శామ్‌సంగ్ తర్వాత తీసుకురాబోయే గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి గత రెండు వారాలుగా ఇంటర్నెట్‌లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. టెక్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, గెలాక్సీ ఎస్ సిరీస్ మోడల్‌లో మూడు స్మార్ట్‌ఫోన్‌లను తీసుకురావాలని శామ్‌సంగ్ యోచిస్తోంది. గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21 ప్లస్ మరియు గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా అనే పేరుతో వీటిని తీసుకు రానున్నట్లు సమాచారం. వీటిని వరుసగా O1, T2 మరియు P3 అనే కోడ్ పేరుతో పిలుస్తున్నారు. గెలాక్సీ ఎస్ 21 ప్లాస్టిక్ రియర్ కవర్‌ను అందిస్తుందని, ఎస్21 అల్ట్రా గ్లాస్‌ను ఉపయోగించాలని భావిస్తున్నారు. రాబోయే గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ఫ్రంట్ కెమెరాను ఫోన్ యొక్క ఎడమ భాగంలో ఫ్రేమ్ లోనే తీసుకువస్తున్నారు. దీనిలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 875 SoC లేదా శామ్‌సంగ్ సొంత చిప్‌సెట్ ఎక్సినోస్ 2100 ప్రాసెసర్‌ను మూడు మోడళ్లలో ఉపయోగించనున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే వన్ UI 3.1పై గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్స్ నడుస్తాయని సమాచారం. (చదవండి: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్)
గెలాక్సీ ఎస్21
గెలాక్సీ ఎస్21 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.2 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + ఎల్‌టిపిఎస్ డిస్‌ప్లేను తీసుకు రానున్నట్లు ఆన్లైన్ లో పుకార్లు వస్తున్నాయి. అలాగే గెలాక్సీ ఎస్ 21 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 ఎంపీ మెయిన్ సెన్సార్ కెమెరా, 64 ఎంపీ టెలిఫోటో సెన్సార్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం. ఫాంటమ్ వైలెట్, ఫాంటమ్ పింక్, ఫాంటమ్ గ్రే మరియు ఫాంటమ్ వైట్ రంగుల్లో రానున్నట్లు సమాచారం.
గెలాక్సీ ఎస్ 21 ప్లస్
గెలాక్సీ ఎస్ 21 + 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ ఎల్‌టీపీఎస్ డిస్‌ప్లేను వాడనున్నట్లు ఆన్లైన్ లో పుకార్లు వస్తున్నాయి. అలాగే గెలాక్సీ ఎస్ 21 + 4800 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 ఎంపీ మెయిన్ సెన్సార్ కెమెరా, 64 ఎంపీ టెలిఫోటో సెన్సార్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం. ఫాంటమ్ సిల్వర్, ఫాంటమ్ బ్లాక్ మరియు ఫాంటమ్ వైలెట్ రంగుల్లో రానున్నట్లు సమాచారం.
గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా
ఈ మోడల్ టాప్-ఎండ్ స్మార్ట్‌ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల WQHD + ఎల్‌టిపిఓ డిస్‌ప్లేను పొందుపరచనున్నారు. ఈ మొబైల్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో మరియు వెనుక వైపున, 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 108 ఎంపీ ప్రధాన సెన్సార్, రెండు ఆప్టికల్ టెలిఫోటో సెన్సార్లను కలిగి ఉన్న క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఫాంటమ్ సిల్వర్, ఫాంటమ్ బ్లాక్ రంగుల్లో రానున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment