ప్రముఖ చైనా మొబైల్ తయారీ దిగ్గజం షావోమీ నుంచి త్వరలో ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ షావోమీ 12 రానున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో షావోమీ 12, షావోమీ 12ఎక్స్, షావోమీ 12ప్రో, షావోమీ 12 అల్ట్రా రానున్నాయి. షావోమీ12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల గురుంచి చైనా టెక్ దిగ్గజం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయితే, ఇటీవల షావోమీ12 స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. అలాగే, రాబోయే స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కొన్ని డిజైన్ కూడా బయటకు వచ్చాయి.
షావోమీ 12 స్టాండర్డ్ ఎడిషన్ ఫీచర్స్(అంచనా)
తాజాగా లీక్ అయిన షావోమీ 12 స్పెసిఫికేషన్స్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ మొబైల్ డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్ లైట్ తో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెంట్రల్ అలైన్డ్ హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. షావోమీ 12 ఫుల్-హెచ్ డి+(1,920ఎక్స్1,080 పిక్సెల్స్) రిజల్యూషన్ గల డిస్ ప్లేను కలిగి ఉండనుంది. అదనంగా, ఇందులో స్క్రీన్ ఇన్ బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా రానున్నట్లు సమాచారం.
షావోమీ 12 స్టాండర్డ్ ఎడిషన్ గతంలో చైనా కంపల్సరీ సర్టిఫికేషన్(3సీ) వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం.. ఇది 67డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు. బేస్ షావోమీ 12 స్టాండర్డ్ ఎడిషన్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యుఎస్‌బి టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్, వైర్ లెస్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేయనుంది. షావోమీ 12 8జీబీ ర్యామ్ గల క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరల్ 1 ప్రాసెసర్ సహాయంతో పనిచేయనున్నట్లు సమాచారం. ఈ 5జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో పాటు బ్లూటూత్ వి5.2 కనెక్టివిటీ ఉంటుందని పేర్కొన్నారు. దీని ధర సుమారు రూ.69,990గా ఉండే అవకాశం ఉంది.
(చదవండి: అమెరికాకు వచ్చినప్పుడు నా చేతిలో చిల్లి గవ్వ లేదు: ఎలోన్ మస్క్!)
Comments
Please login to add a commentAdd a comment