గూగుల్.. చిప్​ చిచ్చు రాజుకుందా? | Qualcomm unhappy with Google Pixel Own Chip Decision | Sakshi
Sakshi News home page

సొంత చిప్​లతో గూగుల్​ పిక్సెల్​ ఫోన్​.. క్వాల్​కమ్​ అసంతృప్తి ట్వీట్​తో అగ్గి!

Published Fri, Oct 15 2021 11:16 AM | Last Updated on Fri, Oct 15 2021 11:36 AM

Qualcomm unhappy with Google Pixel Own Chip Decision - Sakshi

అమెరికా టెక్​ దిగ్గజం గూగుల్​(ఆల్ఫబెట్​ కంపెనీ), చిప్​మేకర్​ క్వాల్​కమ్​ మధ్య విభేధాలు మొదలయ్యాయి. చిప్​ తయారీ విషయంలో గూగుల్​ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. ఈ మేరకు గూగుల్​ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్వాల్​కమ్ ఒక ట్వీట్​ చేయడం విశేషం. 


అమెరికన్​ చిప్​మేకర్​ కంపెనీ క్వాల్​కమ్​.. సొంతంగా చిప్​లు తయారు చేసుకోవాలన్న గూగుల్​ నిర్ణయంపై అసంతృప్తితో రగిలిపోతోంది. 

రాబోయే పిక్సెల్ 6​ స్మార్ట్​ఫోన్స్​ను గూగుల్​ తాము సొంతంగా రూపొందించిన చిప్​ సిస్టమ్​తో మార్కెట్​లోకి తీసుకురాబోతోంది.

ఈ నిర్ణయంపై క్వాల్​కమ్​ ట్వీట్​ రూపంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. 


స్నాప్​డ్రాగన్​కు బదులు ఇకపై సొంత స్మార్ట్​ఫోన్​ ఎస్​వోసీని తయారు చేబోతున్నాం అంటూ ఎర్ర జెండాల ఎమోజీతో ఒక ట్వీట్​ చేసింది క్వాల్​కమ్​. 

ఇప్పటిదాకా పిక్సెల్​ ఫోన్లకు చిప్​సెట్​లను సప్లై చేస్తూ వస్తోంది క్వాల్​కమ్​. 

కానీ, తాజా నిర్ణయంతో క్వాల్​కమ్​కు నష్టం వాటిల్లనుంది. 

గూగుల్​ టెన్సర్​ చిప్​ను నమ్మకూడదంటూ ఆండ్రాయిడ్​ యూజర్లను క్వాల్​కమ్​ హెచ్చరించడం విశేషం. 



అయితే పొరపచ్చాలు..ఈ రెండు కంపెనీల భవిష్యత్తు వ్యాపారంపై పడే నష్టం ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు

పిక్సెల్​ ఫోన్లను మినహాయిస్తే.. మిగతా డివైజ్​లన్నీ క్వాల్​కమ్​ ప్రాసెసర్లతోనే మార్కెట్​లోకి వస్తున్నాయి.

కానీ, రాబోయే రోజుల్లో ఇది శత్రుత్వంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

ఇక గూగుల్​ డెవలప్​ చేస్తున్న సొంత చిప్ అండ్​ ప్రాసెసింగ్​​ వ్యవస్థ 2023 నాటికల్లా మార్కెట్​లోకి రానుంది. 

ప్రపంచంలో 90 శాతం మొబైల్​ డివైజ్​ వ్యవస్థలో ఉపయోగించే.. బ్లూప్రింట్​ ఆఫ్​ ఆర్మ్స్​ ఆధారంగా గూగుల్​ సీపీయూ, మొబైల్​ ప్రాసెసర్​ ను గూగుల్​ తీసుకురాబోతోంది.

చదవండి: జీవిత భాగస్వాములపై నిఘా..! గూగుల్‌ కీలక నిర్ణయం!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement