జియోనీ ‘ఎం7 పవర్‌’ ధర రూ.16,999 | Zion's M7 Power is priced at Rs 16,999 | Sakshi
Sakshi News home page

జియోనీ ‘ఎం7 పవర్‌’ ధర రూ.16,999

Published Fri, Nov 17 2017 12:25 AM | Last Updated on Fri, Nov 17 2017 12:25 AM

Zion's M7 Power is priced at Rs 16,999 - Sakshi

న్యూఢిల్లీ: చైనా మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘జియోనీ’ తాజాగా ‘ఎం7 పవర్‌’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.16,999. గోల్డ్, బ్లూ, బ్లాక్‌ రంగుల్లో లభ్యంకానున్న ఈ స్మార్ట్‌ఫోన్లలో 5,000 ఎంఏహెచ్‌ లాంగ్‌లైఫ్‌ బ్యాటరీ, 6 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఫుల్‌వ్యూ డిస్‌ప్లే (18:9 రేషియో), ఆండ్రాయిడ్‌ నుగోట్‌ 7.1.1 ఆపరేటింగ్‌ సిస్టమ్, 4 జీబీ ర్యామ్, 1.4 గిగాహెర్ట్‌›్జ ఆక్టాకోర్‌ ప్రాసెసర్, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్, 13 ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 64 జీబీ మెమరీ, 3డీ ఫొటోలు, వాట్సాప్‌ క్లోన్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలియజేసింది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్లు నవంబర్‌ 25 నుంచి లభిస్తాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement