china mobile
-
చైనా మొబైల్ కంపెనీలకు భారత్ షాక్
-
పిచ్చెక్కిస్తున్న షావోమీ 12 స్మార్ట్‌ఫోన్ డిజైన్, ఫీచర్స్..!
ప్రముఖ చైనా మొబైల్ తయారీ దిగ్గజం షావోమీ నుంచి త్వరలో ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ షావోమీ 12 రానున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో షావోమీ 12, షావోమీ 12ఎక్స్, షావోమీ 12ప్రో, షావోమీ 12 అల్ట్రా రానున్నాయి. షావోమీ12 సిరీస్ స్మార్ట్ఫోన్ల గురుంచి చైనా టెక్ దిగ్గజం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయితే, ఇటీవల షావోమీ12 స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. అలాగే, రాబోయే స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కొన్ని డిజైన్ కూడా బయటకు వచ్చాయి. షావోమీ 12 స్టాండర్డ్ ఎడిషన్ ఫీచర్స్(అంచనా) తాజాగా లీక్ అయిన షావోమీ 12 స్పెసిఫికేషన్స్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ మొబైల్ డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్ లైట్ తో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెంట్రల్ అలైన్డ్ హోల్ పంచ్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. షావోమీ 12 ఫుల్-హెచ్ డి+(1,920ఎక్స్1,080 పిక్సెల్స్) రిజల్యూషన్ గల డిస్ ప్లేను కలిగి ఉండనుంది. అదనంగా, ఇందులో స్క్రీన్ ఇన్ బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా రానున్నట్లు సమాచారం. షావోమీ 12 స్టాండర్డ్ ఎడిషన్ గతంలో చైనా కంపల్సరీ సర్టిఫికేషన్(3సీ) వెబ్సైట్లో కనిపించింది. ఈ లిస్టింగ్ ప్రకారం.. ఇది 67డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు. బేస్ షావోమీ 12 స్టాండర్డ్ ఎడిషన్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యుఎస్బి టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్, వైర్ లెస్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేయనుంది. షావోమీ 12 8జీబీ ర్యామ్ గల క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరల్ 1 ప్రాసెసర్ సహాయంతో పనిచేయనున్నట్లు సమాచారం. ఈ 5జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో పాటు బ్లూటూత్ వి5.2 కనెక్టివిటీ ఉంటుందని పేర్కొన్నారు. దీని ధర సుమారు రూ.69,990గా ఉండే అవకాశం ఉంది. (చదవండి: అమెరికాకు వచ్చినప్పుడు నా చేతిలో చిల్లి గవ్వ లేదు: ఎలోన్ మస్క్!) -
5జీ నెట్ వర్క్...ముందు నుయ్యి వెనుక గొయ్యి
మనదేశంలోని టెలికాం కంపెనీల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైంది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ టెక్ లవర్స్ సైతం 5జీ టెక్నాలజీ వినియోగంపై ఆసక్తి చూపిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న 4జీ కంటే 5జీ వినియోగం వల్ల టెక్నాలజీతో పాటు అన్నీరంగాల్లో అభివృద్ధి సాధిస్తాయని టెక్ నిపుణుల చెబుతున్నారు. కానీ 5జీ నిర్మాణం అంతసాధ్యం కాదని, భారీ ఇన్వెస్ట్మెంట్లు పెడితే కానీ లాభాలు చవిచూడలేమన్నది దేశీ టెలికాం మాట. మరోవైపు 5జీ టెక్నాలజీలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా లాభాలు వస్తాయని చైనా టెలికాం గణాంకాలు చెబుతున్నాయి. వరల్డ్ వైడ్‌గా మిగిలిన దేశాల్లోకంటే చైనా 5జీ వినియోగంలో ముందంజలో ఉంది. తాజాగా బ్లూంబెర్గ్ రిపోర్ట్ ప్రకారం చైనా ప్రభుత్వానికి చెందిన చైనా మొబైల్ లిమిటెడ్ కంపెనీ మొదటి ఆరునెలల్లో 5జీ వినియోగం వల్ల 6శాతం లాభాల్ని మూటగట్టుకుంది. ఈ ఏడాది నికర ఆదాయం జనవరి నుంచి జులై మధ్య కాలంలో 59.1 బిలియన్ డాలర్లకు చేరింది. నిర్వహణ ఆదాయం 13.8శాతానికి పెరిగింది. ఆ కంపెనీ స్టాక్ వ్యాల్యూ 1.53 యువాన్లు ఉండగా ఇప్పుడు 1.63 యూవాన్లకు పెరిగింది. 