచారం బయటకి వచ్చింది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ని ఆపిల్ యొక్క ఏ14 బయోనిక్, ఆపిల్ ఏ13 ప్రాసెసర్ స్కోర్లతో పోల్చారు. సీపీయూ బెంచ్‌మార్కింగ్ వెబ్సైట్ గీక్‌బెంచ్ 5లో ఈ మూడింటిని పరీక్షించారు. సింగిల్ కోర్ పనితీరులో ఆపిల్ ఐఫోన్ 12ప్రో(ఎ14 బయోనిక్) 1603 స్కోరు సాధించింది. అలాగే, స్నాప్‌డ్రాగన్ 888 1135తో ఎ14 బయోనిక్ కంటే తక్కువ స్కోరు సాధించింది. ఇంకా చెప్పాలంటే ఐఫోన్ 11 ప్రో(ఎ13) 1331 స్కోరు కంటే తక్కువ. మల్టీకోర్ పనితీరు ఆధారంగా చుస్తే స్నాప్‌డ్రాగన్ 888 యొక్క 3794 స్కోర్ తో పోలిస్తే ఐఫోన్ 12ప్రో 4187 స్కోరు సాధించింది. అలాగే గ్రాఫిక్స్ పనితీరును పరీక్షించే వెబ్సైట్ జిఎఫ్ఎక్స్ లో జీపీయు పనితీరును కూడా పరీక్షించారు. ఫలితాల ప్రకారం, ఐఫోన్ 12 ప్రో సెకనుకు 102.2 పీక్ ఫ్రేమ్‌లను సాధించింది. స్నాప్‌డ్రాగన్ 888 సెకనుకు 86 పీక్ ఫ్రేమ్లకు మాత్రమే చేరుకుంది. ఇది ఐఫోన్ 12, ఐఫోన్ 11 ప్రో మాక్స్, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11, ఐఫోన్ ఎస్ఇ(2020) స్కోర్ల కంటే కూడా తక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే 2021లో తీసుకురాబోయే అన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్ కంటే 2020లో వచ్చిన ఐఫోన్ 12ప్రో శక్తివంతమైనది అని తెలుస్తుంది. అయితే, గీక్‌బెంచ్, జిఎఫ్ఎక్స్ బెంచ్ ఫలితాలలో, స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ప్రస్తుత హై-ఎండ్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్లైన గెలాక్సీ నోట్ 20 అల్ట్రా, గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా, హువావే 40 ప్రో, ఆసుస్ రోగ్ ఫోన్ కంటే మెరుగైన పనితీరును కనబరిచింది. స్నాప్‌డ్రాగన్ 888, ఆపిల్ ఏ14 బయోనిక్ ప్రాసెసర్లు 5ఎన్ఎమ్ ప్రాసెస్‌పై తయారు చేయబడ్డాయి. క్వాల్కమ్ యొక్క చిప్‌సెట్‌లో ఏ14 బయోనిక్‌లో ఉపయోగించిన మాదిరిగానే కార్టెక్స్ X-1ను దాని పెద్ద-చిన్న డిజైన్‌లో ఉపయోగించారు. -
క్వాల్కామ్ నుంచి మరో వేగవంతమైన ప్రాసెసర్
క్వాల్కామ్ ఈ నెల మొదటి వారంలో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ని లాంచ్ చేసిన సంగతి మనకి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో కొత్త ప్రాసెసర్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. స్నాప్‌డ్రాగన్ 6 సిరీస్ లో భాగంగా 675 ప్రాసెసర్ కి కొనసాగింపుగా 678 ప్రాసెసర్ ని తీసుకొచ్చింది. ఈ ప్రాసెసర్ 11నానోమీటర్ టెక్నాలజీపై తయారు చేయబడింది. దీని యొక్క డౌన్లోడ్ స్పీడ్ 600ఎంబిపిఎస్ కాగా, అప్లోడ్ స్పీడ్ 150 ఎంబిపిఎస్ గా ఉంది. స్నాప్‌డ్రాగన్ 678 ప్రాసెసర్ లో ఎక్స్ 12 ఎల్టీఈ మోడమ్ ని అందించారు. ఇది 4కే రికార్డింగ్ వీడియోకి, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, ఎన్ఎఫ్ సి కూడా సపోర్ట్ చేస్తుంది. 675 ప్రాసెసర్ ని 2018లో తీసుకొచ్చారు. క్వాల్కామ్ మిడ్ రేంజ్ మొబైల్స్ కోసం ఈ ప్రాసెసర్ ని తీసుకొచ్చింది.(చదవండి: ఈ 25వేలు మీ సొంతం) స్నాప్‌డ్రాగన్ 678 ఫీచర్స్: క్వాల్కామ్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్ ద్వారా కొత్త చిప్ ని ప్రకటించింది. స్నాప్‌డ్రాగన్ 675ప్రాసెసర్ తీసుకొచ్చిన రెండేళ్ల తర్వాత దీనిని తీసుకొచ్చారు. స్నాప్‌డ్రాగన్ 678ని 2.2గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల క్వాల్కమ్ క్రియో 460 ఆక్టా-కోర్ సిపియుపై తయారు చేసారు. స్నాప్‌డ్రాగన్ 675 యొక్క 2గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కంటే కొంచెం వేగంగా ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 678లో క్వాల్కమ్ అడ్రినో 612 జీపీయు కూడా ఉంది. దింతో ఇది వేగంగా గ్రాఫిక్స్ రెండరింగ్‌ను డ్రైవ్ చేస్తుంది, తక్కువ ఫ్రేమ్ డ్రాప్‌లతో అధిక ఫ్రేమ్రేట్ల వద్ద మంచి విజువల్స్‌ను అందిస్తుంది అని కంపెనీ పేర్కొంది. కనెక్టివిటీ కోసం, స్నాప్‌డ్రాగన్ 678 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ 12 ఎల్‌టిఇ మోడెమ్‌తో వస్తుంది. దీని గరిష్ట డౌన్లోడ్ స్పీడ్ 600 ఎమ్‌బిపిఎస్,అప్లోడ్ స్పీడ్ 150 ఎమ్‌బిపిఎస్ గా ఉంది. ఇది డ్యూయల్-సిమ్ డ్యూయల్ VoLTE, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్ సి, బీడౌ, గెలీలియో, గ్లోనాస్, జిపిఎస్, QZSS, SBAS నావిగేషన్ సిస్టంలకు కూడా సపోర్ట్ చేస్తుంది. క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4+ టెక్నాలజీకి కూడా సపోర్ట్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 678 4కే అల్ట్రా హెచ్డి రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. ఆడియో పరంగా క్వాల్కమ్ ట్రూవైర్‌లెస్ స్టీరియో ప్లస్ టెక్నాలజీ, క్వాల్కమ్ అక్స్టిక్ ఆడియో టెక్నాలజీ, క్వాల్కమ్ ఆప్టిఎక్స్ ఆడియో టెక్నాలజీతో వస్తుంది. -
రియల్మీ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 888
రాబోయే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌ను తమ తదుపరి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించనున్నట్లు రియల్మీ ధృవీకరించింది. ప్రపంచవ్యాప్తంగా స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వస్తున్న మొబైల్ కంపెనీలలో రియల్మీ ఒకటి అని సంస్థ పేర్కొంది. రియల్మీ తదుపరి తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ను “రేస్” అనే కోడ్ పేరుతో పిలుస్తున్నారు. నిన్న జరిగిన టెక్ సమ్మిట్‌లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ని వచ్చే ఏడాది ప్రారంభంలో తీసుకొచ్చే మొబైల్ ఫోన్లలో లభిస్తుందని తెలిపారు. “ఇది రియల్మీ మరియు మా వినియోగదారులకు ఒక మైలురాయి. స్నాప్‌డ్రాగన్ 888 చిప్సెట్తో కూడిన స్మార్ట్‌ఫోన్ తయారీదారులలో మేము ఒకటి అయినందుకు గర్వపడుతున్నాము. ఈ మైలురాయితో 2021లో భారతదేశంలో మరిన్ని 5జీ మొబైల్ తీసుకురావాలనే మా నిబద్ధతను మేము తెలియజేస్తున్నాము ”అని సిఇఒ మాధవ్ శేత్ చెప్పారు.(చదవండి: గెలాక్సీ నోట్ ఫోన్లకు శాంసంగ్ స్వస్తి) క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 5G అనేది టాప్-ఆఫ్-ది-లైన్ చిప్సెట్ కావడంతో ఇది మొబైల్ ప్లాట్‌ఫాం వినియోగదారులకు ప్రీమియం అనుభవాలను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ కు తదుపరి ప్రాసెసర్ గా క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888ని తీసుకొచ్చింది. ఇది సిస్టమ్-ఆన్-చిప్ 3వ తరం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ 60 5జీ మోడెమ్-RF వ్యవస్థను కలిగి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన బ్యాండ్లలో ఎంఎమ్వేవ్ మరియు సబ్ -6లకు సపోర్ట్ తో గ్లోబల్ 5జీకి సపోర్ట్ చేస్తుంది. అలాగే 5జీ క్యారియర్ అగ్రిగేషన్, గ్లోబల్ మల్టీ-సిమ్, స్టాండ్ ఒంటరిగా, నాన్ స్టాండ్ ఒంటరిగా, మరియు డైనమిక్ స్పెక్ట్రమ్ షేరింగ్ వంటి వాటికీ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 6వ తరం క్వాల్కమ్ ఆర్టిఫిషల్ ఇంటెలీజెన్స్ ఉందట ద్వారా సెకనుకు 26 టెరా ఆపరేషన్లలో (TOPS) మెరుగైన పనితీరును కనబర్చింది. ఇది మొబైల్ గేమ్ లలో సెకనుకు 144 ఫ్రేమ్‌లను (fps) అందించగలదు. అడ్రినో జీపీయు సిరీస్ లో అడ్రినో 660 జిపియు అత్యంత ముఖ్యమైన అప్‌గ్రేడ్ అని క్వాల్కమ్ తెలిపింది. ఈ ప్రాసెసర్ సెకనుకు 2.7 గిగాపిక్సెల్స్ వద్ద లేదా 12మెగాపిక్సల్ రిజల్యూషన్ వద్ద సుమారు 120 ఫోటోలను తీయడానికి అనుమతిస్తుంది అని సంస్థ తెలిపింది. -
