న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో కొత్త మొబైల్ ఎంఐ 10ఐను షియోమీ అన్ని మొబైల్ కంపెనీల కంటే ముందుగా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆన్‌లైన్ ద్వారా లాంచ్ చేయనున్నారు. లాంచ్ చేయడానికి ముందే 108 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ వంటి కీలక వివరాలను షియోమీ వెల్లడించింది. ఈ ఫోన్ 2020లో చైనాలో లాంచ్ అయిన ఎంఐ 10టీ లైట్ యొక్క రీబ్రాండ్ వెర్షన్ అని భావిస్తున్నారు. కంపెనీ మాత్రం దీనిని భారతీయ మొబైల్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తయారు చేసినట్లు పేర్కొంది.(చదవండి: 39 వేల చైనా యాప్ లను నిషేదించిన యాపిల్)
ఎంఐ 10ఐ ఫీచర్స్:
ఇది నిజంగా ఎంఐ 10టి లైట్ యొక్క రీబ్రాండ్ అయితే దీనిలో 1080 రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల డిస్‌ప్లేను తీసుకురానున్నారు. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ను తీసుకురానున్నారు. ఇది 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ ఆప్షన్ లలో లభించనుంది. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2-కెమెరా మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీల కోసం ఇందులో 16 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. ఇది 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4820 ఎమ్ఏహెచ్ బ్యాటరీ యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఎంఐ 10ఐ ధర విషయానికొస్తే సుమారు భారతదేశంలో రూ.25,000 ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment