న్యూ ఇయర్ సందర్భంగా దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో కొత్త స్మార్ట్ ఫోన్‌లు సందడి చేయనున్నాయి. స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో న్యూఇయర్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆయా స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను సరికొత్త హంగులతో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి.
తాగాజా స్మార్ట్ ఫోన్ సంస్థ వన్‌ప్లస్ 'వన్ ప్లస్ 10ప్రో' పేరిట కొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవ్వగా..ఆఫోన్‌కు సంబంధించి ఫీచర్లు లీకయ‍్యాయి. అంతేకాదు కొత్త ఏడాదిలో ఎప్పుడు మార్కెట్‌కి పరిచయం చేస్తున్నారనే అంశంపై క్లారిటీ ఇచ్చారు వన్ ప్లస్ ప్రతినిధులు.
OnePlus 10 Pro from all angles launching on January 11, 2022 in China.#OnePlus #Oppo pic.twitter.com/FFFWq97ZQ9
— Abhishek Yadav (@yabhishekhd) December 30, 2021
అఫీషియల్‌గా
చైనా సోషల్ మీడియా 'వైబో' కథనం ప్రకారం.. వన్‌ప్లస్ అఫీషియల్‌గా జనవరి 11,2022న చైనా మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. తొలుత అక్కడ విడుదల చేసిన తరువాత వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనుంది.
'వన్ ప్లస్ 10ప్రో' స్పెసిఫికేషన్‌లు
చైనాలో విడుదలైన వన్ ప్లస్ 10ప్రో వీడియో ప్రకారం..
స్నాప్ డ్రాగన్ 8జనరేషన్ 1చిప్‌సెట్
50ఎంపీ మెయిర్ రేర్ కెమెరా
6.7 కర్వుడ్ ఎల్‌టీపీఓ 2.0 అమోలెడ్ డిస్‌ప్లే
120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్
బ్యాటరీ కెపాసిటీ 5,000ఎంఏహెచ్
ఆండ్రాయిడ్ 12 వెర్షన్
Comments
Please login to add a commentAdd a comment