బార్సిలోనా: 5జీ వంటి హై-టెక్నాలజీ, 4జీ సేవల విస్తరణ, పలు టెలికాం పరికరాల ఉత్పత్తికోసం భారత టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు, ప్రపంచ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ చైనా మొబైల్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. ‘ప్రపంచంలోని మొత్తం మొబైల్ వినియోగదారుల్లో మూడో వంతు చైనా, భారత్‌లలో ఉన్నారు. ఈ ఒప్పందం 4జీ అభివృద్ధి, విస్తరణతోపాటు 5జీ సేవలకు, డాటా వినియోగంలో విప్లవాత్మకమైన వృద్ధికి అనువైన వేదికగా మారనుంది’ అని ఎయిర్‌టెల్ చైర్మన్ సునిల్ మిట్టల్ అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండు సంస్థలు పోర్టబుల్ వై-ఫై పరికరాలు, స్మార్ట్‌ఫోన్లు, డాటా కార్డులు, మోడెం, యూనివర్సల్ సిమ్ తదితర ఉత్పత్తులను రూపొందించనున్నాయి. ఉమ్మడి భాగస్వామ్యంతో నెట్‌వర్క్ పరికరాలు, పలు కొత్త ఉత్పత్తుల కోసం అవసరమైన టెక్నాలజీని పరస్పరం మార్పిడి చేసుకోనున్నాయి.

ఎయిర్‌టెల్, చైనా మొబైల్, 5జీ,
airtel, china mobile, 5G