గెలాక్సీ ఎస్ సిరీస్ స్పెసిఫికేషన్స్ లీక్
శామ్సంగ్ తర్వాత తీసుకురాబోయే గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్ఫోన్ల గురించి గత రెండు వారాలుగా ఇంటర్నెట్లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. టెక్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, గెలాక్సీ ఎస్ సిరీస్ మోడల్లో మూడు స్మార్ట్ఫోన్లను తీసుకురావాలని శామ్సంగ్ యోచిస్తోంది. గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21 ప్లస్ మరియు గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా అనే పేరుతో వీటిని తీసుకు రానున్నట్లు సమాచారం. వీటిని వరుసగా O1, T2 మరియు P3 అనే కోడ్ పేరుతో పిలుస్తున్నారు. గెలాక్సీ ఎస్ 21 ప్లాస్టిక్ రియర్ కవర్‌ను అందిస్తుందని, ఎస్21 అల్ట్రా గ్లాస్‌ను ఉపయోగించాలని భావిస్తున్నారు. రాబోయే గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్ఫోన్ల గురించి మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ఫ్రంట్ కెమెరాను ఫోన్ యొక్క ఎడమ భాగంలో ఫ్రేమ్ లోనే తీసుకువస్తున్నారు. దీనిలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 875 SoC లేదా శామ్సంగ్ సొంత చిప్సెట్ ఎక్సినోస్ 2100 ప్రాసెసర్‌ను మూడు మోడళ్లలో ఉపయోగించనున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే వన్ UI 3.1పై గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్స్ నడుస్తాయని సమాచారం. (చదవండి: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్) గెలాక్సీ ఎస్21 గెలాక్సీ ఎస్21 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.2 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + ఎల్‌టిపిఎస్ డిస్ప్లేను తీసుకు రానున్నట్లు ఆన్లైన్ లో పుకార్లు వస్తున్నాయి. అలాగే గెలాక్సీ ఎస్ 21 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 ఎంపీ మెయిన్ సెన్సార్ కెమెరా, 64 ఎంపీ టెలిఫోటో సెన్సార్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం. ఫాంటమ్ వైలెట్, ఫాంటమ్ పింక్, ఫాంటమ్ గ్రే మరియు ఫాంటమ్ వైట్ రంగుల్లో రానున్నట్లు సమాచారం. గెలాక్సీ ఎస్ 21 ప్లస్ గెలాక్సీ ఎస్ 21 + 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ ఎల్టీపీఎస్ డిస్ప్లేను వాడనున్నట్లు ఆన్లైన్ లో పుకార్లు వస్తున్నాయి. అలాగే గెలాక్సీ ఎస్ 21 + 4800 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 ఎంపీ మెయిన్ సెన్సార్ కెమెరా, 64 ఎంపీ టెలిఫోటో సెన్సార్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం. ఫాంటమ్ సిల్వర్, ఫాంటమ్ బ్లాక్ మరియు ఫాంటమ్ వైలెట్ రంగుల్లో రానున్నట్లు సమాచారం. గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా ఈ మోడల్ టాప్-ఎండ్ స్మార్ట్‌ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల WQHD + ఎల్టిపిఓ డిస్ప్లేను పొందుపరచనున్నారు. ఈ మొబైల్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో మరియు వెనుక వైపున, 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 108 ఎంపీ ప్రధాన సెన్సార్, రెండు ఆప్టికల్ టెలిఫోటో సెన్సార్లను కలిగి ఉన్న క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఫాంటమ్ సిల్వర్, ఫాంటమ్ బ్లాక్ రంగుల్లో రానున్నట్లు సమాచారం. -