5జీలో లాభాలు అధికంగా ఉండటంతో ఇటీవల అమెరికా స్టాక్ ఎక్సేంజీలో బహిష్కరణకు గురైన మూడు టెలికాం కంపెనీలు ఇప్పుడు 5జీపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. 5జీలో లాభాలు ఎంతగా ఉన్నాయనేందుకు ఈ పెట్టుబడుల ప్రవహామే ఓ ఉదాహరణ. డ్రాగన్ కంట్రీలో 5జీ నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తుంటే భారత్ టెలికాం కంపెనీలు మాత్రం పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నాయి. అందుకు కారణం 4జీ నెట్ వర్క్ లో భారీగా నష్టాలు రావడమే. ఒక్క జియో మినహాయించి మిగిలిన ఎయిర్టెల్, ఒడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ కు నష్టాలు వెంటాడుతున్నాయి. అయితే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా టెలికాం శాఖ మాత్రం 2022నాటికి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5జీ నెట్ వర్క్‌ని అందుబాటులోకి తెస్తామని చెప్పింది. మరో 4,5ఏళ్లు 4జీ నెట్ వర్క్ అందుబాటులోకి ఉంటుందని కాబట్టి.. ఈలోపే 5జీ స్పెక్టమ్ ను వేలం వేస్తామని స్పష్టం చేసింది. టెలికాం సంస్థలు మాత్రం వేలంలో తామున్నామంటూ హింట్ ఇస్తున్నా..వేలకోట్లలో అప్పులున్న ఐడియా, వొడాఫోన్ లాంటి సంస్థలు 5జీ వల్ల ఏ మేరకు లాభాలు గడిస్తాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది. చదవండి : గుజరాత్లో జర్మన్ బ్యాంక్, పెట్టుబడి ఎన్నివేల కోట్లంటే?! -
టిక్‌టాక్ యాప్‌పై నిషేధం ఎత్తివేత
సాక్షి, చెన్నై : టిక్‌టాక్ యూజర్లకు గుడ్ న్యూస్. కొన్ని పరిమితులతో టిక్‌టాక్ మొబైల్ యాప్‌పై నిషేధాన్ని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ బుధవారం ఎత్తివేసింది. యువత, చిన్నారుల్లో ఆదరణ పొందిన టిక్‌టాక్ మొబైల్ యాప్‌తో అశ్లీల కంటెంట్ వ్యాప్తి అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నెల 3వ తేదీన కోర్టు యాప్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన ఈ వీడియో షేరింగ్ మొబైల్ యాప్ డౌన్లోడ్పై నిషేధం విధించాలని ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎన్ కురుబకరన్, జస్టిస్ ఎస్ ఎస్ సుందర్‌లతో కూడిన మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. టిక్‌టాక్ అశ్లీలతను పెంపొందించడమే కాకుండా.. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందంటూ మదురైకి చెందిన సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తుకుమార్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని కేంద్రానికి సూచించింది. ఏకపక్షంగా వ్యవహరిస్తూ మద్రాస్ హైకోర్టు విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ టిక్‌టాక్ సంస్థ సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీనిపై ఇరువాదనలు విన్న సుప్రీంకోర్టు టిక్‌టాక్ యాప్‌పై మాద్రాస్ హైకోర్టు విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసిన విషయం తెలిసిందే. కాగా చైనాలో ఈ యాప్ 2016లో ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది వినియోగదారులతో 75 భాషల్లో ఈ అప్లికేషన్ టాప్ సోషల్ యాప్‌లలో ఒకటిగా ట్రెండ్ అవుతోంది. ఎలాంటి ప్రత్యేకమైన సెటప్ లేకుండా ఫోన్‌ని చేతిలో పట్టుకొని 15 సెకండ్ల వ్యవధితో