శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్
స్మార్ట్‌ఫోన్ల రారాజు శాంసంగ్ త్వరలోనే మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అది గెలాక్సీ నోట్ 9గా మార్కెట్‌లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. గెలాక్సీ నోట్ 8కు సక్ససర్‌గా దీన్ని తీసుకురాబోతున్నట్టు టెక్ వర్గాల టాక్. కానీ దీనిపై ఇంకా శాంసంగ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. జూలై నెలలో గెలాక్సీ నోట్ 9ను శాంసంగ్ లాంచ్ చేస్తుందని ప్రముఖ బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ రిపోర్టు చేసింది. లాంచింగ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన పలు లీక్‌లు కూడా ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజా లీకేజీల ప్రకారం గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో మార్కెట్‌లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది.
కానీ అంతకముందు నుంచి వచ్చిన రూమర్ల ప్రకారమైతే గెలాక్సీ నోట్ 9 కేవలం మూడు వేరియంట్లోనే మార్కెట్‌లోకి వస్తుందని సమాచారం. ఒకటి 64జీబీ స్టోరేజ్, రెండు 128జీబీ స్టోరేజ్, మూడు 256జీబీ స్టోరేజ్. ఈ మూడు స్టోరేజ్ మోడల్స్ కూడా 6జీబీ ర్యామ్‌తోనే రూపొందుతున్నాయని టాక్. కానీ తాజాగా ఓ ట్విటర్ యూజర్ ఇచ్చిన లీకేజీ ప్రకారం నాలుగో మోడల్‌ను శాంసంగ్ రూపొందిస్తుందని తెలుస్తోంది. నాలుగో మోడల్ అత్యంత ఖరీదైన వేరియంట్ అని, అది 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో రూపొందిస్తున్నారని ఓ ట్విటర్ యూజర్ లీక్ చేశాడు. అయితే దాన్ని లిమిటెడ్ ఎడిషన్‌లో తీసుకొచ్చి, ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఈ డివైజ్‌కు సంబంధించే పలు హార్డ్‌వేర్ వివరాలను గీక్‌బెంచ్ వెబ్‌సైట్ లిస్టు చేసింది. ఈ డివైజ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845తో వస్తుందని, అదేవిధంగా రెండో మోడల్ శాంసంగ్‌కు చెందిన ఎక్సీనోస్ 9810 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 6.38 అంగుళాల ఓలెడ్ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే, 3850 ఎంఏహెచ్ బ్యాటరీ, మెరుగైన ఎస్-పెన్, గెలాక్సీ ఎస్9 ప్లస్‌కు ఉన్న మాదిరిగానే కెమెరా సెటప్ వంటి ఫీచర్లున్నాయని ముందస్తు రిపోర్టులు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment