కరోనా ఆర్థిక వ్యవస్థకు చేసిన గాయాలు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎఫెక్ట్ వెరసి స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ యాపిల్‌కి ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. స్మార్ట్‌ఫోన్ డిమాండ్ పడిపోతుండటంతో ఆ కంపెనీ లాభాలు పరిమితం కావచ్చంటూ ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ జేపీ మోర్గాన్ సూచించింది. అందుకు తగ్గట్టుగా మోస్ట్ ఫ్రిఫరెడ్ స్టాక్స్ జాబితా నుంచి యాపిల్‌ను తొలగించింది.
మార్కెట్ కన్సల్టెన్సీ సంస్థ జేపీ మోర్గాన్ అనేక బడా కార్పోరేట్ కంపెనీలకు సేవలు అందిస్తోంది. అదే విధంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కూడా విలువైన సూచనలు చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆయా కంపెనీల లావాదేవీలు, మార్కెట్ ఎత్తుగడలు, ప్రపంచ పరిస్థితులను అంచనా వేస్తూ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు మోస్ట్ ఫ్రిఫరెడ్ స్టాక్స్ పేరుతో ఓ జాబితా రూపొందిస్తుంది. ఈ జాబితాలో యాపిల్ సంస్థ కొన్నేళ్లుగా సుస్థిర స్థానం సంపాదించుకుంది.
అయితే కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించడం, ఆ వెంటనే సప్లై చెయిన్ దెబ్బతినడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మూలికే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇంతలో ఉక్రెయిన్, రష్యా వార్ వచ్చిపడింది. దీంతో ఆదాయ వనరులు తగ్గిపోయాయి. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు క్షీణిస్తున్నాయి. వీటిని నిలబెట్టుకునేందుకు అప్పటికీ యాపిల్ సంస్థ పలు మోడళ్ల ధరలకు కోత పెట్టింది. ఐనప్పటికీ అమ్మకాలు మెరుగుపడే అవకాశం లేకపోవడం. పైగా యాపిల్ ఫోన్లు ఎక్కువగా తయారయ్యే చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తుండటంతో పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఫలితంగా యాపిల్ ఆశించిన మేరకు లాభాలు అందించలేకపోవచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది.
యాపిల్‌తో పాటు ప్రముఖ చిప్ మేకర్ కంపెనీ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ సైతం మోస్ట్ ప్రిఫరబుల్ స్టాక్స్ జాబితాలో చోటు కోల్పోయింది. ఈ రెండింటి స్థానంలో నెట్‌వర్క్ ఎక్వీప్‌మెంట్ కంపెనీలైన ఆరిస్టా నెట్‌వర్క్, సియన్నా కంపెనీలు చోటు దక్కించుకున్నాయి.
చదవండి: యాపిల్ మాస్టర్‌ప్లాన్...అందరికీ అందుబాటులో ఐఫోన్..!
Comments
Please login to add a commentAdd a comment