రెడీమేడ్‌గా ఉండే డైలాగ్స్, పాటలకు తగ్గట్లు పెదాలను సింక్ చేస్తూ చాలా వేగంగా షార్ట్ వీడియోలు తీయగలగడం దీని ప్రత్యేకత. టిక్‌టాక్‌ని ఎంతమంది వారి ప్రతిభను ప్రదర్శించడానికి ఉపయోగిస్తున్నారో, అంతకుమించి దుర్వినియోగం కూడా చేస్తున్నారు. కొందరు అడల్ట్ కంటెంట్‌ని కూడా అప్లోడ్ చేస్తున్నారు. అశ్లీల దృశ్యాలతో కొందరు యువతీ, యువకులు వీడియోలు తీయడం, మరికొంతమంది వికృత చేష్టలు, పిచ్చి పనులుచేస్తూ ఆ వీడియోలను కూడా పోస్ట్ చేయడంతో వివాదం కూడా అవుతోంది. ఇటీవల చెన్నై ముగప్పేర్ ప్రాంతానికి చెందిన ఒక బాలిక స్థానికంగా ఓ సంస్థలో నటనలో శిక్షణ పొందుతోంది. టిక్‌టాక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి 15 ఏళ్ల బాలికకు సినిమా చాన్స్ ఇప్పిస్తానని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే రాష్ట్రం సేలం జిల్లా కలెక్టర్ రోహిణి ఫొటోలను పెట్టి ఒక టిక్ టాక్ వీడియో తయారు చేసి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దానిని వైరల్ చేశారు. సినిమా పాటలతో లింక్ చేసి టిక్‌టాక్ యాప్‌లో పోస్ట్ చేశారు. వీటిని గమనించిన కలెక్టర్ దిగ్భ్రాంతి చెంది, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మరో షాక్ : చైనా మొబైల్‌పై నిషేధం
వాషింగ్టన్ : పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ.. అంతర్జాతీయ వాణిజ్యాన్ని హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా టెలికమ్యూనికేషన్ మార్కెట్‌కు ఆఫర్ చేసే ‘చైనా మొబైల్’ సర్వీసులను బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించారు. దేశ భద్రతా ప్రమాదాల దృష్ట్యా దీన్ని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీంతో ఇక చైనా మొబైల్ ఆ దేశంలో ఆపరేట్ చేయడానికి వీలులేదు. నేషనల్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన ప్రకటనలో ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్‌కు చైనా మొబైల్‌ను అనుమతించకూడదని సూచించింది. ఏటీ అండ్ టీ, వెరిజోన్ అనంతరం ప్రపంచంలో అతిపెద్ద సంస్థ ఇదే కావడం గమనార్హం. గత కొన్ని నెలలుగా అమెరికా, చైనాపై తీసుకుంటున్న చర్యలు తెలిసినవే. ముఖ్యంగా చైనా టెక్ కంపెనీలు తమ మేథోసంపత్తి హక్కులను దొంగలిస్తున్నాయంటూ ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. చైనా మొబైల్ దోపిడీకి దారితీసే అవకాశముందని, ఇది చైనా ప్రభుత్వ చెప్పుచేతల్లో నడుస్తుందని, దీంతో దేశ భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అకాశముందని అమెరికా అథారిటీలు పేర్కొంటున్నాయి. చైనా మొబైల్‌తో కార్యకలాపాలు పెరిగితే, అమెరికా న్యాయ వ్యవస్థకు ప్రమాదాలు పెరిగి, దేశ భద్రతా ప్రయోజనాలను పరిష్కరించుకోలేమని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ సెక్రటరీ డేవిడ్ రెడ్ల్ చెప్పారు. ప్రస్తుతం చైనా మొబైల్‌కు 899 మిలియన్ మంది సబ్స్క్రైబర్లున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చైనా మొబైల్ ఇంకా స్పందించలేదు. చైనా మొబైల్‌పై నిషేధం వాషింగ్టన్, బీజింగ్‌ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వివాదాలు ముదురుతున్నట్టు తెలిసింది. జూలై 6 నుంచి 34 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై కూడా టారిఫ్‌లు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దీనికి తగ్గట్టు బీజింగ్ కూడా స్పందించనున్నట్టు ప్రకటించింది. -
చైనా మొబైల్ ఏ రేంజ్లో పేలిందంటే..!