పోకో ఎమ్3 స్పెసిఫికేషన్స్ ఇవే
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతోంది. పోకో ఎమ్3 మొబైల్ విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. పోకో కంపెనీ వర్చువల్ ఈవెంట్ ద్వారా పోకో ఎమ్3ని నవంబర్ 24న సాయంత్రం 5.30 గంటలకు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతుంది. ఆ రోజు జరిగే లాంచ్ ఈవెంట్ లో పోకో ఎమ్3 యొక్క ధర, ఫీచర్స్ వెల్లడించనుంది. అయితే రెడ్మీ నోట్ 10 రీబ్రాండెడ్ వర్షన్‌ను పోకో ఎమ్3 పేరుతో తీసుకు వస్తునట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రెడ్మీ 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను పోకో ఎం2 పేరుతో రీబ్రాండ్ చేసిన సంగతి తెలిసిందే. పోకో ఎం3 విషయంలో కూడా అదే జరగొచ్చని అందరూ భావిస్తున్నారు. (చదవండి: పబ్జీ మొబైల్ ఇండియా కొత్త టీజర్ వచ్చేసింది) I don’t know about you, but I truly miss the feeling of waiting for a new POCO to be revealed. 🙌 Introducing POCO M3, Our MOST ???? yet! 😏#POCOM3 Is #MoreThanYouExpect pic.twitter.com/pQKQoGbFSe — POCO (@POCOGlobal) November 17, 2020 M2010J19CG మోడల్ నంబర్ తో కొత్త POCO ఫోన్ ఈ వారం ప్రారంభంలో గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్న పోకో ఎమ్3 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. 6.53 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్, 8 ఎంపి సెల్ఫీ కెమెరా, డ్యూయెల్ స్పీకర్స్, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 6జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారిత MIUI, 4జి ఎల్‌టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ మరియు యుఎస్బి టైప్-సి పోర్ట్, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి స్పెసిఫికేషన్స్ ఉండొచ్చని అంచనా. -
ప్యానాసానిక్ ‘ఎల్యూగా యు’@ రూ.18,990
న్యూఢిల్లీ: ప్యానాసానిక్ కంపెనీ ఎల్యూగా సిరీస్ స్మార్ట్ఫోన్లను బుధవారం భారత్ మార్కెట్లోకి ఆవిష్కరించింది. వచ్చే నెల మొదటివారం నుంచి ‘ఎల్యూగా యు’ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ప్రారంభిస్తామని ప్యానాసానిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ చెప్పారు. ధర రూ.18,990 అని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్లో క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 5 అంగుళాల ఐపీఎస్ హెచ్డీ డిస్ప్లే, 16 జీబీ మెమరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 13 మెగాపిక్సెల్ రియర్-2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని తెలిపారు. 15 స్మార్ట్ఫోన్లు: రానున్న కొన్ని నెలల్లో 15కు పైగా కొత్త స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తేనున్నామని మనీష్ శర్మ తెలిపారు. భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తమ వాటా ప్రస్తుతం 3 శాతమని, ఏడాదిలో దీనిని 5 శాతానికి పెంచుకోవడం లక్ష్యంగా 15కు పైగా స్మార్ట్ఫోన్లను, 8 ఫీచర్ ఫోన్లను మార్కెట్లోకి తేనున్నామని పేర్కొన్నారు. అయితే స్మార్ట్ఫోన్లపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. భారత్ కేంద్రంగా తమ మొబైల్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తామని చెప్పారు. సరైన ధరలకు నాణ్యత గల మొబైళ్లనందించే తమలాంటి కంపెనీలకు భారత్‌లో అపార అవకాశాలున్నాయన్నారు.