యాపిల్, శామ్ సంగ్ మొబైల్స్ తర్వాత అంత క్రేజ్ వన్‌ప్లస్ మొబైల్స్‌కి ఉంటాయి. ఈ కంపెనీ నుంచి వచ్చిన చాలా మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్మడు పోతాయి. అయితే, తాజాగా వన్‌ప్లస్ మరో కొత్త మొబైల్‌ని చైనా మార్కెట్లో మొదట విడుదల చేసింది. ఈ వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో కొత్తగా వచ్చిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్1 చిప్ వస్తుంది. ఈ మొబైల్ 120హెర్ట్జ్ అమోల్డ్ డిస్ ప్లేతో రానున్నట్లు కంపెనీ తెలిపింది. వన్‌ప్లస్ 10 ప్రో 80డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సహాయంతో వస్తుంది. కొత్త వన్‌ప్లస్ ఫ్లాగ్ షిప్ మొబైల్ కూడా హైపర్ బూస్ట్ టెక్నాలజీతో రానున్నట్లు తెలిపింది.
వన్‌ప్లస్ 10 ప్రో ధర:
వన్ ప్లస్ 10 ప్రో బేస్ వేరియంట్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను సిఎన్‌వై 4,699 (సుమారు రూ. 54,500)కు తీసుకొని వచ్చారు. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర సిఎన్‌వై 4,999(సుమారు రూ. 58,000)కు లభిస్తే, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర సిఎన్‌వై 5,299 (సుమారు రూ. 61,500)కు లభిస్తుంది. ఇది చైనాలో జనవరి 13 నుంచి సేల్ కోసం అందుబాటులోకి రాలేదు. అయితే, ఈ వన్‌ప్లస్ 10 ప్రోను ప్రపంచ మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొని వస్తారు అనే విషయం పేర్కొనలేదు.
వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్స్:
- 6.7 అంగుళాల క్యూహెచ్ డి+ (1,440ఎక్స్3,216 పిక్సెల్స్) అమోల్డ్ డిస్ ప్లే
- ఆండ్రాయిడ్ 12 సపోర్ట్ గల కలర్ ఓఎస్ 12.1
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్యానెల్ ప్రొటెక్షన్
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్1 చిప్
- 12 జీబీ ఎల్‌పిడిడిఆర్ 5 ర్యామ్
- 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
- 50-మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా
- 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా
- 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎమ్ ఎక్స్615 ఫ్రంట్ కెమెరా
- 256జీబీ యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ సపోర్ట్
- 5,000 ఎమ్ఎహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ
- 80 వాట్ సూపర్ ఫ్లాష్ ఛార్జ్ వైర్డ్ ఛార్జింగ్, 50 వాట్ వైర్ లెస్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్
(చదవండి: హల్‌చల్ చేస్తోన్న స్కోడా ఎలక్ట్రిక్ కారు..! రేంజ్ ఎంతంటే..?)
Comments
Please login to add a commentAdd a comment