బీజింగ్: చైనా మొబైల్స్ పేలుతున్నాయి అని సాధారణంగా వింటుంటాం. కానీ ఓ చైనా మొబైల్ మాత్రం ఓ రేంజ్లో పేలిపోవడం ఓ బాలుడి పాలిట శాపంగా మారింది. ఛార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్ పేలడంతో బాలుడు(12) ఏకంగా ఓ కన్ను చూపు కోల్పోయాడు. అంతటితో పాటు అతడి కుడిచేతి చూపుడు వేలు విరిగి ముక్కలై చేతి నుంచి వేరయింది. ఈ విషాద ఘటన చైనాలో ఇటీవల చోటు చేసుకుంది. దక్షిణ చైనాలోని గ్వాంగ్జి ప్రావిన్స్ ప్రాంతంలో మెంజ్ జిషూ(12) తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం రోజు తన హువా టాంగ్ వీటీ-వీ59 మోడల్ మొబైల్‌ను ఇంట్లో ఛార్జింగ్ పెట్టాడు జిషూ. కొద్దిసేపు తర్వాత ఫోన్‌ను ఛార్జింగ్ తీసేయాలని చూడగా.. చేతిలోకి తీసుకున్న వెంటనే భారీ శబ్ధంతో ఆ మొబైల్ పేలిపోయింది. ప్లాస్టిక్ ముక్కలు బాలుడి తల, కంట్లోకి చొచ్చుకెళ్లడంతో క్షణాల్లో కుప్పకూలిన బాలుడికి తీవ్ర రక్తస్రావమైంది. కొంత సమయం తర్వాత బాబుని చూడగా.. అతడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే తమ్ముడు జిషూని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు బాలుడి అక్క తెలిపారు. దాదాపు ఐదు గంటలపాటు తీవ్రంగా శ్రమించి సర్జరీ చేసి జిషూని బతికించినట్లు డాక్టర్ లాన్ టియాన్‌బింగ్ చెప్పారు. హాస్పిటల్‌కు తెచ్చేటప్పటికే బాలుడి కుడిచేతి చూపుడువేలు లేదని, ఇప్పుడు సర్జరీ చేసినా అతికించడం కుదరదని పేర్కొన్నారు. బాలుడి తల, కన్ను, ముఖం భాగాల్లోకి వెళ్లిన ప్లాస్టిక్ ముక్కలను అతికష్టమ్మీద తొలగించాం, అతడి ప్రాణాలకు ముప్పులేదన్నారు. భవిష్యత్తులో అతడి కుడిచేతి యథావిధిగా పని చేస్తుందని చెప్పిన డాక్టర్లు.. అందుకు కొంత సమయం పడుతుందన్నారు. మొబైల్ పేలిన ఘటనపై టాంగ్ వీటీ కంపెనీ ఇంకా స్పందించలేదని సమాచారం. -
జియోనీ ‘ఎం7 పవర్’ ధర రూ.16,999
న్యూఢిల్లీ: చైనా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘జియోనీ’ తాజాగా ‘ఎం7 పవర్’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.16,999. గోల్డ్, బ్లూ, బ్లాక్ రంగుల్లో లభ్యంకానున్న ఈ స్మార్ట్ఫోన్లలో 5,000 ఎంఏహెచ్ లాంగ్‌లైఫ్ బ్యాటరీ, 6 అంగుళాల హెచ్డీ ప్లస్ ఫుల్‌వ్యూ డిస్ప్లే (18:9 రేషియో), ఆండ్రాయిడ్ నుగోట్ 7.1.1 ఆపరేటింగ్ సిస్టమ్, 4 జీబీ ర్యామ్, 1.4 గిగాహెర్ట్›్జ ఆక్టాకోర్ ప్రాసెసర్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 64 జీబీ మెమరీ, 3డీ ఫొటోలు, వాట్సాప్ క్లోన్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలియజేసింది. కాగా ఈ స్మార్ట్ఫోన్లు నవంబర్ 25 నుంచి లభిస్తాయి. -
చైనా మొబైల్ తో నోకియా డీల్
హెల్సింకి : చైనా మొబైల్ తో నోకియా కార్పొరేషన్ 15 కోట్ల డాలర్ల(1.5 బిలియన్ డాలర్లు) ఫ్రేమ్ వర్క్ డీల్ కుదుర్చుకుంది. ఏడాదిపాటు కొనసాగే ముసాయిదా ఒప్పందంపై నోకియా సంతకం చేసింది. ఈ విషయాన్ని ఫినిష్ మల్టీనేషనల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ నోకియా సోమవారం వెల్లడించింది. అదేవిధంగా ఫ్రెంచ్ గ్లోబల్ టెలికమ్యూనికేషన్ ఎక్విప్ మెంట్ కంపెనీ అల్కాటెల్-లూసెంట్ విలీన కార్యకలాపాలతో నోకియా ..మార్కెట్ షేరు కోల్పోతున్నట్టు కూడా భయాందోళను వ్యక్తచేసింద. నోకియా నెట్ వర్క్ ఎక్విప్ మెంట్ అమ్మకాలు మొదటి త్రైమాసికంలో అంచనా వేసిన దానికంటే అధికంగా పడిపోయాయి. అల్కాటెల్ అనుసంధాన ప్రక్రియతో కొనుగోలుదారులు నోకియా నుంచి తరలిపోయారు. చైనాలో నోకియాకు చైనా మొబైల్ అతిపెద్ద వినియోగదారుడిగా ఉంది. చైనా మొబైల్ తో నోకియా ముసాయిదా ఒప్పందం కుదుర్చుకుందన్న ప్రకటన నేపథ్యంలో పాత నోకియా, పాత అల్కాటెల్ లు తమ స్థానాలను బలపర్చుకుంటున్నాయని నోర్డియా విశ్లేషకుడు సామీ సర్కామిస్ చెప్పారు. చైనా మార్కెట్ ఈ ఏడాది మంచిగానే ఉంటుందని, అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఫ్రాంకో-అమెరికా సంస్థ అల్కాటెల్-లూసెంట్ ను 15.6 బిలియన్ యూరోలకు నోకియా ఈ ఏడాది మొదట్లో కొనుగోలు చేసింది. ఈ డీల్ తో స్వీడన్ ఎర్సికన్, చైనా హ్యువాయ్ తో ఫిక్స్ డ్ లైన్-మొబైల్ నెట్ వర్క్ ఎక్విప్ మెంట్ లో పోటీ పడుతోంది. ఈ కొనుగోలు ఒప్పందంతో కంపెనీ గ్లోబల్ గా 10 వేల నుంచి 15 వేల వరకు ఉద్యోగాల్లో కోత విధించడం లేదా 14 శాతం ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోందని భావిస్తున్నారు. -
5జీ కోసం ఎయిర్టెల్, చైనా మొబైల్ ఒప్పందం
బార్సిలోనా: 5జీ వంటి హై-టెక్నాలజీ, 4జీ సేవల విస్తరణ, పలు టెలికాం పరికరాల ఉత్పత్తికోసం భారత టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు, ప్రపంచ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ చైనా మొబైల్ల మధ్య ఒప్పందం కుదిరింది. ‘ప్రపంచంలోని మొత్తం మొబైల్ వినియోగదారుల్లో మూడో వంతు చైనా, భారత్‌లలో ఉన్నారు. ఈ ఒప్పందం 4జీ అభివృద్ధి, విస్తరణతోపాటు 5జీ సేవలకు, డాటా వినియోగంలో విప్లవాత్మకమైన వృద్ధికి అనువైన వేదికగా మారనుంది’ అని ఎయిర్టెల్ చైర్మన్ సునిల్ మిట్టల్ అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండు సంస్థలు పోర్టబుల్ వై-ఫై పరికరాలు, స్మార్ట్ఫోన్లు, డాటా కార్డులు, మోడెం, యూనివర్సల్ సిమ్ తదితర ఉత్పత్తులను రూపొందించనున్నాయి. ఉమ్మడి భాగస్వామ్యంతో నెట్వర్క్ పరికరాలు, పలు కొత్త ఉత్పత్తుల కోసం అవసరమైన టెక్నాలజీని పరస్పరం మార్పిడి చేసుకోనున్నాయి. బార్సిలోనా: 5జీ వంటి హై-టెక్నాలజీ, 4జీ సేవల విస్తరణ, పలు టెలికాం పరికరాల ఉత్పత్తికోసం భారత టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు, ప్రపంచ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ చైనా మొబైల్ల మధ్య ఒప్పందం కుదిరింది. ‘ప్రపంచంలోని మొత్తం మొబైల్ వినియోగదారుల్లో మూడో వంతు చైనా, భారత్‌లలో ఉన్నారు. ఈ ఒప్పందం 4జీ అభివృద్ధి, విస్తరణతోపాటు 5జీ సేవలకు, డాటా వినియోగంలో విప్లవాత్మకమైన వృద్ధికి అనువైన వేదికగా మారనుంది’ అని ఎయిర్టెల్ చైర్మన్ సునిల్ మిట్టల్ అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండు సంస్థలు పోర్టబుల్ వై-ఫై పరికరాలు, స్మార్ట్ఫోన్లు, డాటా కార్డులు, మోడెం, యూనివర్సల్ సిమ్ తదితర ఉత్పత్తులను రూపొందించనున్నాయి. ఉమ్మడి భాగస్వామ్యంతో నెట్వర్క్ పరికరాలు, పలు కొత్త ఉత్పత్తుల కోసం అవసరమైన టెక్నాలజీని పరస్పరం మార్పిడి చేసుకోనున్నాయి. ఎయిర్టెల్, చైనా మొబైల్, 5జీ, airtel, china mobile, 5G