Galaxy Note
-
గెలాక్సీ నోట్ ఫోన్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్
వచ్చే ఏడాది శామ్సంగ్ తన ప్రీమియం గెలాక్సీ నోట్ ఫోన్‌ను నిలిపివేయవచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా హై-ఎండ్ స్మార్ట్ఫోన్ల డిమాండ్ గణనీయంగా తగ్గినా కారణంగా వీటిని వచ్చే ఏడాది నిలిపివేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. పెద్ద స్క్రీన్, ఆకర్షణీయమైన డిజైన్, ఎస్ పెన్ వంటి ఎన్నో ప్రత్యేకతలు నోట్ ఫోన్లలో ఉన్నాయి. అలాగే గతంలో ప్రీమియం ఫోన్ సిరీస్ గెలాక్సీ ఎస్, గెలాక్సీ నోట్ ఫోన్ లను కలిపి ఒకే ఫోన్ తీసుకురానున్నట్లు వార్తలు వచ్చాయి. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ 2021లో గెలాక్సీ నోట్ తీసుకురావడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కనిపించడంలేదు. అయితే ఈ విషయంపై శామ్సంగ్ ఎటువంటి సమాచారం వివరణ ఇవ్వలేదు.(చదవండి: ఛాట్ ఛాట్‌కి కొత్త వాల్‌పేపర్) సామ్సంగ్ నోట్ సిరీస్ అమ్మకాలు ఈ ఏడాది 8 నుంచి 5 మిలియన్లకు తగ్గుతాయని, ఎస్ సిరీస్ అమ్మకాలు 30 మిలియన్ల నుంచి 5 మిలియన్లకు తగ్గే అవకాశం ఉందని పరిశోధనా సంస్థ కౌంటర్ పాయింట్ విశ్లేషకుడు టామ్ కాంగ్ తెలిపారు. "ఈ సంవత్సరం ప్రీమియం డిమాండ్ తగ్గింది మరియు చాలా మంది కొత్త ఉత్పత్తుల కోసం చూడటం లేదు" అని ఆయన అన్నారు. ఈ ఏడాదిలో గెలాక్సీ నోట్ 20ని అమెరికాలో 999 డాలర్లకు విడుదల చేయగా, గెలాక్సీ ఎస్20ని 799 డాలర్లకు విడుదల చేసింది. శామ్సంగ్ మొట్టమొదటిసారిగా 2011లో నోట్‌ను ప్రారంభించింది, ఆ సంవత్సరంలో ఆపిల్‌ను అధిగమించి తొలిసారిగా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా నిలిచింది. -
శాంసంగ్ గెలాక్సీ నోట్ 20పై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. శాంసంగ్ డేస్ సేల్ లో భాగంగా పలు మొబైళ్లపై తగ్గింపు ధరలను సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా గెలాక్సీ నోట్ 20పై 9 వేల రూపాయల పరిమితకాల తక్షణ డిస్కౌంట్ అందిస్తోంది. దీనికి అదనంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుదారులకు 6,000క్యాష్‌బ్యాక్ కూడా లభ్యం. ఈ ఆఫర్ సెప్టెంబర్ 23వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ తోపాటు, ప్రముఖ ఆన్లైన్ పోర్టల్స్ ,రిటైల్ స్టోర్లలో ఈ తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు శాంసంగ్ ఇతర గెలాక్సీ ఫోన్లపై కూడా తగ్గింపు అఫర్లను అందుబాటులో ఉంచింది. గెలాక్సీ నోట్ 20 లాంచింగ్ ధర 77,999 రూపాయలు. సేల్ ధర 68,999 రూపాయలు. ఒకవేళ హెచ్డీఎఫ్సీ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో ఆరువేల తగ్గింపు. మొత్తంగా ఈ స్మార్ట్ ఫోన్ ను 62,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. మిస్టిక్ బ్రాంజ్, మిస్టిక్ గ్రీన్, మిస్టిక్ బ్లూ రంగులలో ఇది లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 ఫీచర్లు 6.70 అంగుళాల హెచ్డి ఇన్ఫినిటీ-ఓ సూపర్ అమోలెడ్ + ఫ్లాట్ డిస్ప్లే 1080x2400 పిక్సెల్స్ రిజట్యూషన్ ఆండ్రాయిడ్ 10 శాంసంగ్ ఎక్సినోస్ 990ప్రాసెసర్ 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 12+64+12మెగాపిక్సెల్ రియర్ ట్రిపుల్ కెమెరా 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 4300 ఎంఏహెచ్ బ్యాటరీ -
శాంసంగ్ కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 9
-
అద్భుతంగా ఉన్న గెలాక్సీ నోట్ 9..
స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్ తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 9 ను మార్కెట్లోకి విడుదల చేసింది. భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి 8.30 గంటలకు న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జరిగిన ఈవెంట్లో శాంసంగ్ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. అదరగొట్టే ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ విడుదల చేసింది. డిస్ప్లే, డిజైన్... శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌లో అతిపెద్దగా 6.4 ఇంచుల భారీ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. క్వాడ్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ (1440x 2960పిక్సల్స్)ను గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో ఇది మార్కెట్లోకి వచ్చింది. ముందు, వెనుక భాగాల్లో ఉన్న బాడీకి ఈ ప్రొటెక్షన్ ఉంది. ఇక ఈ ఫోన్ మ్యాట్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. గెలాక్సీ నోట్ 5 మాదిరిగా ఫోన్ ఎడ్జ్‌లను అద్భుతంగా తీర్చిదిద్దడం దీనికి ప్రీమియం లుక్‌ను అందిస్తోంది. మిడ్నైట్ బ్లాక్, లావెండర్ పర్పుల్, మెటాలిక్ కాపర్, ఓషియన్ బ్లూ కలర్ వేరియెంట్లలో వినియోగదారులకు ఈ ఫోన్ లభ్యం కానుంది. ఈ ఫోన్లో మరో ప్రత్యేకత ర్యామ్, స్టోరేజ్. ర్యామ్ స్టోరేజ్ ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం.. 6/8 జీబీ ర్యామ్ ఆప్షన్లలో దీని రూపొందించారు. ర్యామ్‌తో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 512 జీబీ వరకు స్టోరేజ్‌ను ఈ ఫోన్లో శాంసంగ్ ఆఫర్ చేస్తోంది. అంతేకాక మైక్రో ఎస్డీ కార్డుతో మరో 512 జీబీ స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. దీంతో మొత్తంగా ఈ ఫోన్ 1 టీబీ స్టోరేజ్ ఉంటుంది. ర్యామ్ ఎక్కువగా ఉండటం వల్ల ఫోన్ అద్భుతమైన వేగంతో పనిచేస్తుంది. మంచి ప్రదర్శనను ఇస్తుంది. 6జీబీ ర్యామ్ ఆప్షన్లో 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ను కూడా అందిస్తున్నారు. గెలాక్సీ నోట్9 స్మార్ట్‌ఫోన్‌లో అధునాతన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఇండియన్ వేరియెంట్లో శాంసంగ్ సొంత చిప్సెట్ అయిన ఎగ్జినోస్ 9810 ను ఏర్పాటు చేశారు. గెలాక్సీ నోట్ 9 కెమెరా, మిగతా ఫీచర్లు... 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో సింగిల్/హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ డాల్బీ అట్మోస్ ఎస్ పెన్, బారో మీటర్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్, ఐరిస్ సెన్సార్, ప్రెషర్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్ ధర, లభ్యత... గెలాక్సీ నోట్ 9 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 999 డాలర్లు (దాదాపుగా రూ.68,700)గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 1250 డాలర్లు (దాదాపుగా రూ.85,900)గా ఉంది. అమెరికా మార్కెట్లో ఈ ఫోన్‌ను ఈ నెల 24వ తేదీ నుంచి విక్రయించనున్నారు. నేటి నుంచి అక్కడ ఈ ఫోన్‌కు గాను ప్రీ ఆర్డర్లను ప్రారంభించనున్నారు. అయితే ఈ ఫోన్‌ను భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారు, ధర తదితర వివరాలను మాత్రం శాంసంగ్ వెల్లడించలేదు. కానీ అతి త్వరలోనే గెలాక్సీ నోట్ 9 ను భారత మార్కెట్లోనూ లాంచ్ చేయనున్నారు. -
దిగ్గజాల కలవరం : శాంసంగ్ ఆ ఫ్లాగ్షిప్ వచ్చేస్తోంది
స్మార్ట్ఫోన్ల ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న శాంసంగ్, దిగ్గజాలను కలవరపెడుతోంది. స్మార్ట్ఫోన్ల రారాజుగా ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్న శాంసంగ్ త్వరలోనే మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. అదే గెలాక్సీ నోట్ 9గా తెలుస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్‌ను ఆగస్టు 9న గ్లోబల్‌గా లాంచ్ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఈ డివైజ్ గురించి ఓ టీజ్ కూడా చేసింది. తర్వాత నోట్ లాంచింగ్ ఈవెంట్న్యూయార్క్లో ఉంటుందని తెలిపింది. అదే రోజు భారత్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్టు దేశీయ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ తన వెబ్సైట్లో పేర్కొంది. నోట్ 9 లాంచింగ్ గురించి ఓ టీజర్‌ను కూడా పోస్టు చేసింది. అదే టీజర్‌ను శాంసంగ్ తన మొబైల్ యాప్‌లో కూడా పొందుపరించింది. అయితే ఆగస్టు 9న భారత్‌లో గెలాక్సీ 9ను సాఫ్ట్ లాంచ్ చేయనుందని.. అధికారిక లాంచ్ మాత్రం ఆగస్టు 15నేనని, అదే రోజు విక్రయాలు కూడా ప్రారంభమవుతాయనీ తెలుస్తోంది. దీంతో గెలాక్సీ నోట్ 9 అందుబాటులోకి రాబోతున్న తొలి దేశాల్లో భారత్ కూడా ఉంటుంది. ఈ డివైజ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే గెలాక్సీ నోట్ 9 ధర ఎలా ఉంటుందో సమాచారం లేదు. కనీసం 70 వేల రూపాయలు లేదా అంతకంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చని తెలుస్తోంది. ఇది ఆల్ట్రా హై-ఎండ్ ఫోన్‌గా మార్కెటోకి వస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన లీక్‌ల ప్రకారం గెలాక్సీ నోట్ 9 ఫీచర్లు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం... 6.4 అంగుళాల హై-రెజుల్యూషన్ ఓలెడ్ స్క్రీన్ 3850 ఎంఏహెచ్ బ్యాటరీ 6 జీబీ ర్యామ్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ ఓరియో అమెరికా, ఇతర కొన్ని దేశాల్లో నోట్ 9 ప్రాసెసర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 స్వదేశం, కీ మార్కెట్లలో ఎక్సీనోస్ 9810 ప్రాసెసర్ వెనుకవైపు డ్యూయల్ కెమెరా సిస్టమ్ ముందు వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా యానిమేటెడ్ ఎమోజీలు, ఫేస్ అన్‌లాక్, పోట్రైట్ మోడ్ -
రాబోతున్న హై-ఎండ్ గెలాక్సీ ఇక్కడిదే...
న్యూఢిల్లీ : దక్షిణ కొరియాకి చెందిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ తయారీ ప్లాంటును ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ రెండు రోజుల క్రితం దీన్ని ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీలో శాంసంగ్ తర్వాత తీసుకురాబోతున్న హై-ఎండ్ గెలాక్సీ నోట్ 9ను తయారు చేస్తున్నట్టు తెలిసింది. ఈ నెల చివరిలో దీని తయారీని ప్రారంభించనున్నట్టు శాంసంగ్ సీనియర్ అధికారులు చెప్పారు. ఈ కొత్త తరం డివైజ్.. మేడిన్ ఇండియా ప్రొడక్ట్‌గా, గ్లోబలీ ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు. ‘నోయిడా ఫ్యాక్టరీలో అన్ని హై-ఎండ్ శాంసంగ్ మోడల్స్‌ను రూపొందించడం జరుగుతుంది. జూలై చివరి నుంచి గెలాక్సీ నోట్ 9 తయారీని ప్రారంభిస్తున్నాం. ఆగస్టు చివరిలో ఈ ఫోన్ దేశీయ మార్కెట్లోకి వస్తుంది’ అని సీనియర్ అధికారులు చెప్పారు. విస్తరించడానికి ముందు కంపెనీ ప్రొడక్షన్ అవుట్‌పుట్ 10 శాతం ఎగుమతి చేశామని, అంటే నెలకు 50 లక్షల యూనిట్లు ఎగుమతి చేసినట్టు చెప్పారు. ఈ సెల్ఫోన్లను రష్యా, దుబాయ్, తూర్పు యూరోపియన్ దేశాలు, ఆఫ్రికాలకు సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్లాంట్ విస్తరణతో దీన్ని నెలకు 70 లక్షల యూనిట్లకు చేయనున్నారు. 2020 నాటికి 30 శాతానికి ఎగుమతులను పెంచనున్నట్టు తెలిపారు. త్వరలోనే మేకిన్ ఇండియా ప్రొడక్ట్‌గా గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించబోతున్న గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ హై ఎండ్ ఫీచర్లు.. 1.8 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను, 64 జీబీ స్టోరేజ్‌ను, 2 టీబీ వరకు విస్తరణ మెమరీని, 6.0 అంగుళాల డిస్ప్లేను, 4000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండబోతుంది. -
ఆ ఫోన్‌కు 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్
స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్ త్వరలోనే మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అది గెలాక్సీ నోట్ 9గా మార్కెట్లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. గెలాక్సీ నోట్ 8కు సక్ససర్‌గా దీన్ని తీసుకురాబోతున్నట్టు టెక్ వర్గాల టాక్. కానీ దీనిపై ఇంకా శాంసంగ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. జూలై నెలలో గెలాక్సీ నోట్ 9ను శాంసంగ్ లాంచ్ చేస్తుందని ప్రముఖ బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ రిపోర్టు చేసింది. లాంచింగ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన పలు లీక్‌లు కూడా ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. తాజా లీకేజీల ప్రకారం గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో మార్కెట్లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. కానీ అంతకముందు నుంచి వచ్చిన రూమర్ల ప్రకారమైతే గెలాక్సీ నోట్ 9 కేవలం మూడు వేరియంట్లోనే మార్కెట్లోకి వస్తుందని సమాచారం. ఒకటి 64జీబీ స్టోరేజ్, రెండు 128జీబీ స్టోరేజ్, మూడు 256జీబీ స్టోరేజ్. ఈ మూడు స్టోరేజ్ మోడల్స్ కూడా 6జీబీ ర్యామ్‌తోనే రూపొందుతున్నాయని టాక్. కానీ తాజాగా ఓ ట్విటర్ యూజర్ ఇచ్చిన లీకేజీ ప్రకారం నాలుగో మోడల్‌ను శాంసంగ్ రూపొందిస్తుందని తెలుస్తోంది. నాలుగో మోడల్ అత్యంత ఖరీదైన వేరియంట్ అని, అది 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో రూపొందిస్తున్నారని ఓ ట్విటర్ యూజర్ లీక్ చేశాడు. అయితే దాన్ని లిమిటెడ్ ఎడిషన్‌లో తీసుకొచ్చి, ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఈ డివైజ్‌కు సంబంధించే పలు హార్డ్‌వేర్ వివరాలను గీక్‌బెంచ్ వెబ్సైట్ లిస్టు చేసింది. ఈ డివైజ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845తో వస్తుందని, అదేవిధంగా రెండో మోడల్ శాంసంగ్‌కు చెందిన ఎక్సీనోస్ 9810 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 6.38 అంగుళాల ఓలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే, 3850 ఎంఏహెచ్ బ్యాటరీ, మెరుగైన ఎస్-పెన్, గెలాక్సీ ఎస్9 ప్లస్‌కు ఉన్న మాదిరిగానే కెమెరా సెటప్ వంటి ఫీచర్లున్నాయని ముందస్తు రిపోర్టులు పేర్కొన్నాయి. -
డీజీసీఏ, శాంసంగ్ సమావేశం
న్యూఢిల్లీ: ఇండిగో విమానంలో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ ప్రమాదాల నేపథ్యంలో శాంసంగ్ సీనియర్ అధికారులు డీజీసీఏ అధికారులను కలిశారు. రెండురోజుల క్రితం ఇండిగో విమానంలో పొగలువ్యాపించిన నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)అధికారులను శాంసంగ్ ప్రతినిధులు సోమవారం కలుసుకున్నారు. దాదాపు గంటసేపు జరిగిన సమావేశంలో ఏవియేషన్ రెగ్యులేటరీ గెలాక్సీ ఫోన్ల బ్యాటరీ పేలుళ్లు, ప్రమాదాలపై సాంకేతిక అంశాలు అడిగి తెలుసుకుంది. అలాగే 'గెలాక్సీ నోట్ 7' సెప్టెంబర్ 15 వరకూ తయారైన ఫోన్లను బ్యాటరీ సమస్యలు పరిష్కరించే చర్యల్లో భాగంగా దేశంలో ఈ మొబైల్స్ ను విక్రయించబోమని శామ్సంగ్ అధికారులు డీజీసీఏకు తెలిపినట్టు సమాచారం. కాగా సింగపూర్ వస్తున్న ఇండిగో విమానం చెన్నై విమానాశ్రయంలో ల్యాండింగ్ సందర్భంగా సెప్టెంబర్ 23 న ఒక శాంసంగ్ గెలాక్సీ నోట్ 2 స్మార్ట్ ఫోన్ ప్రమాదంతో పొగలు వచ్చిన ఘటన ఆందోళన రేపిన సంగతి తెలిసిందే. వివిధ దేశాలలో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలుడు ఘటనలు నమోదవుతున్నప్పటికీ , దేశంలో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం మొదటిసారి. దీంతోఈ ఘటనపై వెంటనే అప్రమత్తమైన డీజీసీఏ విమానాల్లో శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల వాడకంపై మరోసారి నిషేధాజ్ఞలు జారీ చేసింది. దీంతోపాటుఈ రోజు సమావేశానికి హాజరు కావాల్సిందిగా శాంసంగ్ కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ సమావేశం గురించి వ్యాఖ్యానించడానికి , డీజీసీఏ అధికారులు అందుబాటులో లేరు. మరోవైపు శాంసంగ్ ప్రతినిధులు దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. -
మా ఫోన్ల వాడకం ఆపండి..!